అన్వేషించండి

Meghasandesam Serial Today April 8th: ‘మేఘసందేశం’ సీరియల్‌: చెర్రితో విడాకులు కావాలన్న నక్షత్ర – షాక్ లో శరత్‌ చంద్ర  

Meghasandesam serial today episode April 8th: లిల్లీని రేప్‌ చేసిన చెర్రితో తను కాపురం చేయనని విడాకులు కావాలని నక్షత్ర అడగడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Meghasandesam Serial Today Episode: బయటి నుంచి శరత్‌ చంద్ర రావడం చూసిన సుజాత లోపలికి పరుగెత్తుకుంటూ వచ్చి శరత్‌ చంద్ర వస్తున్నాడని చెప్తుంది. దీంతో అన్ని పక్కకు పెట్టేసిన నక్షత్ర ఏడుస్తున్నట్టు నటిస్తుంది. అపూర్వ ఓదారుస్తున్నట్టు నటిస్తుంది. శరత్‌ లోపలికి వచ్చేస్తాడు.

శరత్: అపూర్వ ఏమైంది ఎందుకు నక్షత్ర ఏడుస్తుంది.

అపూర్వ: ఏం లేదులే బావ అది కాసేపు ఏడ్చి ఊరుకుంటుందిలే..

నక్షత్ర: ఊరుకుంటానో.. ఉరేసుకుంటానో.. నాకేం అవసరం లేదులే.. నా గొంతు కోసి మీరు చేతులు దులిపేసుకున్నారు కదా..

సుజాత: అవేం మాటలే పెళ్లి చేసేటప్పుడు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎవరైనా ఊహిస్తారా ఏంటి..?

శరత్‌: ఏం జరిగిందో చెప్పండి ముందు ఎందుకు ఏడుస్తున్నావు నక్షత్ర.

అపూర్వ: ఏం లేదులే బావ. అది మన ఇంటి గౌరవానికి సంబంధించింది. నీకు తెలియకపోవడమే మంచిది. ఆ చేదు నిజాన్ని ఈ నాలుగు గోడల మధ్యే సమాధి చేసేద్దాం.

నక్షత్ర: దాని పక్కనే నా శవాన్ని కూడా సమాధి చేయండి. పీడ పోతుంది.

సుజాత: అయ్యయ్యో నువ్వు అలాంటి అపశకునపు మాటలు మాట్లాడకు. పైన తథాస్తు దేవతలు ఉంటారు.

అపూర్వ: పిన్ని..

శరత్‌: అపూర్వ చెప్తావా..? చెప్పవా..?

అపూర్వ: చెప్పకూడదు అని కాదు బావ. కానీ కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది కదా అని ఆగిపోతున్నాను.

శరత్‌: ఏంటో చెప్పు..

అపూర్వ: మన అల్లుడు చెర్రి కరెక్ట్‌ కాదు బావ.

శరత్‌: అంటే..

నక్షత్ర: అంటే అంటావేంటి డాడీ. మీ ఫ్రెండ్‌ కూతురు లిల్లీ వచ్చి చెప్పింది కదా..? ఆయన చేసిన ఘనకార్యం గురించి.

శరత్‌: అదంతా నిజమా కాదా త్వరలోనే తేలుస్తాను. నిజమని తేలితే..

నక్షత్ర: నిజం డాడీ.. వాడి బుద్ది నీచపు బుద్ది. చెట్టుకు చీర కట్టినా ముట్టుకుని మురిసిపోయే రకం వాడు.

సుజాత: ఏమిలి అమ్మాయి నువ్వు అనేది.

అపూర్వ: అవును పిన్ని నిజమే వాడు ఆ లిల్లీని ఇబ్బంది పెట్టడం నేను కూడా చాలా సార్లు నా కళ్లారా చూశాను.

నక్షత్ర: వద్దు వద్దు అని చాలా సార్లు చెప్పాను కానీ నన్నే చెప్పుతో కొడతానన్నాడు. ఇప్పుడు గెస్ట్‌ హౌస్‌ చూపిస్తానని తీసుకెళ్లి పాపం ఆ లిల్లీని పాడు చేశాడు.

అపూర్వ: సరే బావ అయిందేదో అయిపోయింది. నక్షత్ర చూడు జైలు నుంచి వచ్చాక మీ డాడీ వాడికి బాగా గడ్డి పెడతాడులే..

నక్షత్ర: ఏమీ అవసరం లేదు. వాడు ఎంత చెప్పినా వినడు.  వాడు కుక్క తోక వంకర టైపు. అప్పుడే నాకు ఈ పెళ్లి వద్దు అని చెప్పాను. మీరే వినలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడానికి నేను సిద్దంగా లేను.

శరత్‌: సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటారు.

నక్షత్ర: నాకు ఆ చెర్రితో విడాకులు కావాలి.

శరత్‌: విడాకులా..?

నక్షత్ర: అవును నాకు విడాకులు కావాలి.. కావాలి..  

అంటూ నక్షత్ర ఏడుస్తుంటే.. ఏం చెప్పాలో అర్తం కాక శరత్‌ చంద్ర అలాగే చూస్తుండిపోతాడు. అపూర్వ, సుజాత ముసి ముసిగా నవ్వుతుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
Express Hari: మధ్య తరగతి కుర్రాడి కష్టానికి ఫలితం... నా చిరునామా... సొంత ఇంట్లో అడుగుపెట్టిన హరి
మధ్య తరగతి కుర్రాడి కష్టానికి ఫలితం... నా చిరునామా... సొంత ఇంట్లో అడుగుపెట్టిన హరి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ సర్టిఫికేట్లు కాల్చేసిన శకుంతల! కుమిలి కుమిలి ఏడుస్తున్న లక్ష్మీ! ఇంక ఏ గుర్తింపు లేనట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ సర్టిఫికేట్లు కాల్చేసిన శకుంతల! కుమిలి కుమిలి ఏడుస్తున్న లక్ష్మీ! ఇంక ఏ గుర్తింపు లేనట్లేనా!
Godavari Serial Today July 4th: 'గోదావరి' సీరియల్: వేలం ఆపేసిన సూర్య! జాను చేసిన పనికి ఇల్లు దక్కించుకున్న ఫ్యామిలీ!
'గోదావరి' సీరియల్: వేలం ఆపేసిన సూర్య! జాను చేసిన పనికి ఇల్లు దక్కించుకున్న ఫ్యామిలీ!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Embed widget