అన్వేషించండి

Nindu Manasulu Serial Today may 9th: నిండు మనసులు: ఫస్ట్‌నైట్‌ గదిలో మంచం ఫట్! ప్రేరణ కొంగు పట్టుకొని సిద్ధూ సిగ్గు పడుతున్నాడోచ్!

Nindu Manasulu Serial Today may 9th ప్రేరణని సిద్ధూ ఫస్ట్‌నైట్ గదిలో చుక్కలు చూపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode సిద్ధూ, ప్రేరణల ఫస్ట్‌నైట్ ఎపిసోడ్‌తో నిండు మనసులు సీరియల్ ఆసక్తికరంగా మారింది. సిద్ధూ ప్రేరణని ఓ ఆట ఆడించాలి అని ప్రేరణతో క్లోజ్‌గా ఉంటూ ఊహించని షాక్‌లు ఇస్తుంటాడు. నీ భర్తకి స్వీట్ తెచ్చి తినిపించు అని సిద్ధూ చెప్పడంతో ప్రేరణ బిత్తరపోయి.. సిద్ధూ నువ్వు నువ్వేనా అని అడుగుతుంది. నేను నేనే కానీ స్వీట్ తినిపించు అని సిద్ధూ అంటాడు. ఏంటి సిద్ధూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నావ్ అని ప్రేరణ అంటే.. ఇది మన ఫస్ట్‌నైట్ కదా  ఇలాగే ఉంటారు ప్రేరణ.. ఏ మాటకి ఆ మాట నువ్వు చీరలో సూపర్ అని అంటాడు. 

ప్రేరణ ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని దగ్గరకు వెళ్తాడు. వద్దు సిద్ధూ అని ప్రేరణ అంటే శోభనం రోజు వద్దు అంటే ఏం బాగుంటుంది అని సిద్ధూ అంటాడు. ఇక సిద్ధూ ప్రేరణని ముద్దు పెట్టుకోవడానికి వెళ్తే ప్రేరణ సిద్ధూని తోసేసి వెళ్లిపోతుంది. ఏంటి ప్రేరణ మీ అమ్మవాళ్లు ఇంత ఖర్చు పెట్టి ఇంత డెకరేషన్ చేస్తే మనం ఏదో ఒకటి చేయాలి కదా అంటాడు. ప్రేరణ వద్దు వద్దూ అంటూ బెడ్ మీద పడిపోతుంది. దాంతో ఒక్కసారిగా మంచం విరిగిపోతుంది బయట మాట్లాడుకుంటున్న ఇందిర వాళ్లు ఆ సౌండ్ విని షాక్ అయిపోతారు. ఏంట్రా ఆ సౌండ్ అని బామ్మ అంటే మంచం విరిగినట్లు ఉందమ్మా అని సుధాకర్ నవ్వుతూ అంటాడు. అందరూ నవ్వుకుంటారు. సిద్ధూ ప్రేరణతో ఇప్పుడు తెలిసిందా శోభనం అంటే ఏంటో మంచం.. విరిగిపోయింది.. ఇప్పుడు మీ అమ్మ, బామ్మలకు ఏం చెప్తావో అని అంటాడు. 

ప్రేరణ కోసం పొద్దున్న బామ్మ మెట్ల వంక చూస్తూ ఉంటుంది. ఇందిర కాఫీ కావాలా అని అడిగితే అరుస్తుంది,. ఉదయం ప్రేరణ సిద్ధూని తిట్టుకుంటూ నడుం నొప్పి అని నడుం పట్టుకొని ఇబ్బంది పడుతూ నడుచుకుంటూ వస్తుంటే అందరూ చూసి నవ్వుకుంటారు. అబ్బా ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్ నువ్వు ఎందుకు అలా ఉన్నావో నాకు తెలుసులే అని అంటుంది బామ్మ. ఇంతలో సిద్ధూ వచ్చి నిల్చొంటాడు. బామ్మ సిద్ధూతో ఏంట్రా మనవడా.. పాత కాలం మంచం అలా విరగ్గొట్టావ్ అని అడుగుతుంది. నేనేం చేయను బామ్మ అన్నీ మీ మనవరాలే చేసింది అని సిద్ధూ అంటాడు. ఇందిర వాళ్లు నవ్వు ఆపుకుంటారు. ఆంటీ ప్రేరణకు కాఫీ ఇవ్వండి.. అలసిపోయింది.. రాత్రంతా నిద్ర లేదు అని అంటాడు. ప్రేరణ తన ఇంటి దగ్గర చేసిన దానికి ఇదంతా సిద్ధూ రివేంజ్ అని ప్రేరణకి అర్థమైపోతుంది. సిద్ధూ ప్రేరణ దగ్గరకు వెళ్లి కొంగు పట్టుకుంటే ఏంటి సిద్ధూ ఓవర్ యాక్షన్ చేస్తున్నావా అంటే మరి నిన్న నువ్వు మా ఇంట్లో చేసింది ఏంటి అని అంటాడు. అవును ఆ మంచం ఎలా విరిగింది అని ప్రేరణ అంటే నేనే బోల్ట్‌లు విప్పేశా అని అంటాడు. ప్రేరణ నోరెళ్ల బెడుతుంది.

