Naga Panchami Serial Today April 11th: 'నాగ పంచమి' సీరియల్: నన్ను కాపాడాల్సిన అవసరం నీకు లేదని నాగేశ్వరిపై ఫైరైన పంచమి.. అక్కాచెల్లెళ్లను చుట్టేసిన పాములు!
Naga Panchami Serial Today Episode మోక్ష మీదకు ప్రయోగించాలి అని అక్కాచెల్లెళ్లు తీసుకొచ్చిన పాములు వాళ్లనే చుట్టేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Today Episode జ్వాల, చిత్రలు పాములను తీసుకొని పంచమి గది దగ్గర తీసుకొచ్చి పెడతారు. వాటిని పంచమి గది వైపు వెళ్లమని చెప్తాయి. ఆ పాములు జ్వాల వాళ్ల వైపే చూస్తాయి. ఇక ఐడియా అని జ్వాల వాటి తల మీద కొడుతుంది. దీంతో ఆ పాములు చిత్ర, జ్వాలల వెంట పడతాయి. ఇద్దరూ పరుగెత్తుకుంటూ బయట తమ భర్తలు మందు తాగుతుంటే అక్కడికి వస్తారు.
పాములు చిత్ర, జ్వాలల నడుము చుట్టేస్తాయి. అది చూసి భార్గవ్, వరుణ్‌తో పాటు చిత్ర, జ్వాలలు అరిచి గోల పెడతారు. పాముల వాడు ఇచ్చిన బూర ఊదమని చెప్తారు. ఇద్దరూ అన్నదమ్ములు మా వల్ల కాదు అని అంటారు. భార్యలు బెదిరించడంతో భార్గవ్ బూర ఊదుతాడు. దీంతో ఆ వాళ్లని చుట్టుకున్న పాములు పక్కకు వెళ్లకపోగా బయట నుంచి మరో రెండు పాములు అక్కడికి వస్తాయి. వాటిని చూసి నలుగురు గగ్గోలు పెడతారు. ఇక చిత్ర, జ్వాలలు పాములు విసిరేసి పరుగులు పెడతారు.
శబరి: త్వరగా రెడీ అవ్వండి మోక్ష మనం గురువుగారి దగ్గరకు వెళ్లాలి.
మోక్ష: శబరి నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు అని తెలుసుకదా.
శబరి: అలా అనకు మనవడా.. నీకు పుట్టుబోయే బిడ్డ మీద ఈ ఇంట్లో చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. అవి నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది.
మోక్ష: నాకు పంచమికి ఎలాంటి అపోహలు లేవు శబరి. మేం ఎవరికీ మా బిడ్డ జాతకం నిరూపించుకోవాల్సిన లేదు.
శబరి: మీ అమ్మ ఆందోళనలోనూ అర్థం ఉంది మనవడా. కొడుకుకు ప్రమాదం సంభవిస్తుంది అని తెలిస్తే ఏ తల్లికి నిద్ర పట్టదు.
మోక్ష: అలా ఏం జరగదు శబరి.
శబరి: అందరు కోరుకునేది కూడా అదే మోక్ష. మన గురువుగారు కూడా అదే చెప్తారు. ఒక్క దెబ్బతో అందరి నోళ్లు మూతపడతాయి. సరే మీరు వెళ్లి తొందరగా రెడీ అయి రండి.
పంచమి పడుకొని ఉంటే మోక్ష పంచమి కడుపు మీద చేయి వేసి కడుపులో బిడ్డకు ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు. ఇంతలో పంచమి లేచి ఇద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. నేను చెప్పను అని మోక్ష అంటాడు. ఇద్దరూ నవ్వుకుంటారు. ఇక మోక్ష పంచమిని రెడీ అవ్వమని అంటాడు. పంచమి కంగారు పడితే ఏం కాదు అని ధైర్యం ఇస్తాడు.
ఇక చిత్ర ఇళ్లు తుడుస్తుంది. ఇంతలో నాగేశ్వరి పాము కనిపిస్తుంది. దీంతో చిత్ర కేకలు వేస్తుంది. జ్వాలను గట్టిగా పట్టుకొని అరుస్తుంది. తన అత్తయ్యని పిలుస్తారు. పాము వెళ్లిపోతుండగా వైదేహి వచ్చి చూస్తుంది.
జ్వాల: అత్తయ్య చూశారా ఈ ఇంట్లో పాములు ఎలా తిరుగుతున్నాయో ఒకవేళ ఇంట్లో ఎవరినైనా కాటేస్తే ఏంటి పరిస్థితి. ఒకవేళ మోక్షనే కాటేస్తే..
వైదేహి: అర్థమైంది. రోజూ మీరు పాములు అంటే ఏంటో అనుకునేదాన్ని ఈరోజు స్వయంగా నా కళ్లతో చూశాను.
చిత్ర: పంచమి నిజంగానే పాము. దాని కోసమే ఈ పాములన్నీ ఇక్కడిక్కడే తిరుగుతున్నాయి.
వైదేహి: పంచమి బయట ఒంటరిగా ఉంటే.. పంచమి నీ విషయంలో నేను ఎలా ప్రవర్తించాలో నాకు అర్థమవడం లేదు.
పంచమి: ఏం జరిగింది అత్తయ్య.
వైదేహి: ఇంకా ఏం జరగాలి ఇంట్లో పాము తిరగడం నా కళ్లారా చూశాను. ఈ ఇంట్లో పాము జాడ కనిపిస్తే నిన్ను పంపేస్తా అన్నాను కదా.. ఇలా ఇంట్లో పాములు తిరుగుతుంటే ఎవరూ ధైర్యంగా ఉండలేరు. చిత్ర వాళ్లని కూడా నేను తప్పు పట్టలేను. నీ వల్లే ఇదంతా అని వాళ్లు నమ్ముతున్నారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఇక ఎప్పటికీ ఈ ఇంట్లో పాములు కనిపించకూడదు. అలా కనిపిస్తే నువ్వు మీ పుట్టింటికి వెళ్లిపోవచ్చు. ఇదే నా చివరి హెచ్చరిక.
పంచమి: నాగేశ్వరి.. నాగేశ్వరి.. నాగేశ్వరి.. నీ వల్ల ఇంట్లో గొడవలు వస్తున్నాయి నాగేశ్వరి. నువ్వు మా ఇంటి నుంచి వెళ్లిపో. నాకేం జరిగినా పర్వాలేదు నాగేశ్వరి కానీ ఇంట్లో అన్నదమ్ములు విడిపోకూడదు. అందుకే నువ్వు వెళ్లిపో నాగేశ్వరి.
నాగేశ్వరి: నిన్ను కాపాడుకోవడానికి నేను ఇక్కడ ఉండక తప్పదు. పంచమి నీ కడుపులో బిడ్డను కాపాడుకోవడం నాకు చాలా అవసరం.
పంచమి: నా కంటే నీకు అవసరం లేదు కదా నాగేశ్వరి. నేను ఇప్పుడు మీ యువరాణిని కాదు నాగేశ్వరి. ఓ సాధారణ గృహిణిని నన్ను కాపాడుకోవాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు వెళ్లిపో. నువ్వు ఇక్కడ ఉండటం వల్ల నాకు అంతకు మించి ప్రమాదం ఉంది నాగేశ్వరి నీకు దండం పెడతా వెళ్లిపో అని అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'బ్రహ్మముడి' సీరియల్ లో కష్టాల్లో ఉన్నట్టు నటిస్తోంది కానీ బయట మహా అల్లరి పిల్ల ఈ కావ్య!