అన్వేషించండి

Naga Panchami Serial Today March 26th: 'నాగ పంచమి' సీరియల్: పంచమిలోని విషాన్ని స్వీకరించేసిన కడుపులోని బిడ్డ.. భార్యతో ఆ ప్రయోగం చేసిన మోక్ష!

Naga Panchami Serial Today Episode గుడికి వెళ్లిన పంచమి, మోక్షలకు సబ్బు పంతులుగా మారి పూజ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode: తన కూతురు ఇప్పుడు విషకన్య కాదు అని గర్భంలో ఉన్న తానే తన కూతురులోని విషం మొత్తం స్వీకరించాను అని యుహారాణి విశాలాక్షి నాగేశ్వరికి చెప్తుంది. తాను పంచమికి పుట్టగానే నాగలోకం తీసుకెళ్లిపోతే కడుపు కోతతో తన కూతురు దుఃఖించకూడదు అని తను తన భర్తతో సంతోషంగా కాపురం చేసి భర్తతో కలిసి పిల్లల్ని కనాలి అంటే తనలో విషం ఉండకూడదు అని అందుకే ఆ విషం తాను స్వీకరించాను అని మహారాణి చెప్తుంది.

నాగేశ్వరి: మంచి పని చేశారు మహారాణి. ఏం జరుగుతుందో అని భయపడిపోయాను. 
మహారాణి: నేను భౌతికంగా నా కూతురుకి ఎలాంటి సాయం చేయలేను. నువ్వు పక్కన ఉండి నా బిడ్డను కాపాడుకుంటూ నేను పుట్టుగానే నన్ను నాగలోకం తీసుకొని వెళ్లిపో. 
నాగేశ్వరి: అలాగే మహారాణి యువరాణిని తనలో పెరుగుతున్న మిమల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. 

పంచమి శరీరంలో విషం పోవడంతో మోక్ష చాలా సంతోషిస్తాడు. తన భార్య నాగకన్య కాదు అని అందమైన నా భార్యవి అని ఆనందంతో పంచమిని ఎత్తుకొని తిప్పుతాడు. ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక దాన్ని దూరం నుంచి చూసిన నాగేశ్వరి పాము పంచమి వాళ్ల కారులో ఎక్కి కూర్చొంటుంది. 

కరాళి: వాళ్ల సంతోషం చూస్తుంటే నాలోని రక్తం మరుగుతుంది. 
ఫణేంద్ర: నా రాణిగా ఊహించుకున్న పంచమి మోక్ష బిడ్డను కడుపులో మోయడంతో నాలోని విషం పొంగిపొర్లుతుంది కరాళి. వెంటనే వాళ్లని కాటేసి చంపేయాలి అని ఉంది.
కరాళి: వాళ్లని అంత ఈజీగా చంపకూడదు ఫణేంద్ర. ముందు పంచమి కడుపులోని బిడ్డను చిదిమేయాలి.
ఫణేంద్ర: ఏం చేస్తే వాళ్లు చస్తూ బతుకుతారో అది చేద్దాం.

మరోవైపు రఘురాం, వైదేహి ఇంటికి వస్తారు. పంచమిని ఎందుకు బయటకు తీసుకెళ్లారు ఏమైంది అని శబరి ప్రశ్నిస్తుంది. రఘురాం తన తల్లిని టెన్షన్ పడొద్దు అని శుభవార్త అని చెప్తాడు. అందరూ షాక్ అవుతారు. రఘురాం పంచమి ప్రెగ్నెంట్ కన్ఫమ్ అయిందని చెప్తాడు. జ్వాలా వాళ్లు షాక్ అవుతారు. 

శబరి: చూశారా నాగసాధువు మాటలు మీరంతా కొట్టిపడేశారు. ఆయన ఏం చెప్తే అది అవుతుంది. 
మీనాక్షి: మరి వదిన ఎందుకు అలా ఉంది ఇది సంతోషించాల్సిన విషయమే కదా. 
వైదేహి: డాక్టర్ చెప్పిన తర్వాత ఆ అనుమానం తీరిపోయింది కానీ పంచమి ఎందుకు అలా తనకు సంతాన యోగం లేదు అని చెప్పింది. 
శబరి: ఎప్పుడో ఏదో అన్నది అని అదే పట్టుకొని వేలాడకు వైదేహి. 
రఘురాం: పంచమిని తీసుకెళ్లి టెస్టులు చేయించాం కదా ఇంకా ఎవరూ నోరు తెరవడానికి వీల్లేదు. 
భార్గవ్: మా అనుమానాలు మాకు ఉన్నాయి నాన్న. మీ వెంటే వచ్చిన అమ్మే నమ్మడం లేదు అంటే ఏదో తేడాగా ఉంది అనేకదా..
రఘురాం: చూడు వైదేహి నీ కారణంగా ఇంట్లో అందరూ సందేహ పడే పరిస్థితి వచ్చింది. నిజాన్ని నువ్వు ఎందుకు జీర్ణించుకోలేవు చెప్పు.
చిత్ర: పంచమి మనిషి రూపంలో ఉన్న పాము కాబట్టి మామయ్య.
శబరి: నువ్వు నోరు ముయ్. పంచమి గురించి నీకు ఏం తెలుసు. మీరు అనే విషనాగులు మీరే. పంచమి కాదు. తను ప్రాణాలు పోసే అమృతమే. 
రఘురాం: అందరికీ చెప్తున్నా నేను పంచమి విషయంలో చాలా క్లియర్‌గా క్లారిటీగా ఉన్నాను. పంచమి దగ్గర ఓ అమోఘమైన శక్తి ఉంది. పాములు తన మాట ఉంటాయి. పాములు కాటేస్తే తాను కాపాడగలదు. అవన్నీ తనని మెచ్చుకోదగ్గవే కానీ నిందించాల్సినవి కాదు. వైదేహి ఒక్కసారి అన్నీ గుర్తు చేసుకో పంచమి గొప్ప తనం గురించి నువ్వే మాకు కాల్ చేసి చెప్పావ్. 
శబరి: పంచమి అనే అమ్మాయే లేకపోతే ఈరోజు మన మోక్ష మనకు ఉండే వాడా. 
రఘురాం: పంచమి మన మోక్షకు సరైన జోడి. ఒక్కసారి పాజిటివ్‌గా ఆలోచించు వైదేహి అప్పుడు నీకు పంచమి అర్థమవుతుంది. వైదేహి గతాన్ని గుర్తు చేసుకుంటుంది. 

పంచమి, మోక్షలు గుడికి వస్తారు. ఇక సుబ్బు పంతులుగా మారి పంచమి, మోక్షలతో పూజ చేయిస్తాడు. సుబ్బు కనిపించడం లేదని పంచమి అనుకుంటుంది. సుబ్బుని చూడకపోతే తనకు ఏదో వెలతగా ఉంటుందని అంటుంది. మోక్ష పంచమితో పంతుల్ని అడుగుదామని అంటాడు. ఇక పంతులు సుబ్బుగా మారిపోతాడు. పంచమి దగ్గరకు వస్తాడు. పంచమి సంతోషంగా సుబ్బుతో మాట్లాడుతుంది. 

పంచమి: ఈరోజుతో మా కష్టాలు అన్నీ పోయాయి స్వామి. ఎప్పుడూ ఆ స్వామికి మా బాధలు చెప్పుకొని కోరుకునే వాళ్లం. కానీ ఈరోజు ఏం చెప్పలేదు. ఈరోజు మా సంతోషాన్ని పంచుకోవడానికి వచ్చాం.
సుబ్బు: మంచిది పంచమి మొదటి సారి మీ ఇద్దర్ని చాలా సంతోషంగా చూస్తున్నాను. 
మోక్ష: మేం తల్లిదండ్రులం కాబోతున్నాం. 
పంచమి: మాకు పుట్టబోయే బిడ్డకు నువ్వే పేరు పెట్టాలి సుబ్బు. ఏదైనా మంచి పేరు ఆలోచించు. 
సుబ్బు: పిల్లల పుట్టుక తల్లిదండ్రుల చేతుల్లో ఉండదు. ఎవరి కడుపులో పుట్టాలో పిల్లలే నిర్ణయించుకుంటారు. తన దివ్య దృష్టితో నాగేశ్వరి మహారాణిని చూస్తారు. 

ఇక గుడి నుంచి పంచమి, మోక్ష ఓ చోట ఆగి కొబ్బరి బొండం తాగుతారు. ఇక దాన్ని కరాళి, ఫణేంద్ర చూస్తారు. మోక్ష ఒకే బొండంలో రెండు స్ట్రాలు వేయడంతో పంచమి కంగారు పడుతుంది. ఏం కాదు అని మోక్ష చెప్తాడు. నీలో విషం లేదు అని మన కలయిక వల్ల నీలోని విషం పోయింది అని అంటాడు. అయినా పంచమి అంగీకరించదు. ఎంత దూరం ఉంటే అంత మంచిది అని చెప్తుంది. మోక్ష పంచమి చేతిలో కొబ్బరి బొండం పెట్టి తానో సైంటిస్ట్ అని ధైర్యం చేయకపోతే మనం మన జీవితాన్ని కోల్పోతాం అని అంటాడు. ఏం జరగదు అని పంచమికి ధైర్యం చెప్పి తాగమని అంటాడు. ఇద్దరూ కలిసి కొబ్బరి బొండం ఒకేసారి తాగుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: మిస్టర్ బచ్చన్: యాక్షన్ మోడ్ లో రవితేజ - 'మిస్టర్ బచ్చన్' నుంచి క్రేజీ అప్డేట్ అందించిన హరీష్ శంకర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
Siddharth - Pushpa 2: ‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
Chinmoy Krishna Das News: బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
RC 16 Update: బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
Embed widget