The Raja Saab BO Day 14: 'రాజా సాబ్' నిర్మాతలకు 64 శాతానికి పైగా లాస్... 14వ రోజు ఇండియాలో నెట్ కలెక్షన్ ఎంతంటే?
The Raja Saab Box Office Collection Day 14: రెబల్ స్టార్ ప్రభాస్ 'రాజా సాబ్' నిర్మాతలకు 64 శాతానికి పైగా లాస్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇండియాలో ఈ ఇసినిమా 14వ రోజు నెట్ కలెక్షన్ చూస్తే?

సంక్రాంతి సెలవులు ఉన్నప్పటికీ... 'ది రాజా సాబ్' పెద్ద ఫ్లాప్ అని బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రూవ్ అవుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్‌డమ్ వల్ల ఈ సినిమాకు మొదటి రోజున మంచి ఓపెనింగ్ వచ్చింది. కానీ, ఆ జోరు తర్వాత కొనసాగించలేకపోయింది. దాంతో సినిమా కిందకు పడింది. ఈ సినిమా పరిస్థితి ఇప్పుడు ఏమిటంటే... థియేటర్లలో విడుదలైన 12వ రోజు నుంచి లక్షల రూపాయలు కలెక్ట్ చేయడం కూడా కష్టం అవుతోంది. 'ది రాజా సాబ్' విడుదలైన 14వ రోజున... అంటే రెండవ గురువారం ఎంత సంపాదించిందో తెలుసుకోండి.
'ది రాజా సాబ్' 14వ రోజున ఎంత వసూలు చేసిందంటే?
నిర్మాతల ఆశలు అన్నింటినీ ప్రభాస్ 'ది రాజా సాబ్' వమ్ము చేసింది. విడుదలకు ముందు సినిమాపై ఉన్న బజ్ చూస్తే... బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతుందని అనిపించింది. కానీ, థియేటర్లలో విడుదలైన తర్వాత అసలు రంగు బయట పడింది. తొలుత విమర్శకుల నుండి నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. తర్వాత ప్రేక్షకుల నుంచి కూడా! వాళ్ళకూ సినిమా నచ్చలేదు.
మారుతి దర్శకత్వంపై చాలా విమర్శలు వచ్చాయి. సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి కోల్పోయారు. థియేటర్లలో ఖాళీ సీట్లు కనిస్తున్నాయి. ఈ సినిమా విడుదలైన రెండు వారాల తర్వాత కూడా బడ్జెట్‌లో 50 శాతం కూడా రాబట్టలేకపోయింది. నిర్మాతలకు 64 శాతం లాస్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ టాక్. దాంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది.
- సినిమా వసూళ్లపై ఒక లుక్ వేస్తే... 'ది రాజా సాబ్' మొదటి వారంలో రూ. 130.25 కోట్లు సంపాదించింది. ఆ తర్వాత 8వ రోజున రూ. 3.5 కోట్లు, 9వ రోజున రూ. 3 కోట్లు, 10వ రోజున రూ. 2.6 కోట్లు, 11వ రూ. రోజున 1.35 కోట్లు, 12వ రోజున రూ. 80 లక్షలు, 13వ రోజున రూ. 50 లక్షలు వసూలు చేసింది.
- సకనిల్క్ నివేదిక ప్రకారం... 'ది రాజా సాబ్' విడుదలైన 14వ రోజున రూ. 51 లక్షల రూపాయలు వసూలు చేసింది.
- దీంతో 'ది రాజా సాబ్' 14 రోజుల టోటల్ ఇండియా నెట్ కలెక్షన్ ఇప్పుడు రూ. 142.71 కోట్లకు చేరుకుంది.
'ది రాజా సాబ్'తో నిర్మాతలు ఎంత నష్టపోయారంటే?
హారర్ కామెడీ 'ది రాజా సాబ్' 400 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. అయితే 14 రోజుల్లో ఇది కేవలం 142.71 కోట్ల రూపాయలు మాత్రమే నెట్ వసూలు చేసింది. దాంతో 64.48% నష్టం వచ్చినట్టు అంచనా. ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అని చెప్పాలి. టాలీవుడ్‌కు ఇటీవల కాలంలో ఇది ఒక షాక్. ప్రభాస్‌కు బాహుబలి తర్వాత రాధే శ్యామ్ ఈ స్థాయిలో డిజాస్టర్ కాగా... ఆ తర్వాత ఇది మరొక షాక్.





















