Trinayani June 21th: విశాల్‌కు ప్రాణగండం-నయనికి సుమన బిడ్డతో రక్తసంబంధం ఉందా?
నయని బొట్టు చెరిగిపోవడం వల్ల విశాల్ కు ప్రాణగండం ఉందని తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Trinayani June 21th: గాయత్రికి తిలోత్తమా గంధం రాస్తూ ఉండగా ఆ పుట్టుమచ్చని చూస్తూ ఆలోచిస్తూ ఉండగా వెంటనే తనకు గాయత్రి గుర్తుకొస్తుంది. దెబ్బకు వెనక్కి జరగటంతో అందరు షాక్ అవుతారు. వెంటనే ఎద్దులయ్య అమ్మ మనసులో ఏదో కలత కారం చెందింది అని అంటాడు. ఇక ఇంట్లో వాళ్ళు ఏం జరిగింది అని అడగటంతో.. తిలోత్తమా విశాల్ తో గాయత్రి మీ సొంత బిడ్డనా అని అడుగుతుంది.
గానవికి వెంట్రుకలు తీయకుండా గాయత్రి కి వెంట్రుకలు ఎందుకు తీశారు అని అడుగుతుంది. దాంతో విషయాలు జాతకం ప్రకారం తీయించాము అనటంతో వెంటనే విక్రమ్ జాతకం కాగితము అప్పుడే కాలిపోయింది అనటంతో.. అవును అని అందరూ అంటారు. అలా ఎలా జాతకం తెలిసింది అని విశాల్ ను ప్రశ్నించడంతో విశాల్ డేట్, సమయం చెప్పటంతో గురువుగారు జాతకం చెప్పాడు అని అంటాడు.
ఎప్పుడు పుట్టింది అని మళ్ళీ తిలోత్తమా ప్రశ్నించడంతో.. సెప్టెంబర్ ఒకటి అనటంతో అందరూ షాక్ అవుతారు. గానవి పుట్టినరోజే గాయత్రి కూడా పుట్టిందా అని అనటంతో వెంటనే హాసిని మరి కవల పిల్లలు అన్నప్పుడు ఒకేరోజు ఒకే సమయానికి పుడతారు కదా అని అనటంతో అందరూ మరోసారి ఆశ్చర్యపోతారు.
కవల పిల్లల అని అనటంతో తల్లి తన మనసులో ఇలా అంటున్నాను ఏంటి అని మరో స్టోరీ చెబుతుంది. దాంతో విశాల్ కూడా అదే అదే అని అంటాడు. ఇక తిలోత్తమా కాస్త వెటకారించి మాట్లాడి అక్కడి నుంచి వెళ్తుంది. వెంటనే గురువు ఆషాడ మాసం అని నయనికి జాగ్రత్తగా ఉండమని చెబుతాడు. ఆ తర్వాత అది లోకి వెళ్లిన తిలోత్తమా, వల్ల అర్థ చంద్రకారపు పుట్టుమచ్చ గురించి చర్చ చేస్తూ ఉంటారు.
వెంటనే హాసిని వాళ్ళు ఆ చర్చ చేయకూడదు అని వచ్చి డిస్టర్బ్ చేసి వెళుతుంది. ఆ తర్వాత హాసిని సుమనకు నిమ్మకాయ ఇస్తుండటంతో వెంటనే ఎద్దులయ్య సుమన అది తాగదు అని అంటాడు. కానీ సుమన అది తీసుకోగా పుల్లగా ఉందని అంటుంది. ఇక హాసిని బాగానే వేశాను కదా జ్యూస్ తీసుకొని వస్తుంటే గానవికి కూడా తాపించాను అని అనటంతో ఛీ తన ఎంగిలి నీళ్లు తాగానా అని విసిరి కొడుతుంది.
వెంటనే ఆ జ్యూస్ నయని ముఖం మీద పడటంతో బొట్టు చెడిపోతుంది. దాంతో నయని నా మీద పడింది కాబట్టి సరిపోయింది లేదంటే పాప మీద పడితే ఎలా ఉంటుంది అని ఫైర్ అవుతుంది. వెంటనే విక్రాంత్ కూడా సుమన పై అరుస్తాడు. అలా కొద్దిసేపు అక్కడ ఆ చర్చ జరిగాక.. డమ్మక్క వచ్చి బొట్టు పెట్టుకోమని నయనికి బొట్టు ఇస్తుండగా జారి కింద పడుతుంది.
దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత విశాల్ వచ్చి ఆ బొట్టు పెడుతుండగా బొట్టు అంటుకోదు. దాంతో అందరు చూసి ఆశ్చర్యపోగా ఆ విషయం చెప్పటంతో నయని కూడా తన భర్తకు ప్రాణగండం ఉందనుకొని భయపడుతుంది. బొట్టు అంటుకోకపోయేసరికి వల్లభ నోటికి వచ్చినట్లు వాగుతూ ఉంటాడు. ఇక బొట్టు అంటుకోవాలి అంటే దానికి పరిష్కారం గురువుని అడగటంతో ఆయన కొన్ని విషయాలు చెప్పి.. దానికి ఒక పరిష్కారం ఉందని అంటాడు.
సుమనకు పుట్టబోయే బిడ్డ రక్తము నయని నుదుటిమీద పెడితే అప్పుడు బొట్టు నిలబడుతుంది అని అనటంతో మరోసారి అందరూ ఆశ్చర్యపోతారు. వెంటనే తిలోత్తమా తమ రక్తసంబంధం కాని వాళ్ళతో సంబంధం ఏంటి అన్నట్లు మాట్లాడుతూ ఉండగా గురువు వారిపై ఫైర్ అవుతాడు.
Also Read: Prema Entha Madhuram June 20th: జోగమ్మపై అనుమానం పడుతున్న ఆర్య-అనుని చంపించడానికి సిద్ధమైన మాన్సీ?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial