Nindu Manasulu Serial Today April 8th: నిండు మనసులు: ప్రేరణను మోటివేట్ చేసిన చెంచలమ్మ! అత్తారింట్లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ప్రేరణ!
Nindu Manasulu Serial Today April 8th ప్రేరణను చెంచలమ్మ కలిసి సమస్యకి సొల్యూషన్ చెప్పడం ప్రేరణ అత్తారింటికి వెళ్లి విజయానంద్‌కి షాక్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ఇందిర ప్రేరణతో సిద్ధూ నిన్ను లవ్ చేస్తున్నాడు.. అని నాకు వచ్చి చెప్పాడని చెప్తుంది. సిద్ధూ నన్ను ప్రేమించాడా.. ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని ప్రేరణ అంటే చాలా సార్లు తన మనసులో మాట చెప్పాలి అనుకున్నాడు కానీ చెప్పలేకపోయాడు అని ఇందిర కూతురితో చెప్తుంది. ఆ రోజు నువ్వు గుచ్చి గుచ్చి అడిగావ్ కదా.. సిద్ధూ ఏం చెప్పాడు అని.. నీ ప్రేమ గురించే చెప్పాడు.. పర్మిషన్ తీసుకున్నాడు.. అందుకే నువ్వు ఇంటికి రాగానే సిద్ధూ బాబు ఏం చెప్పాడు అని అడిగాను.. నువ్వేం చెప్పకపోయే సరికి నేరుగా సిద్ధూనే అడగాలి అని ఫోన్ చేస్తే ఆ విజయానంద్ లిఫ్ట్ చేసి నీ కూతుర్ని అదుపులో పెట్టుకో అని చెప్పాడని అంటుంది. ఇవేమీ తెలియని నువ్వు సిద్ధూబాబు గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నానే అని ఇందిర చెప్తుంది. ఇద్దరు కూతుళ్లు ఉన్నా నాకు కొడుకు లేని లోటు తీరింది.. సిద్ధూ బాబువల్లే.. మన కోసం మన కుటుంబం కోసం ఎన్ని త్యాగాలు చేశాడో నీకు తెలుసు కదా.. తనకి మాత్రం ఎవరు ఉన్నారే.. వాళ్లమ్మ ఒక్కర్తే కదా.. అలాంటి ఆవిడ దూరం పెడితే తను బాధ పడడా.. మనమే దగ్గరకు తీసుకోవాలి కదా అని చెప్తుంది.
ప్రేమించిన వాడు భర్తగా వస్తే అంతకు మంచిన అదృష్టం ఇంకేమీ ఉండదు.. నువ్వు అర్థం చేసుకో.. మీరు సంతోషంగా ఉండమే నాకు కావాలి.. ఈ అమ్మ మాట నమ్ముతావ్ కదా అని అంటుంది. ప్రేరణ ఆలోచిస్తూ బయటకు నడచుకుంటూ వెళ్తుంది. సిద్ధూ, మంజుల కూడా బాధలో మునిగిపోయి ఉంటారు. ప్రేరణ ఏడుస్తూ రోడ్డు మీద కూర్చొంటుంది. అప్పుడే అక్కడికి మగువ ఓ మగువ ఫేమ్ చెంచలమ్మ వస్తుంది. ప్రేరణతో ఏదో పరధ్యాన్యంలో ఉన్నావ్.. నేను మీ కోసమే వస్తున్నా.. ఆ రోజు మీకు పెళ్లి చేసి ఆశీర్వదించా.. కానీ పట్టుబట్టలు పెట్టలేదు అని వాటిని తీసుకొని వచ్చాను అని అంటుంది. బట్టలు ప్రేరణకు ఇస్తే ప్రేరణ ఇప్పుడివి తీసుకునే పరిస్థితిలో నేను లేను వాటి అవసరం కూడా లేదు అని అంటుంది. ఏమైందని చెంచలమ్మ అడుగుతుంది. ప్రేరణ ఏడుస్తూ మొత్తం చెప్తుంది.
తల్లీకొడుకుల మనసుకి బాధ కలిగింది.. ఆ బాధతో వాళ్లిద్దరూ దూరం అవ్వడానికి కారణం నేనే అని అంటుంది. నీ భర్తని బాధ పెట్టాను అనే కాదు.. భర్త మనసు అర్థం చేసుకోలేకపోయా అని నువ్వు బాధ పడుతున్నావ్.. నువ్వు అలాంటి వ్యక్తిని మాట అనడంలో తప్పు లేదు.. అది అన్న సందర్భం తప్పు.. దాని వల్ల నీ భర్త తల్లి దూరం అవ్వడంలో అర్థం ఉంది.. కానీ నువ్వు ఇలా మౌనంగా ఉంటే సమస్య సమస్యలా ఉండిపోతుంది. తప్పు నువ్వు చేశానని దూరంగా ఉంటే గాయానికి మందు పూసేది ఎవరు.. నీ భర్త నిన్ను అర్థం చేసుకోవాలి.. నువ్వు చేసిన తప్పుని అతనే క్షమించాలి.. అది కూడా నువ్వే చేయాలి అని చెంచలమ్మ అంటుంది. దానికి ప్రేరణ నేనేం చేయాలి అమ్మ నేను నిజం తెలుసుకునే సరికి అంతా అయిపోయింది అని ప్రేరణ అంటుంది. నీ వాళ్లే నీ మీద నిందలు వేసి నిన్ను నానా మాటలు అంటే తను వచ్చి నిన్ను పెళ్లి చేసుకొని నీకు కొత్త జీవితం ఇచ్చాడు.. ఆమనిషిని నువ్వు ఇంత బాధ పెట్టావ్. తెలిసి చేసినా తెలియక చేసినా ఆ బాధ నుంచి బయటకు తీసుకురావాల్సింది నువ్వే.. అని అంటుంది.
సిద్ధూ నాతో మాట్లాడటం లేదు.. నన్ను దూరం పెడుతున్నాడు ఏం చేయాలి అని ప్రేరణ అంటే నువ్వు అతన్ని దూరం చేసుకోకు.. అతనికి నీ మీద విపరీతమైన గౌరవం ఉంది.. ప్రేమ ఉంది.. అంతకు మించి నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకునే మంచితనం ఉంది.. ప్రస్తుతం నీ మీద కోపం ఉన్నా అది కరిగేలా నువ్వే చేసుకోవాలి అని చెంచలమ్మ ప్రేరణకు చెప్తుంది. పోగొట్టుకున్న చోటే తిరిగి దక్కించుకోవాలి.. నీ కోసం ప్రాణాలు ఇచ్చిన వాడు.. నీ పరువు కోసం నీ మెడలో తాళి కట్టిన వాడు.. నువ్వు ప్రయత్నిస్తే కచ్చితంగా మారుతాడు.. ఎక్కడ ప్రేమ దొరుకుతుందో అక్కడికే వెళ్లు.. నీ చుట్టూ ఉన్న వాళ్లని ఆనందంగా ఉండేలా చూడు.. అలా అని అందర్ని నమ్మొద్దు.. మంచికి మంచి చేయాలి.. చెడుకి చెడు చేయాలి.. ఇక నీ జీవితం నీ ఇష్టం అని చెంచలమ్మ చెప్పి ప్రేరణకు బట్టలు పెట్టి ఆశీర్వదించి వెళ్తుంది.
సాహితి తండ్రితో నాన్న చూశావా అమ్మ ఎలా అయిపోయిందో.. అన్నయ్య ఇలా చేస్తాడు అని అస్సలు అనుకోలేదు అని అంటుంది. అక్కడ వాళ్లు నన్ను చాలా మాటలు అన్నారమ్మా అది మీ అమ్మ తట్టుకోలేకపోతుంది అని అన్నీ మంజుల వినేలా గుచ్చి గుచ్చి చెప్తాడు. దాంతో మంజుల ఏడుస్తూ డోర్ వేసేస్తుంది. మంజుల ఏం చేసుకుంటుందో అని విజయానంద్ అనుకుంటే సాహితి వెళ్లి సింపుల్గా డోర్ తీస్తుంది. నేను అంటే నీకు ఏంటో తెలుసు కదా మంజు.. ఇన్నేళ్ల మన సంసార జీవితంలో నీకు మోసం చేసినట్లు ఎప్పుడైనా అనిపించిందా.. నా మీద నీకు నమ్మకం ఉంటే చాలా అని అంటాడు. నేను మిమల్ని ఎప్పుడూ తప్పు పట్టనండీ.. అలా చేస్తే నాకు నేనే ద్రోహం చేసుకున్నట్లు అవుతుందని మంజుల అంటుంది. ప్రస్తుతానికి ఇది చాలు అని విజయానంద్ అనుకుంటాడు. తర్వాత ఇంటి బయట ప్రేరణ కళ్లజోడు పెట్టుకొని స్టైల్‌గా చీర కట్టుకొని అదిరిపోయే లుక్స్‌తో వెనక్కి తిరిగి కూర్చొంటుంది. సాహితి కాస్త దూరంలో నిల్చొంటుంది. ఇంతలో విజయానంద్ వచ్చి సాహిత తను ఎవరమ్మా మీ ఫ్రెండా.. ఇక్కడేంటి ఇలా కూర్చొంది.. గొడవ పడ్డారా.. ఎంత గొడవ పడినా ఫ్రెండ్‌ని ఇలా మెట్ల మీద కూర్చొపెట్టేస్తారా.. రామ్మా నువ్వు లోపలికి అని విజయానంద్ అంటాడు. ప్రేరణ విజయానంద్ వైపు తిరిగి వచ్చేయ్మంటారా మామయ్యగారు.. అని అంటుంది. విజయానంద్ షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
ట్రెండింగ్ వార్తలు





















