అన్వేషించండి

Naga Panchami Serial Today February 12th - 'నాగ పంచమి' సీరియల్: పంచమి నిర్ణయంతో ఫుల్ ఖుషీలో మోక్ష.. రగిలిపోతున్న వైదేహి!

Naga Panchami Serial Today Episode దగ్గరుండి మోక్షతో నీ పెళ్లి జరిపిస్తాను అని పంచమి మేఘనకు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode మోక్ష, మేఘనల నిశ్చితార్థం పెళ్లి రెండూ వాటికవే నేను పెట్టిన ముహూర్తానికే జరగుతాయి అని వైదేహి ఇంట్లో వాళ్లందరికీ తేల్చి చెప్తుంది. ఇంతలో మోక్ష వచ్చి జరగవమ్మా అని షాక్ ఇస్తాడు. నిశ్చితార్థమే జరగనప్పుడు పెళ్లి ఎలా జరుగుతుంది అని మీరు ఏ పనులు చేయొద్దని తనకు మేఘనకు పెళ్లి జరగదు అని మోక్ష అంటాడు. ఈ పెళ్లి జరగదు అని మేఘనకు కూడా తెలుసమ్మా. పంచమి, మేఘన మంచి ఫ్రెండ్స్. నేను మేఘనను పెళ్లి చేసుకుంటాను అని తెలిస్తే పంచమి ఈ పెళ్లి అపుతుంది అని మేఘన ఓకే చెప్పింది అని మోక్ష తల్లితో చెప్తాడు. ఈ జన్మకు నా పక్కన పంచమి తప్ప మరెవరికీ చోటు లేదు. నేను వద్దూ అనుకున్నా పంచమి నన్ను వదిలి వెళ్లదమ్మా ఆ నమ్మకం నాకు ఉంది అని మోక్ష అంటాడు. 

ఇక వైదేహి మేఘనను నిలదీస్తుంది. దీంతో మేఘన ఆంటీ మోక్ష మనసులో నాకు స్థానం లేదు అని అర్థమైంది. అని అంటుంది. ఇక పంచమి అక్కడ జరిగేదంతా వింటూ ఉంటుంది. మోక్షాబాబుని నేను ఒప్పిస్తా అత్తయ్య అంటూ వస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. మోక్షబాబు, మేఘనల పెళ్లి నేను జరిపిస్తాను అని చెప్తుంది. దీంతో వైదేహి పంచమిని కొట్టి ఇంటి నుంచి గెంటేస్తుంది. దీంతో పంచమి వైదేహికి ఎదురుతిరుగుతుంది.  మళ్లీ నామీద చేయి ఎత్తితే ఈ ఇంట్లో అత్తగా మర్యాద ఉండదు నీకు. అత్తగా మీకు ఎంత హక్కు ఉందో కోడలిగా నాకు అంతే హక్కు ఉంది. నేను తలచుకుంటే మీ కొడుకు ఒక్క క్షణం కూడా మీ కంటి ముందు ఉండే వాడు కాదు. ఎప్పుడో నాతో తీసుకెళ్లిపోయేదాన్ని. ఇప్పుడు చెప్తున్నా అందరూ వినండి నేను మోక్షబాబు భార్యని. ఇక్కడే ఉంటాను. నా భర్తతో కలిసే ఉంటాను. ఎవరు నా జోలికి వచ్చినా వాళ్లకి మర్యాద ఉండదు. ముఖ్యంగా మీకే చెప్తున్నా జాగ్రత్త అని అత్తని బెదిరిస్తుంది. ఇక మేఘన పంచమిని గదిలోకి తీసుకెళ్లిపోతుంది. మరోవైపు ఇందంతా విన్న ఫణేంద్ర పాము పంచమిలో చాలా మార్పు వచ్చిందని తనని నాగలోకం తీసుకెళ్లడం అసాధ్యం అని అనుకుంటాడు.  

మేఘన: నా మనస్ఫూర్తిగా చెప్తున్నా పంచమి నువ్వు మోక్ష ఎప్పటికీ విడిపోకూడదు. నా గురించి ఆలోచిస్తున్నావా నీ నిర్ణయంతో నాకు చాలా సంతోషంగా ఉంది. నీ బలవంతం వల్లే నేను ఇక్కడికి వచ్చాను కానీ నాకు అయితే మోక్షని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు పంచమి. నిన్ను ప్రాణంలా ప్రేమించే వ్యక్తిని నా సొంతం చేసుకోవడం ఎలా అని చాలా మదనపడుతున్నాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది.
పంచమి: నీతో చాలా విషయాలు మాట్లాడాలి మేఘన. ఇప్పుడు నీకు అన్నీ వివరంగా చెప్పలేను. 
మేఘన: నాకు ఏం చెప్పక్కర్లేదు పంచమి.
పంచమి: నేను కఠినంగా మారడానికి చాలా కారణాలు ఉన్నాయి. నేను కొన్ని రోజులు మోక్షబాబుకి దగ్గరగా ఉండాలి. అన్నీ మార్గాలు అయిపోయాయి. అందుకే ఇప్పుడు ఈ మార్గం ఎంచుకున్నా. నా నుంచి మోక్షాబాబుని దూరం చేయడం కోసమే కరాళి నిన్ను బలిపశువును చేసింది మేఘన. నీకు అన్యాయం జరగనివ్వను.
మేఘన: ప్రేమంటే నీది మోక్షదే పంచమి. మీ మధ్య వేరే వారికి చోటు లేదు. దయచేసి మోక్షని పెళ్లి చేసుకోమని నన్ను బలవంతం చేయకు.
పంచమి: అలా అనకు మేఘన.  నీ ద్వారానే నాకు కరాళిని పట్టుకునే మార్గం దొరుకుతుంది. మోక్షాబాబుని ఒప్పించడానికి నాకు నీ సాయం కూడా కావాలి. నా చేతులతోనే మీ పెళ్లి జరిపిస్తాను మేఘన ధైర్యంగా ఉండి.
మేఘన: కరాళిని పట్టుకోవాలి అని కరాళికే చిక్కావు పంచమి. నీ చేతులతోనే మోక్షని బలిపశువును చేయనున్నావు.

జ్వాల: మీరు ఎవరు గురించి మాట్లాడుతున్నారు.
వరుణ్: నీ గురించే నువ్వు చాలా క్రూయల్ అని చెప్తుంది నీ కో సిస్టర్.
జ్వాల: ఏయ్...చిత్ర..
వరుణ్‌: జ్వాలా నీలో చాలా మార్పు కనిపిస్తుంది. 
చిత్ర: అప్పుడు మేఘనని చాలా తిట్టావ్ ఇప్పుడు మేఘనని నా చెల్లి అని వెనకేసుకొస్తున్నావ్.
జ్వాల: మీరు ఈ జ్వాల గురించి తప్పుగా అనుకుంటున్నారు. నేను ఒకరికి భజన చేసే టైప్ కాదు.
భార్గవ్: అరే ఏంటి అన్నయ్య ఇది ఇప్పుడే కదా మనం మన కంటితో చూశాం. ఇంతలోనే వదిన అలా మాటలు మార్చి మార్చితే ఎలా..
వరుణ్‌: మేఘనకు మోక్షకు పెళ్లి చేయాలి అని మా అమ్మకు సపోర్ట్‌గా మాట్లాడుతున్నావ్.
జ్వాల: నేనా... నేను ఎప్పుడూ అలా చేయను. కావాలనే మీ ముగ్గురు నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నారు అది మీ తరంకాదు. 
చిత్ర: ఇదెక్కడో బాగా తేడా కొడుతుంది.
భార్గవ్: ఆలస్యం చేయకు అన్నయ్య త్వరగా డాక్టర్‌ని చూపించండి.

మరోవైపు మేఘన తన అన్న నంబూద్రీ ఆత్మని పిలిచి మాట్లాడుతుంది. నంబూద్రీ కరాళిని మంచిగా మార్చాలని చూస్తాడు. మోక్షని పెళ్లి చేసుకొని మంచి ఫ్యామిలీలో సంతోషంగా ఉండమని చెప్తాడు. కానీ మేఘన మాత్రం తనకు సంసార జీవితం మీద ఇష్టం లేదుని ఈ బంధాలు బాధ్యతల మీద ఇష్టం లేదని తన జీవితం మంత్రాలకే అంకితం అని అంటుంది. తాను మోక్షకి బలిచ్చి తన శక్తులు పొందుతాను అని అంటుంది. పంచమి విషయంలో జాగ్రత్త పడమని నంబూద్రీ చెప్తాడు. దాంతో మేఘన పంచమిని అడ్డు తప్పిస్తాను అని అంటుంది. ఇక పంచమి విషయం తనకు వదిలేయ్‌మని నంబూద్రీ అంటాడు. మరోవైపు మోక్ష పంచమి మాటలు తలచుకొని ఆనంద పడతాడు. ఇంతలో పంచమి వస్తే సంతోషంతో ఎత్తుకొని తిప్పుతాడు.

