అన్వేషించండి

Trinayani August 31th: 'త్రినయని' సీరియల్: చెల్లికి పెద్ద షాకిచ్చిన నయని, మాటలతో తన అక్కను బాధ పెట్టిన సుమన?

నయని సుమనకు ఆస్తి విషయంలో పెద్ద షాక్ ఇవ్వటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Trinayani August 31th: వయసు మీద పడిన వ్యక్తి లాగా విశాల్ స్పృహ కోల్పోయి ఉంటాడు. ఇక ఎద్దులయ్య తనను లేపగా వెంటనే విశాల్ నయనిని పిలవటంతో నయని ఎమోషనల్ గా చూస్తూ ఉంటుంది. ఇక విశాల్   ఇంట్లో పిల్లలు వదిలేసి వచ్చావా అంటూ అడుగుతూ ఉంటాడు. ఇక తన చేతులు చూసుకొని తను ఎందుకిలా అయ్యానో అని అడుగుతూ బాధపడుతూ ఉంటాడు. అక్కడే ఉన్న తిలోత్తమా వాళ్ళు కూడా చూసి షాక్ లో ఉంటారు.

అక్కడ నుంచి తొందరగా వెళ్లిపోవాలని ఇంటికి బయలుదేరుతారు. నయని కూడా విశాల్ ను ఇంటికి తీసుకొని వెళుతుంది. మరోవైపు ఇంట్లో గాయత్రి పాప తల్లిదండ్రులు లేకున్నా కూడా బాగానే ఉంది కదా అనడంతో వెంటనే సుమన.. ఎంతైనా కన్న తల్లిదండ్రులు ఉంటే వాళ్ల కోసం వెతికేది.. వీళ్ళు దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కదా.. అయిన పుట్టినప్పటినుంచి తల్లిదండ్రులకు దూరంగా ఉంది కాబట్టి తనకు అలవాటే అని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది.

వెంటనే హాసిని అలా అనొద్దు అంటూ.. పిల్లలను ఎవరినైనా సరే బాగా చూసుకోవాలి అంటుంది. అప్పుడే డమ్మక్క సుమనకు పాపని చూసుకోవటమే సరిపోతుందేమో అంటూ కాస్త వెటకారంగా అంటుంది.  వెంటనే విక్రాంత్.. తను ఎక్కడ చూసుకుంటుంది పాపను ఒంటరిగా వదిలేసింది అంటూ కాస్త తిడుతున్నట్లు కనిపిస్తాడు. ఇక సుమన తన చేతులకు ఆస్తి వచ్చాక ఇక్కడ ఎవరితోని పని లేదు అని అంటుంది.

అప్పుడే అక్కడికి తిలోత్తమా, వల్లభ కూడా వస్తారు. ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని అడగటంతో.. సుమన ఇంట్లో నొప్పులతో బాధపడుతుందని డాక్టర్ ని పిలవడానికి వెళ్ళాము ఆ లోపే బిడ్డ పుట్టిందని తెలిసింది అని వచ్చాము అంటూ కవర్ చేస్తారు. వెంటనే హాసిని వారిపై వెటకారం చేస్తూ మాట్లాడుతూ వుంటుంది. ఇక నయని వాళ్ళ కోసం ఎదురు చూడగా వాళ్ళు కూడా అక్కడికి వస్తారు.

విశాల్ ఎక్కడ అని ఇంట్లో వాళ్ళు అడగడంతో అతడే విశాల్ అని ఎద్దులయ్య చెప్పటంతో అందరూ షాక్ అవుతారు. దాంతో సుమన, తిలోత్తమా నోటికొచ్చినట్లు వాగుతూ ఉంటారు. ఇక హాసిని వాళ్ళు తనే విశాల్ అని గుర్తుపడతారు. ఇక సుమన నయనిపై ఫైర్ అవుతుంది. ఆస్తి గురించే బావని తీసుకొని రాలేదు అని నానా రచ్చ చేస్తూ ఉంటుంది. నయని కూడా బాబు వచ్చాకే ఆస్తి వస్తుంది అని వాళ్లకు తిరిగి షాక్ ఇస్తుంది.

ఆ తర్వాత సుమన పాప దగ్గరికి పెద్ద బొట్టమ్మ వచ్చి చూస్తూ ఉండగా అక్కడికి డమ్మక్క, ఎద్దులయ్య వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో.. సుమన, నయని వాళ్ళు చూస్తారు అని అంటాడు. ఇక అప్పుడే అందరూ అక్కడికి వచ్చి కాసేపు మాట్లాడుతూ ఉంటారు. ఇక నయని పాపని చూసి తనకు 501 రూపాయలతో దిష్టి తీసి ఎవరి దిష్టి తగలకూడదు అని అనగా వెంటనే సుమన నీ దిష్టి అసలే తగలకూడదు అని అనడంతో వెంటనే విక్రాంత్ సుమన్ పై అరుస్తాడు. ఆ మాటలకు నయని ఫీల్ కాదు. 

also read it : Prema Entha Madhuram August 30th: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: ఛాయాదేవికి తిరిగి ఛాలెంజ్ చేసిన ఆర్య

 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
Bigg Boss Telugu Season 8 : సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Embed widget