Nindu Manasulu Serial Today August 16th: నిండు మనసులు సీరియల్: రాఖీ వేడుక.. సిద్ధూకి ఘోర అవమానం.. సుధాకర్‌కి ఇందు ఏం గిఫ్ట్ అడిగిందంటే!
Nindu Manasulu Serial Today Episode August 16th ఇందిర పనిమనిషిని బెదిరించి గణ ఇంటిలో పని మానేసేలా చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ఇందిర పని మనిషిని ఓ చోట కట్టేస్తుంది. సుధాకర్ చాలా భయపడతాడు. వద్దే అక్క గణ ఊరుకోడే అని సుధా అంటే తెగిస్తేనే ఏదైనా సాధ్యమవుతుందని ఇందిర అంటుంది. దాంతో సుధాకర్ ఫ్రస్టేట్ అయిపోతూ కొటేషన్లు.. కొటేషన్లు ఆపవే.. అయినా దీన్ని ఎందుకు కట్టేశావే అని అడుగుతాడు.
ఇందిర తమ్ముడితో ఇది ఆ ఇంటి పనిమనిషి కదరా ఆ ఇంటి యజమాని అయిన మీ బావగారిని పురుగుని చూసినట్లు చూస్తుందిరా అని పనిమనిషిని కొడుతుంది. పని మనిషికి మెలకువ వస్తుంది. పనిమనిషి సుధా సార్ నన్ను ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇందిర కొట్టి నేను చెప్తానే అంటూ కావాల్సినంత జీతం తీసుకొని నా భర్తని తిడతావే అని అని రాజశేఖరం తన భర్త అని తిడుతుంది. నిన్ను చంపేస్తానే అంటూ కత్తి, గునపం తీసుకొస్తానని అంటుంది. మీరేం చెప్తే అది చేస్తా అని పని మనిషి అంటే రేపు నువ్వు వెళ్లి ఇక ఆ ఇంట్లో పని చేయను అని చెప్పమని కొడుతుంది. పని మనిషి సరే అంటుంది. సుధాకర్ అక్కతో అక్క నువ్వు కొంప ముంచేలా ఉన్నావే అని అంటాడు. అసలు ఇదంతా ఎందుకే అని అడిగితే నేను ఆ ఇంట్లోకి వెళ్లాలి అన్నా ఆయనకు సేవ చేయాలి అన్నా నేను ఆ ఇంటికి వెళ్లాలి అందుకే పని మనిషిని తప్పించానని చెప్తుంది. సుధాకర్ తల పట్టుకొని కూర్చొంటాడు.
సిద్ధూ కోచింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కుమార్‌తో వచ్చిన అవకాశం పోతుందేమో అని భయంగా ఉందిరా ఎలా అయినా ఆ సీట్ నాకు కావాలిరా అని అంటాడు. ప్రేరణతో ఒకసారి మాట్లాడుదాం అని కుమార్ అంటే ఆ అమ్మాయి ఒప్పుకోదని అంటాడు. ప్రేరణ కూడా చెల్లితో ఇదే విషయం గురించి మాట్లాడుతుంది. ఐశ్వర్య కూడా ఒకసారి మాట్లాడుదామని అంటుంది. ఇక పని మనిషి గణ ఇంటికి వెళ్లి ఈశ్వరితో ఇక ఈ ఇంట్లో పని చేయను ఊరు వెళ్లిపోతున్నానని అంటుంది. సడెన్‌గా మానేసిందేంటి అని ఈశ్వరి అనుకుంటుంది. ఇప్పటికిప్పుడు ఎవర్ని వెతకాలి అని ఈశ్వరి అనుకుంటుంది.
మరోవైపు సాహితి సిద్ధూకి కాల్ చేసి ఏడుస్తూ అర్జెంటుగా రమ్మని చెప్తుంది. ఏమైంది అని సిద్ధూఅడిగినా ఏం చెప్పకుండా త్వరగా రమ్మని చెప్తుంది. సిద్ధూ కుమార్‌కి చెప్పి ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్తాడు. ఇక పనిమనిషి ఇందిరకు కాల్ చేసి మానేశానని చెప్తుంది. సిద్ధూ ఇంటికి వెళ్లి సాహితిని పిలుస్తాడు. కంగారు పడుతూ ఏమైంది అమ్మా ఎందుకు ఏడుస్తూ కాల్ చేశావ్ అని అడుగుతాడు. సాహితి అన్నయ్యకి రాఖీ చూపించి ఇందుకే పిలిచా ఆ విషయం ముందే చెప్తే రావని ఇలా ప్లాన్ చేశానని అంటుంది. సిద్ధూకి సాహితి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని సిద్ధూ అంటాడు. విజయానంద్, మంజుల కూడా అక్కడికి వస్తారు. సాహితి అన్నయ్యతో నువ్వు ఎప్పుడూ నా కళ్ల ముందు ఉంటే హ్యాపీగా ఉంటానని అంటుంది.
విజయానంద్ తన నటన మొదలు పెడతాడు. చాలా సంతోషంగా ఉంది నాన్న మీ అన్నాచెల్లెళ్ల ప్రేమ చూసి కడుపు నిండిపోయింది. పిల్లలు ఇలా ఎప్పుడూ ఉంటే మనకు చాలా కదా మంజు అంటాడు. మనకి రాఖీ కట్టించాలనే ధ్యాసే లేదు. మన బిడ్డ ఇలా వాకిట్లో ఉండటం..మన అమ్మాయి ఇలా ఎవరికీ తెలీకుండా రాఖీ కడుతుందా అంతా మన దురదృష్టం. రాఖీ పండగా అంటే అన్నకి చెల్లి రాఖీ కట్టడం అన్న తన స్థాయికి తగ్గ బహుమతి ఇవ్వడం అంతా చూడముచ్చటగా ఉండేది.. బహుమతి అంటే గుర్తొచ్చింది సిద్ధూ నువ్వేం బహుమతి ఇస్తావ్ అంటాడు. పీఏ మనసులో మంట పెట్టేశాడు అనుకుంటాడు. ఇంకేం బహుమతి ఇస్తాడు. వాడి చేత బహుమతి తీసుకోవాలి అంటే నీకు రాసిపెట్టి ఉండాలి అని అంటుంది. నాకేం బహుమతి వద్దని సాహితి అంటుంది. సంపాదన లేదని మంజుల అంటుంది. మన మాట విని ఉంటే ఇలా ధీనంగా చూసే పరిస్థితిలో ఉండే వాడా అని సిద్ధూని అవమానిస్తుంది.
మరోవైపు ఇందిర సుధాకర్‌కి రాఖీ కడుతుంది. సుధాకర్ చాలా ఎమోషనల్‌గా ఫీలవుతాడు. ఐశ్వర్య మామతో నీకు ఇంత ఎమోషనల్ సూట్ అవ్వదు మామయ్య అని అంటుంది. ప్రతీ ఏడాది చాలా బాధ పడేదాన్ని ఈ సారినీకు రాఖీ కట్టే అదృష్టం దొరికింది అని ఇందిర అంటుంది. ఇక గిఫ్ట్ ఏం ఇస్తావ్ మామయ్య అని ఐశ్వర్య అడితే సుధాకర్ ఏమైనా అడుగు ఇస్తా కానీ ఆ ఒక్కటి తప్ప అని అంటాడు. ఆ ఒక్కటీ ఏంటి అని ఐశ్వర్య, ప్రేరణ అడుగుతారు. వడ్డానమో నక్లెసో అడుగొద్దని చెప్పానని సుధాకర్ అంటాడు. ఇక డబ్బులు ఇచ్చి చీర కొనుక్కోమని అంటాడు. ఇందిర తమ్ముడితో రక్షాబంధన్ అంటే ఏదో ఇచ్చిపుచ్చుకోవడం కాదు తోడుగా ఉండటం అని అంటుంది. డబ్బులు వద్దు మామయ్య నీ స్థాయికి మించి మాకు సాయం చేశావు.. నీ అండతోనే ఇక్కడి వరకు రాగలిగామని అంటుంది. మీ తండ్రి కోసం మీపోరాటం మీ అన్నని పడగొట్టేలా ఉండాలి. అది కేవలం మీ చదువు వల్ల సాధ్యమవుతుంది. ఆ గణ లాంటి రాక్షసుడు మీద గెలివాలి అంటే నీకు పవర్ ఉండాలి. అది నీకు సివిల్స్ వల్లే వస్తుంది. అప్పుడే మీరు గెలుస్తారని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















