Nindu Manasulu Serial Today August 21st: నిండు మనసులు: విశ్వనాథం పెట్టిన పరీక్షలో సిద్ధూ, ప్రేరణ గెలిచారా? తిండి పెట్టి గణని దారుణంగా అవమానించి విజయానంద్!
Nindu Manasulu Serial Today Episode August 21st విశ్వనాథం గారు ప్రేరణ, సిద్ధూ ఇద్దరికీ కోచింగ్ ఇస్తానని చెప్పడం, విజయానంద్ గణని తిండి పెట్టి ఘోరంగా అవమానించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణని సిద్ధూ కాపాడటాన్ని ప్రేరణ మిస్ అండర్‌స్టాండ్ చేసుకుంటుంది. విశ్వనాథం గారి దగ్గర కోచింగ్ కోసం ఇలా కాపాడినట్లు నటించి మంచి మార్కులు కొట్టేసి నా అంతట నేను సీటు వదిలేస్తానని ఇలా చేశారని అంటుంది. ఇంత నెగిటివ్‌గా ఎలా ఆలోచిస్తున్నావ్ అని సిద్ధూ అంటాడు. ఇద్దరూ గొడవ పడి విశ్వనాథం గారి దగ్గరే తేల్చుకుందామని వెళ్లిపోతారు.
ఐశ్వర్య రూల్స్ రంజిత్ కోసం జ్యూస్ రెడీ చేస్తుంది. రంజిత్‌ని తిట్టుకుంటూ ఎక్కడ పుట్టాను.. ఎలా పెరిగాను ఇక్కడికి వచ్చి ఇలా వీడికి సేవలు చేయాల్సి వస్తుందని తిట్టుకుంటూ జ్యూస్ చేస్తుంది. రంజిత్ కిందికి వచ్చే టైం అయింది వచ్చేసుంటాడని కంగారుగా జ్యూస్ తీసుకెళ్తుంది. తీరా బయట చూస్తే రంజిత్ ఉండదు. దాంతో జ్యూస్ తీసుకొని రంజిత్ గదిలోకి వెళ్తుంది. తన గదిలోకి వచ్చిందని రంజిత్ ఐశ్వర్యని తిడతాడు. జ్యూస్ అడిగితే బయట వెయిట్ చేయాలి.. బయట నుంచి అడగాలి.. కామన్ సెన్స్ లేదు.. నిన్న చెప్పింది ఈ రోజు మర్చిపోతావ్.. మతి మరుపు ఉందా అని తిడతాడు. ఐశ్వర్య బుంగ మూతి పెట్టుకొని వెళ్లిపోతుంది. కిందకి వెళ్లి రంజిత్‌ని తిట్టుకొని మొత్తం జ్యూస్ తాగేస్తుంది.
రంజిత్ కిందకి వచ్చి జ్యూస్ అడిగితే ఖాళీ గ్లాస్ చేతిలో పెడుతుంది. నా కోసం కదా జ్యూస్ తెచ్చావ్ అంటే ఆ విషయం నన్ను తిట్టినప్పుడు తెలీదా అంటుంది. కోపం వచ్చిందా అని రంజిత్ అడిగితే లేదు బాధ వేసింది నాకు బాధ వేస్తే తింటా లేదంటా తాగుతా అని మూతి తిప్పుకుంటుంది. మరోవైపు ప్రేరణ, సిద్ధూలు విశ్వనాథం గారి దగ్గరకు వెళ్తారు. మీరేం నిర్ణయం తీసుకోలేదన్నమాట అని విశ్వనాథం అడిగితే మా అవసరం మమల్ని ఏ నిర్ణయం తీసుకోనివ్వలేదు సార్.. మా అవసరం మమల్ని ఇలా మీ ముందు నిలబెట్టింది అని అంటారు. మీరు ఏదోలా దయ తలిస్తే తప్ప మా సమస్యకు పరిష్కారం లేదని అంటారు. విశ్వనాథం గారు అలా కుదరదు అని ఇద్దరిలో ఒకరికే కోచింగ్ ఇస్తానని అంటారు. ఇద్దరూ తమకు ఆ సీట్ చాలా అవసరం అని బతిమాలుతారు.
విశ్వనాథం గారు ఇద్దరితో మీకు ఇచ్చిన టైం అయిపోయింది.. మీరు ఎలా తేల్చుకోలేకపోయారు కాబట్టి మీ ఇద్దరిలో అదృష్టం ఎవరికి ఉందో వాళ్లకే నేను కోచింగ్ ఇస్తానని కాయిన్ తీసి ఈ కాయిన్ మీ అదృష్టం చెప్తుందని చెప్పి ఇక ఇద్దరిలో ఒకరిని సెలక్ట్ చేయడానికి బొమ్మా బొరుసు వేస్తానని అంటారు. ఇద్దరూ వద్దని చెప్పినా వినకుండా విశ్వనాథం గారు బొమ్మాబొరుసు వేస్తారు. సరిగ్గా బొమ్మా బొరుసు చూసై టైంకి ఇద్దరూ విశ్వనాథం గారి చేతులు పట్టేస్తారు. వద్దు సార్ అది చూడొద్దు సార్.. ఈ సమస్య గెలుపు ఓటములకు సంబంధించింది కాదు.. టాలెంట్‌కి సంబంధించింది.. ఇది అదృష్టానికి సంబంధించింది కాదు సార్.. ఇన్నేళ్ల కల.. కష్టం అన్నీ ఒక్క సెకన్‌లో మార్చేయొద్దు సార్.. మేం మా కష్టాన్ని నమ్మకున్నాం.. అదృష్టాన్ని కాదు మీరు ఒక్కరికే కోచింగ్ ఇస్తారు మేం కాదు అనము మాకు మళ్లీ మళ్లీ పరీక్షలు పెట్టండి... ఒక్క మార్కుతో పోయినా ఒకేసార్ అంతే కానీ ఇలా లక్‌తో ముడి పెట్టకండి..అప్పుడు మేం సరిగా చదవలేదు అని అనుకుంటామని అంటారు. అదృష్టాన్ని చేతకాని వాళ్లు నమ్ముతారు సార్ అని అంటారు.
ప్రేరణ, సిద్ధూ మాటలకు విశ్వనాథం గారు నేను మీకు పెట్టిన పరీక్షలో ఇద్దరూ పాస్ అయ్యారు. మీరు మీ మాటలతో వ్యక్తిత్వంతో పాస్ అయ్యారు. నేను మీ ఇద్దరికీ కోచింగ్ ఇస్తానని అంటారు. ఇద్దరూ చాలా సంతోషిస్తారు. ఇద్దరితో మెయిన్స్‌లో మీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటి అని అడిగితే ఇద్దరూ ఒకేసారి తెలుగు లిటరేచర్ సార్ అని చెప్తారు. ఇందులో కూడా ఇద్దరూ ఒకటే సెలక్ట్ చేసుకున్నారా అని నవ్వి ఇద్దరికీ పుస్తకాలు ఇచ్చి ఎలా పంచుకుంటారో పంచుకోండి అని చెప్పి రేపటి నుంచి కచ్చితంగా 10కి ఉండాలని.. టైం పక్కా ఉండాలని అంటారు. ఇద్దరూ ఒకే అని వెళ్తారు.
మరోవైపు విజయానంద్‌ని గణని ఇంటికి పిలిచి తినడానికి డైనింగ్ టేబుల్ మీద కూర్చొపెట్టి అన్నం వేసి నా కుక్క కూడా ఇలాగే ఇదే ప్లేస్‌లో కూర్చొంటుంది అని అంటాడు. గణ ఏం మాట్లాకుండా కోపంగా అవమానంగా ఫీలవుతాడు. విజయానంద్ అన్నం మొత్తం గణ ప్లేట్‌లో వంపేస్తాడు. చికెన్ తింటే వేడి,, మటన్ తింటే జీర్ణం అవ్వదు..చేప అలర్జీ ఇలా అన్నీ అని సమయానికి వెజ్ కర్రీ కూడా లేదు.. మీరంతా ఇంతేనయ్యా అవకాశం వాడుకోలేరు.. ఏ పని చేయలేరు.. అంటే ఫైనల్‌గా గణకి గడ్డి పెట్టాలి అంటావ్ అంతేనా అని పీఏని అంటాడు. గణ చాలా అవమానంగా ఫీలవుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















