అన్వేషించండి

Naga Panchami Serial Today May 17th: 'నాగ పంచమి' సీరియల్: శివయ్య సన్నిధిలోని పంచమి బిడ్డల్ని తాకలేకపోయిన నాగేశ్వరి, శత్రువులు వస్తారంటూ జోస్యం!

Naga Panchami Serial Today Episode : సుబ్బు సాయంతో పంచమి బిడ్డల్ని మోక్ష, పంచమి శవయ్య సన్నిధిలో ఉంచడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode : పంచమి ఇద్దరి బిడ్డలకు జన్మనిస్తుంది. ఇద్దరిలో తన తల్లి విశాలాక్షి ఎవరో, ఎవర్ని నాగేశ్వరి నాగలోకం తీసుకెళ్తుందో అని పంచమి అనుకుంటుంది. ఇద్దరూ తన ప్రాణమే అని తాను ఏ బిడ్డనూ ఇవ్వనని అనుకుంటుంది. ఇక మోక్ష, నాగేశ్వరి అక్కడికి వచ్చే సరికి బిడ్డల ఏడుపు విని నాగేశ్వరి ప్రసవం అయినట్లుందని అంటుంది.

మోక్ష బిడ్డలను చూసి ఎమోషనల్ అవుతాడు. పంచమి అనుకుంటూ వెళ్లి బిడ్డల్ని ఎత్తుకొని గుండెలకు హత్తుకుంటాడు. మారు వేషంలో ఉన్న నాగేశ్వరి పంచమి తలను తన ఒడిలో పెట్టుకుంటుంది. 

మోక్ష: థ్యాంక్స్ పంచమి ఒకరికి ఇద్దరిని కానుకగా ఇచ్చావ్. వీళ్లిద్దరూ నా రెండు కళ్లు. ఈ సంగతి మా ఇంట్లో తెలిస్తే వాళ్ల సంతోషానికి అవధులు ఉండవు. చాలా చాలా హ్యాపీ అయిపోతారు. మా శబరి అయితే ఇద్దరినీ అస్సలు వదిలి పెట్టదు. 

నాగేశ్వరి: మనసులో.. ఈ ఇద్దరిలో మా మహారాణి విశాలాక్షి ఎవరు? నేను నాగలోకం ఎవర్ని తీసుకెళ్లాలి. 

పంచమి, మోక్ష ఇద్దరు బిడ్డల్ని తీసుకొని అడవి గుండా నడుచుకుంటూ తీసుకొని వెళ్తుంటారు. అడవిలో ఎటు వెళ్లాలో తెలీక ఓ చోట నిల్చొంటారు. అప్పుడే గుహలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం నుంచి సుబ్బు బయటకు వస్తాడు. పంచమి  సుబ్బుని చూస్తుంది.

పంచమి: సుబ్బు.. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావ్.

సుబ్బు: గురువుగారు చెప్పారు పంచమి. నేను ఎలా వచ్చాను అనేది కాదు మీకు కలుసుకోవడం నిజం.

మోక్ష: నువ్వు రావడం మాకు కొండంత అండ లభించింది సుబ్బు. ఎటు వెళ్లాలో తెలీక అయోమయంలో ఉన్నాం. 

సుబ్బు: చంటి పిల్లలు బాగా విశ్రాంతి అవసరం ఈ పక్కనే గుడి ఉంది. ఈ రాత్రికి అక్కడే ఉండండి. పంచమి బాగా ఇష్టమైన శివాలయం. వెళ్లి అక్కడ తల దాచుకోండి. 

మోక్ష: సుబ్బు ఆ గుడి చాలా దూరమా.

సుబ్బు: లేదు మోక్ష కావాంటే చూడు మీకే కనిపిస్తుంది. అంటూ సుబ్బు చేతిలోని కాగడా చూపించడంతో పాత శివాలయం కనిపిస్తుంది. మోక్ష పంచమి సంతోషిస్తారు. 