ప్రేరణ సిద్ధూతో నేను నీతో ఆడుకున్నా నువ్వు నాతో ఆడుకున్నావ్.. నేను ఓవర్ యాక్షన్ చేయను.. నువ్వు చేయకు అని అంటుంది. ఈ సిద్ధూ దేనికైనా పోటీగానే ఉంటాడు. మన ఇద్దరి మధ్య ఏదో జరిగినట్లు నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు సిద్ధూ.. మన లక్ష్యాన్ని మనం దూరం పెట్టొద్దు.. ముందు మనం మన గోల్స్ రీచ్ అవుదాం.. సిద్ధూ ఆ మంచం బోల్ట్‌ విప్పింది నువ్వే అని చెప్పవా.. అని అంటుంది. అలా చెప్తే మన మధ్య ఏం జరగలేదు అని మీ వాళ్లు ఫీలవుతారు అని అంటాడు. జరగని మన శోభనాన్ని జరిగింది అని చెప్పావ్.. జరిగిపోయిన మన పెళ్లిని ఒప్పుకో అని అంటుంది. చర్చలు విఫలం నేను నా ఇంటికి వెళ్లిపోతా అని సిద్ధూ అంటాడు. 

మంజుల మందులు తీసుకురమ్మని సాహితికి చెప్తుంది. సాహితి వెళ్తుంటే సిద్ధూ నేను తీసుకొస్తా అని అంటాడు. ఇక ప్రేరణ కూడా నాకు పని ఉంది వస్తా అంటే వద్దు అని సిద్ధూ వదిలేసి వెళ్లిపోతాడు. అప్పుడే విశ్వాసం స్కూటీ తీసుకొని వస్తాడు. ప్రేరణ విశ్వాసం దగ్గరకు వెళ్లి నీ బండి సూపర్ ఉంది విశ్వాసం అని మైలేజ్ చెక్ చేస్తా అని స్కూటీ తీసుకొని వెళ్లిపోతుంది. ప్రేరణ సిద్ధూని ఫాలో అవుతుంది. మధ్యలో సిద్ధూ బండి ఆగిపోతుంది. ప్రేరణ వెళ్లి అక్కడే స్టైల్‌గా స్కూటీ మీద కూర్చొంటుంది. దేవుడా నువ్వు ఉన్నావయ్యా,, అని అంటుంది. హెల్ప్ కావాలా అని ప్రేరణ అడిగితే అవసరం లేదు అని సిద్ధూ అంటాడు. మళ్లీ ఆలోచించుకో అని ప్రేరణ అంటుంది. వద్దు అని సిద్ధూ అంటే నీకు మరో ఆప్షన్ లేదు.. పైగా మీ అమ్మకి అర్జెంటుగా మందులు తీసుకురావాలి.. ఆలోచించుకో అంటుంది. దాంతో సిద్ధూ వస్తా అంటాడు. నేను స్కూటీ తీస్తా ఇవ్వు అని సిద్ధూ అంటే నేను డబుల్స్ బాగా నడుపుతా.. నేను ఇవ్వను అని ప్రేరణ అంటుంది. మీరు ఎంత సేపు వాదించినా నేను ఇవ్వను వచ్చి ఎక్కండి అని అంటుంది. సిద్ధూ కూర్చొంటాడు. జాగ్రత్త అండీ మీకు భయం వేస్తుందేమో నన్ను గట్టిగా పట్టుకోండి అని అంటుంది. ప్రేరణ సడెన్‌ బ్రేక్స్ వేయడంతో సిద్ధూ స్కూటీ ఆపించి వెనక్కి తిరిగి కూర్చొంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

మరిన్ని ఆసక్తికరమైన సీరియల్స్‌, నటుల వ్యక్తిగత జీవితాలు, మరిన్ని సంగతల కోసం తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 13th:కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
Illu Illalu Pillalu Serial Today August 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget