Vijay Deverakonda: రౌడీ ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా VD14... హైప్ ఇచ్చిన దర్శకుడు
VD 14 Movie Update: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అభిమానులకు వీడీ14 దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ట్వీట్ సంతోషం ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన హైప్ ఇచ్చారు.

అభిమానులు 'రౌడీ బాయ్', 'యూత్ ఐకాన్' అని ముద్దుగా పిలుచుకునే క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). తన ఫ్యాన్స్, ప్రేక్షకులకు డిఫరెంట్ కంటెంట్ ఇవ్వడం కోసం పాన్ ఇండియా ఫిలిమ్స్ ప్లాన్ చేశారు విజయ్. తనకు గతంలో 'టాక్సీవాలా' వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు రాహుల్ సంకృత్యన్ (Rahul Sankrityan)తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా గురించి డైరెక్టర్ చేసిన ట్వీట్ రౌడీ బాయ్ ఫ్యాన్స్ అందరికీ సంతోషం ఇస్తుందని చెప్పడంలో అసలు ఎటువంటి సందేహం అవసరం లేదు.
అభిమానుల ఆకలి తీర్చేలా VD14 Movie
'టాక్సీవాలా' చేసినప్పుడు విజయ్ దేవరకొండ క్రేజ్ వేరు. ఇప్పుడు ఆయనకు ఉన్న స్టార్ డమ్ వేరు. అది దర్శకుడికి తెలుసు. ఆయన కూడా 'శ్యామ్ సింగ రాయ్' వంటి హిట్ సినిమా చేశారు. దాంతో ఇప్పుడు విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ కాంబో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఈ తరుణంలో తమ హీరో విజయ్ దేవరకొండకు మంచి హిట్ ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా దర్శకుడికి విజ్ఞప్తులు చేస్తున్నారు అభిమానులు.

Dear Director @Rahul_Sankrityn
— Bobby (@yashcuts_) January 21, 2026
A few words to you, on behalf of all @TheDeverakonda fans, I hope you read our emotions in it. pic.twitter.com/bKzI77hTXv
ఇటీవల విజయ్ దేవరకొండ ఫ్యాన్ యశ్వంత్ తమ హీరోకు మెమొరబుల్ మూవీ ఇవ్వాలంటూ హార్ట్ టచింగ్ రిక్వెస్ట్ ఒకటి పంపారు. దానికి స్పందించిన రాహుల్ సాంకృత్యన్... ''మీ అభిమానులందరి ఆకలి తీర్చేలా VD14 ఉంటుంది' అని ప్రామిస్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్నారు.





