పంచమి: చాలా థ్యాంక్స్ సుబ్బు సమయానికి మాకు దారి చూపించావ్. లేదంటే మేం చాలా ఇబ్బంది పడేవాళ్లం. సుబ్బు మోక్ష చేతికి కాగడా ఇచ్చి జాగ్రత్తగా వెళ్లండి.

పంచమి, మోక్ష బిడ్డల్ని తీసుకొని గుడికి చేరుకుంటారు. పంచమి దీపాలు వెలిగిస్తుంది. మోక్ష బిడ్డను పంచమికి ఇచ్చి ఇప్పుడే వస్తాను అని వెళ్తాడు. పంచమి ఇద్దరు బిడ్డల్ని ఒడిలో పెట్టుకొని లాలిస్తుంది. మోక్ష అడవికి వెళ్లి వేపాకు రెమ్మలు అరటి ఆకులు పట్టుకొని వచ్చి పిల్లల కోసం పడక రెడీ చేస్తాడు. పిల్లలది లేత చర్మం అని ఆకులు కొమ్మల మీద పెడితే ఇబ్బంది పడతారు అని పంచమి అంటే మోక్షతన షర్ట్‌ని వాటి మీద వేసి పిల్లల్ని పడుకోపెడతాడు. ఇక పంచమి తన చీర కొంగు చింపి పిల్లలకు కప్పుతుంది. 

పంచమి: మన ఇద్దరి ప్రేమ కలిసి ఈ ఇద్దరు పిల్లులు పుట్టారండి. వీళ్లు మన ప్రేమకు ప్రతిరూపాలు. 

మోక్ష: మన సంపద మన ప్రాణం వీళ్లే పంచమి. నాకు ఇద్దరు పిల్లల్ని కానుకగా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.

పంచమి: అంతా ఆ స్వామి దయ మోక్షాబాబు. నా జీవితంలో ఏ వింత జరిగినా అది శివయ్య లీలే అనుకుంటాను. 

పిల్లల్ని శివయ్య ఎదురుగా పడుకో పెట్టి మోక్ష, పంచమి పక్కనే కూర్చొని పడుకుండిపోతారు. ఇక నాగేశ్వరి పాము ఇద్దరు పిల్లలు దగ్గరకు వస్తుంది. నాగేశ్వరి ఇద్దరినీ చూస్తుంది. ఇద్దర్ని నాగలోకానికి తీసుకెళ్లపోతానని.. వారిలో ఎవరు తమ మహారాణి విశాలాక్షి అనేది అక్కడ తెలుసుకుంటానని అనుకుంటుంది. అయితే శివుడి లీల వల్ల పిల్లల చుట్టూ రక్షణ కవచం ఏర్పడుతుంది. నాగేశ్వరి టచ్ చేయలేకపోతుంది. 

నాగేశ్వరి: ఈ పిల్లలు శివయ్య రక్షణలో ఉన్నారు. పిల్లల దగ్గరకు వెళ్లలేను. ముందుకు వెళ్తే భష్మం అయిపోతాను. లాభం లేదు పిల్లల్ని తీసుకెళ్లలేను. అని పాములా మారి వెళ్లిపోతుంది. 

ఇక జ్వాలకు కూడా బాబు పుడతాడు. పంచమి గురించి తెలియక అందరూ ఆందోళన చెందుతూ ఉంటారు. ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో మాట అంటారు. ఇక మోక్ష ఇంటి ఎదురుగా దేవర అని ఒకతను శంఖం ఊదుతారు. ఆ శబ్ధానికి అందరూ బయటకు వెళ్తారు. అయిన వాళ్లు రారు.. కాని వాళ్లు వస్తారని దుష్ట శక్తులు మీ ఇంటిని కబలించబోతున్నాయని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: సితార పాపకు భక్తి ఎక్కువ - మహేష్ కూతురి మెడలో లాకెట్ చూశారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget