అన్వేషించండి

Naga Panchami Serial Today April 30th Episode: 'నాగ పంచమి' సీరియల్: జ్వాల గర్భంలోకి ప్రవేశించిన గరుడశక్తి.. తనని మోసం చేయకని కడుపులో తల్లిని వేడుకున్న పంచమి!

Naga Panchami Serial Today Episode : పంచమి అందరు అనుకున్నట్లు తనని మోసం చేయొద్దని తన కడుపులో పెరుగుతున్న బిడ్డని పంచమి వేడుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode కరాళి దగ్గరకు గరుడ రాజు గాయాలతో వస్తాడు. నాగేశ్వరిని ఓడించడం కష్టమని చెప్తాడు. దీంతో కరాళి నేరుగా పోరాడి పంచమిని విచ్ఛిన్నం చేయడం కష్టమని చెప్తుంది. దీంతో గరుడ రాజు(ఫణేంద్ర) పంచమిని ఓడించడానికి మరేదైనా మార్గం చెప్పమని అంటాడు.

కరాళి: పంచమికి, ఆ బిడ్డకు దైవ శక్తి మెండుగా ఉంది. ఆలోచించి ఏ విధంగా దెబ్బతీయాలో చూస్తాను. ఇక కరాళి తన మంత్ర శక్తితో గరుడ రాజు గాయాలు తగ్గేలా చేస్తుంది. గరుడ శక్తి శాశ్వతంగా నా దగ్గరే ఉండాలి అంటే ఆ శక్తిని నేను మానవ రూపంలోకి మార్చుకోవాలి. 

మరోవైపు జ్వాల, చిత్రలు తమ భర్తలతో కలిసి ఆరుబయట మాట్లాడుకుంటారు. ఆస్తి మొత్తం మోక్ష, పంచమిలకే దక్కుతుందని అంటుంది చిత్ర. ఇక జ్వాలాకి వాళ్లకి పిల్లలు లేకపోవడం వల్ల వాటా తగ్గిపోతుందని భార్గవ్ అంటాడు. దీంతో చిత్ర భర్త నోరు మూయిస్తుంది. తాను మరోసారి పిల్లలకు ట్రై చేసి పిల్లల్ని కని ఎక్కువ ఆస్తి కొట్టేద్దామని అంటుంది. ట్విన్స్ అయితే ఎక్కువ ఆస్తి వస్తుందని అంటుంది. ఆ పనిలో ఉందామని చిత్ర అని భర్తని తీసుకెళ్తుంది. చిత్ర స్పీడ్‌కి జ్వాల షాకైపోతుంది. ఇక వరుణ్ కూడా మనం ఆలస్యం చేయొద్దని అంటాడు. జ్వాల భర్తనుంచి తప్పించుకొని వెళ్లిపోతుంది. 

సైంటిస్ట్: పరీశీలన చేశాం.. మోక్ష గర్భంలో ఉన్న పిండంలో విషం ఉందని తేలింది. కచ్చితంగా పుట్టబోయే బిడ్డ రక్తంలోనూ విషం ఉంటుంది. దీనికి మనం విరుగుడుగా వ్యాక్సిన్ కనిపెట్టడం ఒక్కటే మార్గం. 

మోక్ష: అంత కన్నా పెద్ద ప్రాబ్లమ్ ఒకట వచ్చింది సార్ మీకు మెయిల్ పంపాను చూడండి. పిండం అసాధరణంగా ఉంది. ఉంచుకోవడం మంచిది కాదని చెప్తుంది. 

సైంటిస్ట్: స్కానింగ్ ప్రకారం ఎవరైనా అలాగే చెప్తారు. కానీ మీ మిసెస్ బ్యాగ్రౌండ్ స్టోరీ ఎవరికీ తెలీదు కదా..

మోక్ష: నేను నా భార్య ఉంచుకోవాలి అనుకుంటున్నాం. కానీ అందరూ భయపడుతున్నారు. 

సైంటిస్ట్: మనం మొదటి నుంచి ఫాలో అవుతున్నాం మోక్ష. ఒక మనిషి పాముగా పాము మనిషిగా మారడం ఓ మిరాకిల్. ఇప్పుడు పుట్టబోయే బిడ్డ మరో అద్భుతం.  

మోక్ష: నా భార్య గురించి బయట వారికి తెలిస్తే ఈ పాటికి గుడి కట్టేస్తారు. లేదంటే తరిమేవాళ్లు ఇప్పటి వరకు మనం ఆ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచాం. ఇకపై  మాకు పుట్టబోయే బిడ్డ విషయంలోనూ అలాగే ఉండాలి సార్. అదే నాకు కావాలి. 

సైంటిస్ట్: పిండమే అసాధారణంగా ఉందంటే.. పుట్టబోయే బిడ్డ కూడా వింతగా పుట్టొచ్చు. పిండం పెరగడానికి టైం ఉంది. అప్పుడు ఆలోచిద్దాంలే. 

పంచమి: తనలో తాను.. నా తల్లి నన్ను మోసం చేయదు.  కచ్చితంగా అందంగా పుడుతుంది. ఒకవేళ పాముగా పుట్టాలి అనుకుంటే నాగలోకంలో పుట్టేది. అమ్మా నేను నీ మీద చాలా ఆశలు పెంచుకుంటున్నాను. అందరూ అనుకునేలా నన్ను మోసం చేయొద్దు. నేను ఊహించుకునేలా చాలా అందంగా పుట్టాలి. ఎవరు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా ఆటంకాలు సృష్టించినా నేను నిన్ను కాపాడుకుంటాను అమ్మ.

మరోవైపు జ్వాల ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో చిత్ర వచ్చి తనకు పిల్లలు కావాలి అని ఆశలు పెంచుకుంటున్నా తన భర్త నిరాశ పరుస్తున్నాడని అంటుంది. ఇక జ్వాలా అయితే పంచమి గర్భం పోగొట్టాలి అనుకుంటుంది. ఇంతలో భార్గవ్, వరుణ్ ఇద్దరూ ఫుల్లుగా తాగి వస్తారు. ఇక చిత్ర చుక్కలు చూపిస్తాను అని భర్తను తీసుకెళ్లిపోతుంది. 

మరోవైపు కరాళి వరుణ్, జ్వాలలను తన దివ్య దృష్టితో చూస్తుంది. వరుణ్ తాగిన మైకంలో జ్వాల దగ్గరకు వెళ్లడం చూస్తుంది. తన భర్తను దూరం పెడుతున్న జ్వాల మీదకు ఏదో శక్తిని పంపిస్తుంది. దీంతో జ్వాల తన దగ్గరకు వచ్చిన భర్తను సీరియస్‌గా చూస్తుంది. వరుణ్ షాక్ అయిపోతాడు. తర్వాత జ్వాల భర్తను దగ్గరకు తీసుకుంటుంది. కరాళి ప్లాన్‌తో వరుణ్, జ్వాలలు ఒకటై పోతారు. 

ఇక కరాళి ఫణేంద్రని పిలుస్తుంది. పంచమిని ఎదురుగా వెళ్లి ఢీ కొట్టలేకపోతున్నాం అని పంచమి కడుపులో బిడ్డను నాశనం చేయాలి అంటే నువ్వు కూడా ఆ ఇంట్లో ఉండాలి అని అంటుంది. దీంతో ఏం చేయాలి చెప్పమంటావ్ అని ఫణేంద్ర అడిగుతాడు. దీంతో కరాళి జ్వాల కడుపులో బిడ్డగా పెరుగుతూ గరుడ శక్తిగా పుట్టమని చెప్తుంది. దీంతో ఫణేంద్ర సరే అని వెళ్లి జ్వాల కడుపులోకి సూక్ష శక్తిగా ప్రవేశిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'శబరి' నుంచి మరో సాంగ్ విడుదల- సరికొత్తగా ఆకట్టుకుంటున్న వరలక్ష్మీ శరత్ కుమార్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu Viral :
"18 నెలల్లో 20–23 లక్షల కోట్ల జాబ్స్‌" ఏపీ సీఎం చంద్రబాబు ఇంటర్వ్యూ వైరల్ చేస్తున్న వైసీపీ
KTR and Midhun Reddy:ఇక్కడ కేటీఆర్‌, అక్కడ మిథున్ రెడ్డి- తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కాక 
ఇక్కడ కేటీఆర్‌, అక్కడ మిథున్ రెడ్డి- తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కాక 
Andhra Pradesh Social Media: చిన్నారులపై సోషల్‌ మీడియా ఆంక్షలు- పరిశీలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
చిన్నారులపై సోషల్‌ మీడియా ఆంక్షలు- పరిశీలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Palash Muchhal Fraud Case: నన్నూ మోసం చేశాడు... కొత్త కేసులో స్మృతి మాజీ ప్రియుడు పలాష్ ముచ్చల్
నన్నూ మోసం చేశాడు... కొత్త కేసులో స్మృతి మాజీ ప్రియుడు పలాష్ ముచ్చల్

వీడియోలు

Trump on Greenland | గ్రీన్‌ లాండ్ కోసం ట్రంప్ ఎందుకు పట్టుబుతున్నాడు | ABP Desam
Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu Viral :
"18 నెలల్లో 20–23 లక్షల కోట్ల జాబ్స్‌" ఏపీ సీఎం చంద్రబాబు ఇంటర్వ్యూ వైరల్ చేస్తున్న వైసీపీ
KTR and Midhun Reddy:ఇక్కడ కేటీఆర్‌, అక్కడ మిథున్ రెడ్డి- తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కాక 
ఇక్కడ కేటీఆర్‌, అక్కడ మిథున్ రెడ్డి- తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కాక 
Andhra Pradesh Social Media: చిన్నారులపై సోషల్‌ మీడియా ఆంక్షలు- పరిశీలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
చిన్నారులపై సోషల్‌ మీడియా ఆంక్షలు- పరిశీలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Palash Muchhal Fraud Case: నన్నూ మోసం చేశాడు... కొత్త కేసులో స్మృతి మాజీ ప్రియుడు పలాష్ ముచ్చల్
నన్నూ మోసం చేశాడు... కొత్త కేసులో స్మృతి మాజీ ప్రియుడు పలాష్ ముచ్చల్
Purandeshwari: క్రెడిట్ కార్డ్ వడ్డీలపై పురందేశ్వరి పోరు- సామాన్యుడికి ఊరట కలిగేనా?
క్రెడిట్ కార్డ్ వడ్డీలపై పురందేశ్వరి పోరు- సామాన్యుడికి ఊరట కలిగేనా?
Vijay Deverakonda: రౌడీ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా VD14... హైప్ ఇచ్చిన దర్శకుడు
రౌడీ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా VD14... హైప్ ఇచ్చిన దర్శకుడు
Medaram Jatara 2026: మేడారం జాతరలో తొలిసారి AI వినియోగం.. తప్పిపోయిన పిల్లలు ఇక సేఫ్, నేరస్దుల వెన్నులో వణుకు
మేడారం జాతరలో తొలిసారి AI వినియోగం.. తప్పిపోయిన పిల్లలు ఇక సేఫ్, నేరస్దుల వెన్నులో వణుకు
Cheekatilo Review Telugu - 'చీకటిలో' రివ్యూ: Prime Videoలో క్రైమ్ థ్రిల్లర్ - శోభితా ధూళిపాళ నటించిన మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?
'చీకటిలో' రివ్యూ: Prime Videoలో క్రైమ్ థ్రిల్లర్ - శోభితా ధూళిపాళ నటించిన మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?
Embed widget