అన్వేషించండి

Trinayani June 26th: గాయత్రిని తాకటంతో తిలోత్తమాకు కొట్టిన షాక్, అత్త నిర్ణయంపై అవాక్కైన నయని దంపతులు?

గాయత్రి కి గోరింటాకు పెట్టాలనుకున్న తిలోత్తమాకు షాక్ కొట్టటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Trinayani June 26th: సుమన గోరింటాకు పెట్టుకొని చేతుల మంటతో రచ్చ చేసి వెళ్లగా.. వెంటనే విశాల్ సుమన కు ఏదో అయ్యింది అంటాడు. దానికి పిచ్చి పట్టిందని హాస్పిటల్ లో చూపించాలి అని అనగా లేదు ఆషాడ పూర్ణిమ రోజు నిజం తెలుస్తుంది అని అంటుంది. ఆ తర్వాత సుమన చేతులకు, బాడీకి కొన్ని ప్రొడక్ట్స్ పెట్టుకుంటూ ఉంటుంది.

అప్పుడే అక్కడికి విక్రాంత్ వచ్చి మంచి వాసన వచ్చే గోరింటాకు పెడితే చీదరించుకున్నావు అదే గుడ్లను ఇష్టంగా రాసుకున్నావు అని అంటాడు. ఇక ఆ గోరింటాకులో నువ్వే ఏదో కలిపావు అని అనటంతో సుమన నేను ఏమి కలపలేదు అని అంటుంది. నీ కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు అనటంతో బిడ్డ మీద కూడా ప్రమాణం చేస్తుంది.

ఇక మళ్ళీ విక్రాంత్ మాటలకు బాగా కోప్పడుతుంది. కళ్ళు మరోలా పెట్టడంతో విక్రాంత్ భయపడతాడు. ఆ సమయంలో విక్రాంత్ బట్టల పై గాయత్రి కక్కిన పాల వాసన రావడంతో దానిని ఇష్టంగా పీల్చుకుంటుంది సుమన. దాంతో విక్రాంత్ కు అనుమానం వస్తుంది. వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్తాడు.

ఆ తర్వాత ఎద్దులయ్య గాయత్రీ ని ఆడిపిస్తూ ఉండగా అప్పుడే తిలోత్తమా ఎద్దులయ్యను గోరింటాకు పెట్టాలా అని అడుగుతుంది. దాంతో ఎద్దులయ్య తనకు వద్దని పాపకు పెట్టమని అంటాడు. అయితే గతంలో స్వామీజీ గాయత్రి, తిలోత్తమా కుడి చేతులు కలిస్తే తిరిగి తిలోత్తమా కు షాక్ కొడుతుందని చెప్పగా ఇప్పుడు అది నిజం అవుతుంది. తను గాయత్రికి గోరింటాకు పెడుతుండగా వెంటనే షాక్ కొట్టి కింద పడుతుంది.

అది చూసి విశాల్ వెంటనే ఎదులయ్యను అక్కడి నుంచి పంపించి పాపని తీసుకుని వెళ్తాడు. ఇక తిలోత్తమా గట్టిగా అరవటంతో అందరూ వచ్చి ఏం జరిగింది అని టెన్షన్ పడుతూ కనిపిస్తారు. విశాల్ పాపకి డ్రెస్ మార్చి ఎద్దులయ్యకు జరిగిన విషయం గురించి చెప్పకుండా అబద్ధం చెప్పమని సలహా ఇస్తాడు. వెంటనే నయని తిలోత్తమా కు నీరు చల్లి లేపగా తిలోత్తమా జరిగిన విషయం చెబుతుంది.

అప్పుడే ఎద్దులయ్య అప్పుడే పడుకొని లేచినట్లుగా వచ్చి ఏం జరిగింది అన్నట్లుగా నటిస్తూ ఉంటాడు. విశాల్ కూడా పాపని ఎత్తుకొని రావటంతో అయోమయంలో కనిపిస్తుంది తిలోత్తమా. దాంతో తిలత్తమాకు మతి చెడినట్లుగా క్రియేట్ చేస్తారు. ఇక అందరూ అక్కడ నుంచి వెళ్ళగా నయని తన భర్తతో పాప డ్రెస్ ఎందుకు మార్చారు అని అడగటంతో ఇక నిజం చెప్పకుండా విశాల్ నిద్ర వస్తుంది అని చెప్పి తప్పించుకుంటాడు.

ఆ తర్వాత పాప డ్రెస్ ఇక్కడ పడేసావ్ ఏంటి అంటూ విశాల్ మామయ్య వచ్చి విశాల్ తో అనటంతో దీని గురించి గట్టిగా మాట్లాడకు అని అంటాడు. అప్పుడే నయని రావటంతో మాట మార్చేస్తారు. ఇక మామ, అల్లుడు ల మధ్య ఉన్న సన్నిహితం చూసి మురిసిపోతుంది. ఆ తర్వాత ఆయన విశాల్ దంపతులకు.. రేపు గాయత్రమ్మ గారి వర్ధంతి కోసం తిలోత్తమా ఏర్పాటు చేస్తుంది అనటంతో వాళ్లు షాక్ అవుతారు. పాప పునర్జన్మగా పుట్టింది కదా మళ్లీ ఇవన్నీ ఎందుకు చేస్తుంది అని టెన్షన్ పడతారు.

Also Read: Prema Entha Madhuram June 26th: కోర్టు మెట్లెక్కిన వర్ధన్ ఫ్యామిలీ.. అందరికీ పెద్ద షాకిచ్చిన మాన్సీ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
PPF Rules: పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
Embed widget