మోక్ష: పంచమి ఇప్పటికీ నాకు కలగానే అనిపిస్తుంది. మా అమ్మతో నువ్వు అలా మాట్లాడటం ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను అసలు నీకు అంత ధైర్యం ఎలా వచ్చింది పంచమి.
పంచమి: అనుభవం తెచ్చిన ధైర్యం మోక్షాబాబు. నాకు ఆ ధైర్యం స్వతహాగా వచ్చింది కాదు.
మోక్ష: నో పంచమి నీలోప ఉగ్రరూపం ఉంది. మా అమ్మని ఎదురించి అలా మాట్లాడటం సులభం కాదు పైగా ఎదురించి బాగా భయపెట్టావ్. ఇలాగే నువ్వు ఎప్పుడు ఉండాలి పంచమి అప్పుడే నిన్ను ఎవరు టచ్ కూడా చేయలేరు. పెళ్లి చేసుకో అని నన్ను టెన్షన్ పెట్టి చంపేశావ్. 
పంచమి: మనసులో ఎన్ని రకాలుగా చెప్పినా మీరు వినడం లేదు అందుకే మీ భార్యగా ఉంటూ మిమల్ని మార్చాలని అనుకున్నాను.
మోక్ష: నువ్వు మా అమ్మతో చెప్పిన మాటలు నాకు కొండంత ధైర్యం ఇచ్చాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. 
పంచమి: మనసులో.. మీకు ఈ సంతోషం శాశ్వతంగా కావాలి అంటే నన్ను మర్చిపోక తప్పదు. త్వరలోనే మీకు ఆ విషయంలో కనువిప్పు కలిగిస్తాను. మీకు మళ్లీ పెళ్లి చేయాలి అంటే ఇదొక్కటే నాకు కనిపించిన మార్గం.

ఇక మోక్ష పంచమిని బయటకు వెళ్దామని తర్వగా రెడీ అవ్వమని చెప్తాడు. మరో వైపు వైదేహి పంచమి వార్నింగ్‌ని తలచుకొని తెగ చిరాకు పడుతుంది. ఇంతలో మోక్ష వచ్చి మేం అలా జాలీగా తిరిగివస్తామని చెప్తాడు. శబరి వాళ్లు మోక్షకి సపోర్ట్ చేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్ ఫిబ్రవరి 12th: విశాలాక్షి కాలికి రక్తం వచ్చేలా చేసిన సుమన.. చెంప చెల్లుమనిపించిన విక్రాంత్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Funeral Updates: ఢిల్లీలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర, ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ నేతల ఘన నివాళి
ఢిల్లీలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర, ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ నేతల ఘన నివాళి
Sharmistha Mukherjee: ప్రణబ్‌ ముఖర్జీపై కాంగ్రెస్ వివక్ష, కనీసం నివాళులర్పించలేదు: శర్మిష్ఠా ముఖర్జీ సంచలనం
Sharmistha Mukherjee: ప్రణబ్‌ ముఖర్జీపై కాంగ్రెస్ వివక్ష, కనీసం నివాళులర్పించలేదు: శర్మిష్ఠా ముఖర్జీ సంచలనం
KTR ED Notice: ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
Game Changer: ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య... 'గేమ్ ఛేంజర్' టీంకు రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్
ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య... 'గేమ్ ఛేంజర్' టీంకు రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desamరాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Funeral Updates: ఢిల్లీలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర, ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ నేతల ఘన నివాళి
ఢిల్లీలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర, ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ నేతల ఘన నివాళి
Sharmistha Mukherjee: ప్రణబ్‌ ముఖర్జీపై కాంగ్రెస్ వివక్ష, కనీసం నివాళులర్పించలేదు: శర్మిష్ఠా ముఖర్జీ సంచలనం
Sharmistha Mukherjee: ప్రణబ్‌ ముఖర్జీపై కాంగ్రెస్ వివక్ష, కనీసం నివాళులర్పించలేదు: శర్మిష్ఠా ముఖర్జీ సంచలనం
KTR ED Notice: ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
Game Changer: ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య... 'గేమ్ ఛేంజర్' టీంకు రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్
ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య... 'గేమ్ ఛేంజర్' టీంకు రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్
New Year - Liquor Sales : మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సర్కార్ సన్నాహాలు
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సర్కార్ సన్నాహాలు
Political Stunt: సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?
సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Manmohan Singh Memorial : మన్మోహన్ సింగ్  స్మారక చిహ్నానికి స్థలం కేటాయింపుపై కేంద్రం క్లారిటీ
మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నానికి స్థలం కేటాయింపుపై కేంద్రం క్లారిటీ
Embed widget