Nindu Manasulu Serial Today August 19th: నిండు మనసులు సీరియల్: సిద్ధూ, ప్రేరణల భవిష్యత్తును మార్చే ట్విస్ట్! విజయానంద్ ఏం చెప్పాడు? గణ ఏం చేయనున్నాడు?
Nindu Manasulu Today Episode August 19th విజయానంద్ గణతో సిద్ధూకి సీటు రాకుండా చూడాలని చెప్పడం గణ సిద్ధూతో పాటు ప్రేరణకు కూడా సీటు రాకుండా చేస్తానని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ,ఐశ్వర్య, సిద్ధూ, కుమార్ విశ్వనాథం గారి దగ్గర సీటు కోసం మాట్లాడుకుంటారు. ప్రేరణకు సిద్ధూ సీటు వదిలేయమని అందుకు గోల్డ్ చైన్ ఇచ్చి వేరే దగ్గర ట్రైనింగ్ తీసుకోమని అంటాడు. ప్రేరణ అస్సలు ఒప్పుకోదు. దాంతో ఆ సీట్ నాది అంటే నాది అని ఇద్దరూ వెళ్లిపోతారు.
విజయానంద్ పీఏ విశ్వాసం మొత్తం విని విజయానంద్‌కి చేరవేస్తాడు. ఇక విజయానంద్ గణ కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ సిద్ధూ ఐపీఎస్ అవుతాడా అని విజయానంద్ అడిగితే కచ్చితంగా అవుతాడు అని విశ్వాసం చెప్పడంతో 32 పళ్లలో రెండు మాత్రమే ఉంటాయి అని అంటాడు. ఇంతలో గణ వస్తాడు. గణతో నీకు నా కృతజ్ఞత తీర్చుకునే అవకాశం ఇస్తున్నా అని చెప్తాడు. విశ్వాసం గణకి సిద్ధూ ఫొటో చూపించి సిద్ధూ ఐపీఎస్ అవ్వాలని బ్యాడ్ గోల్ పెట్టుకున్నాడు. విశ్వనాథం గారి దగ్గరకు వాడు వెళ్లకుండా ఆపాలని చెప్తారు. తనకే సీటు వస్తుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని గణ అడిగితే సిద్ధూ బాబు గురించి మీకు తెలీదు బాబుని పాతాళంలోకి నెట్టేసినా పైకి వచ్చేస్తాడు అని అంటారు. విశ్వనాథం గారి దగ్గర ఇద్దరు కోచింగ్‌కి సెలక్ట్ అయ్యారని సిద్ధూని తప్పిస్తే ఆ అమ్మాయి సెలక్ట్ అవుతుందని ప్రేరణ ఫొటో చూపిస్తారు. దాంతో గణ ఆపాల్సింది ఒక్కరిని కాదు సార్ ఇద్దరిని అని అంటాడు. ఇద్దరిలో ఎవరికీ సీటు రాలేదని గుడ్ న్యూస్ మీరు వింటారని అంటాడు.
ప్రేరణ, ఇందిర, ఐశ్వర్యలు రూల్స్ రంజిత్ కోసం ఫుడ్ రెడీ చేస్తారు. ఒక్క నిమిషం ఆలస్యం అవ్వడంతో గజగజ వణికిపోతారు. తమని ఇరికించిన మీడియేటర్ గురించి తెగ ప్రయత్నిస్తున్నాం కానీ దొరకలేదు అని చెప్తారు. ఆ మీడియేటర్ మీ వాడే కదా అని ఐశ్వర్య అడుగుతుంది. నా వాడు అంటూ ఎవరూ లేరు అని రంజిత్ అంటే మీ ఫోన్ నుంచి ఒక సారి చేద్దాం సార్ మా ఫోన్ నుంచి చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదని అంటారు. ప్రేరణ రంజిత్‌కి నెంబరు చెప్తుంది. రంజిత్ దగ్గర నెంబరు ఉందో లేదో తెలుసుకోవాలని ఐశ్వర్య సీక్రెట్‌గా చూస్తే మీడియేటర్ శ్రీను అని వస్తుంది. ఇందిర వాళ్లు రంజిత్‌తో మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం మీరు కాదంటే మేం బయటకు వెళ్లి బతకలేం అని బతిమాలుతారు. దాంతో రంజిత్ మీకు కావాల్సింది ఇళ్లు.. నాకు కావాల్సింది నా రూల్స్ పాటించేవాళ్లు అవతల వాళ్ల కష్టాల కన్నా నాకు నా రూల్సే ముఖ్యం అంటాడు. ఇంతకీ అతనేమన్నారు అక్కా అని ఐశ్వర్య అడిగితే తన రూల్స్‌కి కష్టం కలిగించకుండా ఉండమని చెప్పారని అంటుంది.
సిద్ధూ, ప్రేరణలకు విశ్వనాథం గారి దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. ఇద్దరూ ఉదయం 10 గంటకు ఇద్దరూ వచ్చి ఎవరికి కోచింగ్ ఇవ్వాలో చెప్పాలని టైం అంటే టైం అంటారు. ఇద్దరూ కచ్చితంగా ఆటైంకి వెళ్లి సీటు దక్కించుకోవాలి అనుకుంటారు. గణ తనతో తాను మీ ఇద్దరూ ఎంత ప్రయత్నించినా విశ్వనాథం గారి దగ్గరకు వెళ్లనివ్వను మీ ఇద్దరి భవిష్యత్ నేను డిసైడ్ చేస్తాను అని అనుకుంటాడు. ఉదయం ప్రేరణ తల్లి ఆశీర్వాదం తీసుకుంటుంది. సిద్ధూ, ప్రేరణ ఇద్దరూ ఒకరికంటే ఒకరు ముందు వెళ్లాలి అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















