Trinayani June 30th: సుమనకు వణుకు పుట్టించిన నయని, తాగి రచ్చ రచ్చ చేసిన హాసిని
కసిని చంపింది నువ్వే అంటూ సుమనను గట్టిగా నిలదీయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Trinayani June 30th: ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ అందరి నోట్లో ఎద్దులయ్యతో పిండి కొట్టిస్తాడు. ఇక లాలాజలం ఊరినట్లయితే వాళ్ళు తప్పు చేయనట్లు అని అంటాడు. దాంతో మొదట విక్రాంత్ ను పరీక్షించగా అతడు దోషి కాదని తెలుస్తుంది. ఇక వల్లభ దగ్గరకు రాగానే కాస్త అవనిమానంగా చూసి నువ్వు కూడా నిర్దోషివే అని అంటాడు. దానితో వల్ల భర్తగా సంతోష పడిపోతాడు. ఆ తర్వాత తిలోత్తమా, విశాల్, నయని లకు నోరు చూస్తాడు. వాళ్ళది కూడా ఊరుతుంది.
ఇక మిగిలిన సుమన, పావనమూర్తిది ఒకేసారి చూడటంతో అందులో సుమనది తడి అవ్వగా పావని మూర్తిది పిండి పిండి అలాగే ఉంటుంది. దాంతో కసిని చంపింది పావనమూర్తి అని అరెస్టు చేయాలి అనడంతో దెబ్బకు పామను మూర్తి భయపడతాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా పావన మూర్తి చంపడం ఏంటి అని ఆశ్చర్యపడతారు. దాంతో మూర్తి తను చంపలేదని.. భయంతోనే గొంతు ఆరిపోయింది అని చెప్పటంతో చంద్రశేఖర్ ఆయన మాటలను విని అతను హంతకుడు కాదు అని తెలుసుకుంటాడు.
ఇక ఇంట్లో ఎవరు దోషులు కాదు అనటంతో.. వెంటనే వల్లభా నా భార్య హాసిని, మా అత్తయ్య ఉన్నారు అని వాళ్లు వచ్చాక మరోసారి పిండి పరీక్ష చేయండి అని అంటాడు. ఈసారి పిండి పరీక్ష కాదు నేరుగా జైలుకే తీసుకెళ్తాను అని అంటాడు. అంతా అయిపోయాక సుమన భయంతో నీళ్లు తాగుతూ కనిపిస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన నయని ఎందుకు అలా నీళ్లు తాగుతున్నావు అనటంతో నోట్లో పిండి ఉండటం వల్ల ఇబ్బందిగా అనిపించింది అందుకే తాగుతున్నాను అని అంటుంది.
ఎందుకు తప్పించుకుంటున్నావు కసిని చంపింది నువ్వే కదా అని అనటంతో.. వెంటనే సుమన భయపడుతుంది. నా ముందు నీ నటన తెలుసు అలాగే ఇన్స్పెక్టర్ ముందు కూడా నటించావు అంటే కసిని చంపింది అని అంటుంది. వెంటనే సుమన నీకెలా తెలుసు నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అనటంతో.. ఊహించాను అంటుంది నయని. వెంటనే సాక్షాలు లేవు కదా అని ఊపిరి పీల్చుకుంటుంది సుమన.
నేనెందుకు చంపుతాను ఏం మాట్లాడుతున్నావు అంటూ సుమన నటించడంతో ఆ తర్వాత నయని నవ్వుతూ సరదాగా అన్నాను అని అంటుంది. దాంతో సుమన అలా అంటావా అంటూ కోప్పడి అక్కడి నుంచి వెళ్లగా వెంటనే నయని నువ్వే చంపావని నాకు తెలుసు.. సాక్షాలు బయటపడే వరకు నువ్వు నా చెల్లవి ఆ తర్వాత దోషివి అని అనుకుంటుంది.
ఇక ఇంట్లో వాళ్ళు ఎవరు లేకపోయేసరికి వల్లభ పావని మూర్తితో కలిసి హాల్లోని సిట్టింగ్ చేస్తాడు. ఇక్కడ ఏర్పాటు చేసావేంటి అని పావని మూర్తి అడగటంతో ఇంట్లో ఎవరూ లేరు కదా అని అంటాడు. సుమన ఆలోచనలో ఉంది.. హాసిని పొద్దున అనగా పెళ్లికి వెళ్ళింది.. అమ్మ ఇంట్లో గదిలో ఉంది.. విశాల్ వాళ్లు గురు పూర్ణిమ కోసం షాపింగ్ కు వెళ్లారు అని ఇప్పుడు ఎవరు అడ్డం లేరు అని అంటాడు.
అప్పుడే హాసిని బయటి నుంచి రావటంతో మందు సీసా వెనక్కి దాచిపెట్టగా అదివరకే కూల్ డ్రింక్ మందుతో కలిపిన గ్లాసులు అక్కడ ఉంటాయి. వెంటనే హాసిని వచ్చి ఆ కూల్ డ్రింక్ తాగేస్తుంది. దాంతో వీళ్ళు షాక్ అవుతారు. ఇంకో గ్లాస్ కూడా తాగేస్తుంది. దాంతో మతి ఎక్కటంతో గట్టిగా అరుస్తూ నవ్వుతూ కనిపించడంతో వెంటనే హాసిని దంపతులు, తిలోత్తమా వస్తారు.
వాళ్లు కంగారుగా ఏం జరిగింది అని అడగటంతో మందు తాగింది అని అంటాడు వల్లభ. అందరూ సైలెంట్ గా ఉండమన్నా కూడా హాసిని ఉండకుండా నవ్వుతుంది. అప్పుడే నయని, విశాల్ రావటంతో ఏం జరిగింది అనటంతో మందు తాగింది అని చెబుతారు. ఇక హాసిని అదేవిధంగా నవ్వడంతో ఏం జరిగింది అనగా.. ఆ కసి చనిపోయింది కదా అందుకే ఈ సంతోషం అని.. ఏ భార్యాభర్తల మధ్య అయినా ఇటువంటి వాళ్ళు ఉంటే వాళ్లకు ఇదే మార్గం అంటూ.. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అంటూ నవ్వుకుంటుంది.
ఇక చంపిన వాళ్ళు ఎవరో తెలిస్తే వాళ్లకు వెంటనే కోటి రూపాయలు ఇస్తాను అనటంతో వెంటనే సుమన అవేం సరిపోతాయి మాకు అని అంటుంది. దాంతో అందరూ సుమన మాటలు విని షాక్ అవుతారు. అలా అంటున్నవ్ ఏంటి అనటంతో.. అంటే చంపిన వాళ్ళు వాళ్ళకేం సరిపోతాయి అంటారేమో అని అంటున్నాను అని మాట మారుస్తుంది. అలా కాసేపు అక్కడ రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది హాసిని. ఆ తర్వాత విశాల్ వల్లభను ఇటువంటివి ఇక్కడ పెట్టుకోవద్దు అని క్లాస్ పీకుతాడు.