అన్వేషించండి

chinni serial today April 8th: చిన్ని సీరియల్: చిన్నిని రౌడీలు కిడ్నాప్ చేయగలరా! కావేరి ఆత్మ ఎంట్రీ ఇస్తుందా!

chinni serial today episode April 8th చిన్నిని కిడ్నాప్ చేయడానికి దేవా మనుషులు ఇంటికి రావడం లోహిత చూసి కూడా ఏం అనకపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode దేవా, నాగవల్లి మ్యాడీతో ఎక్కడికి వెళ్లావ్ అని అంటే వాళ్ల అమ్మ సమాధి దగ్గరకు తీసుకెళ్లమని చెప్పిందని తీసుకెళ్లానని అంటాడు. అక్కడ వాళ్ల అమ్మ మీ అమ్మని చంపలేదు.. నిర్దోషి అని ఏమైనా నమ్మించాలని చెప్పిందా అని దేవా అంటే అలా చెప్పాల్సిన అవసరం నాకు లేదు.. తప్పు చేసేవాళ్లు అబద్ధాలు చెప్పేవాళ్లే అలా చెప్తారు.. నిజం ఎప్పటికైనా తెలుస్తుంది.. అని అంటుంది చిన్ని. ఇప్పుడు ఏం తెలిశాయి అంట అని దేవా అంటే ఏం తెలిశాయో ఏంటి మీ అబ్బాయి చెప్తాడు కదా తొందర ఎందుకు అని చిన్ని అంటుంది. 

మ్యాడీ పెద్దమ్మతో మన ఇంట్లో ఎవరి పుట్టిన రోజు అయినా స్వీట్ చేసి అందరి నోళ్లు తీపి చేస్తావు కదా.. ఈ రోజు చిన్ని వాళ్ల అమ్మ పుట్టినరోజు ఏదైనా స్వీట్ చేసి అందరి నోళ్లు తీపి చేయ్ అని అంటాడు. ఆ మాటకు దేవా, నాగవల్లి షాక్ అయిపోతే  చిన్ని చాలా హ్యాపీగా ఫీలవుతుంది. లోహిత మ్యాడీతో మీ అమ్మని చంపిన వాళ్ల పుట్టినరోజున స్వీట్ చేసి నోరు తీపి చేస్తావా ఆ మాట వినడానికే మింగుడు పడటం లేదు అని లోహిత అంటే అమ్మ ఎవరికైనా అమ్మే.. నా మాట మీద గౌరవం ఉంటే అందరూ నోరు తీపి చేసుకోండి అని అంటాడు. మ్యాడీ మాట కోసం స్వీట్ చేయమని నాగవల్లి చెప్తుంది. 

దేవా గదిలోకి వెళ్లి పార్వతి, కావేరి, సత్యంబాబుల చావుకి నేనే కారణం అని చిన్ని మ్యాడీకి చెప్పుంటుందా.. చెప్తే అంత కూల్‌గా ఎందుకు ఉంటాడు.. ఇప్పుడు చెప్పకపోయినా ఎప్పుడైనా నా కొంప ముంచుతుంది. అప్పటి వరకు చూస్తూ ఊరుకోవడం ఎందుకు.. త్వరగా చిన్నిని లేపేయాలి.. ఇవాళ రాత్రికే దాన్ని లేపేయాలి అని తన మనుషులకు ఫోన్ చేసి చిన్నిని చంపేయమని అంటాడు. ప్రమీల పాయసం చేస్తుంది. ప్రమీల పక్కకి వెళ్లగానే దేవా మనిషి పాయసంలో మత్తు మందు కలిపేస్తాడు. మరోవైపు మ్యాడీ గదిలోకి వచ్చే సరికి చిన్ని గులాబీ రేకులతో థ్యాంక్స్ అని రాసుంటుంది. బెడ్ మీద థ్యాంక్స్ అని రాస్తుంది. తర్వాత మ్యాడీ దగ్గరకు వచ్చి థ్యాంక్స్ అని చెప్తుంది. మా అమ్మ సమాధి దగ్గరకు నేను ఒంటరిగా వెళ్లాలి అనుకుంటే నాకు జంటగా వచ్చి చాలా సంతోషాన్ని ఇచ్చావ్ అందుకే థ్యాంక్స్ అంటుంది. అతి తొందర్లోనే మా అమ్మ నిర్దోషి అని నిరూపించి నీ ప్రేమని పూర్తిగా పొందుతాను అని చిన్ని అంటుంది. అది ఎప్పటికీ జరగదు అని మ్యాడీ అంటాడు. 

నాగవల్లి అత్తయ్య గారికి కూడా విషయం తెలీదు.. ఇండియాలోనే లేరు కదా అంటుంది. సరే మా అమ్మకి తెలియకపోవచ్చు కానీ మా డాడీ ఇండియాలోనే ఉన్నారు.. ఇంట్లోనే ఉన్నారు కదా మా డాడీకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి అని మ్యాడీ అంటాడు. ఏమైనా అవసరం ఉండి నిజం దాచుంటారేమో అని చిన్ని అంటుంది. నిజం దాచడం వెనక బలమైన కారణం ఏమైనా ఉండొచ్చేమో.. నిన్ను నాగవల్లి అత్తయ్యని బాధ పెట్టడం ఇష్టం లేక అలా చెప్పోచ్చేమో అని చిన్ని అంటుంది. మరోవైపు ప్రమీల ఇంట్లో అందరికీ స్వీట్స్ పంచుతుంది. అందరూ స్వీట్ తీసుకొని తిని పడుకుంటారు. ఇక రాత్రి లోహితకు ఫోన్ వస్తుంది. అన్నయ్య ఈ టైంలో ఫోన్ చేయమన్నాడేంటి అని అనుకొని బయటకు వెళ్తుంది. 

దేవా చెప్పిన రౌడీలు కూడా అప్పుడే ఇంట్లోకి వస్తారు. లోహిత రౌడీలు ఇంట్లోకి రావడం చూస్తుంది. దొంగలు దూరారని అనుకొని వరుణ్‌ని లేపాలని చూస్తుంది, కానీ వరుణ్ లేవడు.. రౌడీలు ఇంట్లోకి దూరి చిన్ని గదిలోకి వెళ్తారు. కావేరి ఫొటో అటూ ఇటూ ఊగుతూనే ఉంటుంది. రౌడీలు చిన్నిని ఎత్తుకొని బయటకు వస్తారు. లోహిత వరుణ్ లేవకపోవడంతో ఆంటీ అంకుల్‌ని లేపుదాం అని వెళ్లి చిన్నిని కిడ్నాప్ చేయడం చూసి చిన్నిని తీసుకెళ్లిపోతే బెటర్ అని వదిలేస్తుంది. కావేరి ఫొటో ఊగి ఊగి కింద పడిపోతుంది. సరిగ్గా అప్పుడే చిన్ని రౌడీలకు షాక్ కొట్టినట్లు అయి చిన్నిని కిందకి వదిలేస్తారు. రౌడీలు చిన్నిని ఎందుకు వదిలేశారా అని లోహిత అనుకుంటుంది. ఇంతలో చిన్ని లేచి దెయ్యంలా కూర్చొంటుంది. అందరూ చూసి చిన్నికి భయపడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 1st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి కేసులో విహారికి యావజ్జీవ శిక్ష! అంబిక ప్లాన్ సక్సెస్ అయినట్లేనా!
Godavari Serial Today August 1st: 'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
'గోదావరి' సీరియల్: వాటే సీన్.. అదరగొట్టేసిన సూర్య.. లవర్స్‌కి బెస్ట్ ఐడియా! జానుకి భువన వార్నింగ్!
Nindu Manasulu Serial Today August 1st: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల ఇంటర్వ్యూకి డేట్ ఫిక్స్! గణని ప్రశ్నించిన విజయ్‌కి షాక్!
Karthika Deepam 2 Serial Today August 1st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న–సూరజ్‌ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఇంతలోనే దీప, సూరజ్‌లపై శ్రీధర్ సంచలన కామెంట్స్!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget