అన్వేషించండి

Naga Panchami Serial November 9th: 'నాగ పంచమి' సీరియల్: మోక్షను కాటేయక తప్పదన్న పంచమి - జ్వాల, చైత్రల 'పాము' ప్లాన్!

Naga Panchami November 9th Episode: మోక్ష, పంచమిలను చంపడానికి చైత్ర, జ్వాల ప్లాన్ వేయడంతో ఈరోజు ఏపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Serial Today November 9th Episode: మోక్ష హాల్‌లో కూర్చొని తన పెళ్లి పంచమి పాములా మారడం అన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో శిశిర అక్కడకి వచ్చి మోక్షకు మ్యాథ్స్‌లో డౌట్‌ చెప్పమంటే మోక్ష శిశిర పాపపై కోప్పడి పాపను తోసేస్తాడు. దీంతో శిశిర తల్లి అక్కడికి వచ్చి మోక్షతో గొడవ పడుతుంది. ఇంట్లో సభ్యులంతా అక్కడివస్తే మోక్ష గొడవ పెట్టుకుంటాడు. ఏదైనా ప్రాబ్లమా అని మోక్ష వాళ్ల నాన్న అడిగుతాడు. 

మోక్ష: అవును ప్రాబ్లమే.. నా ప్రాబ్లమ్‌ను ఎవరూ తీర్చలేరు అంటూ అరుస్తాడు. ఏమైంది నాన్న అని శబరి అడిగితే.. ఇంతవరకు ఏం జరగలేదు శబరి ఇకపైన ఏమైనా జరగొచ్చు.. నేను ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. 
వైదేహి: నాన్న నువ్విలా మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది.
మోక్ష: అందుకే చెప్తున్నా అమ్మా లైఫ్ మనం ఊహించినట్టు ఉండదు. జీవితం తల్లకిందులైపోడానికి ఒక్క క్షణం చాలు. అంటూ ఆవేశపడతాడు.  
జ్వాలా: కాటికి కాలు చాపుకున్న వాడిలా ఉంటానో పోతానో.. చనిపోతానేమో అంటూ మాట్లాడుతున్నావ్ అంటే ఆ పాము వచ్చి నిన్ను కాటేస్తుంది అని బయపడుతున్నావ్ కదా మోక్ష నిజం చెప్పు. 
మోక్ష: నా మాటలు మీ అందరికీ అలా అనిపిస్తే నన్ను క్షమించండి. కానీ నా మాటల్లో ఒక్కటి నిజం ఉంది. ఈ భూమి మీద ఎవ్వరూ శాశ్వతం కాదు ముందో వెనకో ఆ వరసలో నేనూ ఉంటాను. (తర్వాత శిశిర పాపకు మోక్ష క్షమాపణ చెప్పి వెళ్లిపోతాడు)

వైదేహి: నా కొడుకు ఇలా అయిపోతున్నాడేంటి అండీ.. వాడి నోటి నుంచి చావు మాటలు వస్తుంటే నా గుండె కత్తితో పొడిచినట్లు అవుతుంది. 
రఘు: అంతా నువ్వే చేశావ్ వైదేహి.. అంతా నువ్వే చేశావ్.. ఏ రోజైనా కొడుకును అర్ధం చేసుకున్నావా 
వైదేహి: మీరే అలా అంటే ఎలా అండి.. నా కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఎన్నో ఊహించుకున్నాను. 
రఘు: అలా ఊహించుకునేది కాదు తల్లి అంటే.. అర్థం చేసుకునేదే తల్లి అంటే. నీ మూర్ఖత్వాన్ని వాడి మీద రుద్దాలని చూశావ్. పెళ్లి కాక ముందు నీ ప్రేమ ఎలాంటిదైనా ఓకే. పెళ్లి తర్వాత వాడికి ఒక లైఫ్ ఉంటుంది. ఒక భార్య ఉంటుంది. అవును.. మోక్షకు పెళ్లి చేసి తీసుకువచ్చావు. కానీ ఎప్పుడైనా పంచమిని కోడలిగా చూశావా. ఈ ఇంటి పని అమ్మాయిగానే చూశావు. తనని కోడలిగా కాదు నా కొడుకుకు పని అమ్మాయిగా తెచ్చానని అందరికీ చెప్పావు. తల్లివని నిన్ను మోక్ష ఏం అనకపోవచ్చు కానీ నువ్వు పంచమిని అన్న మాటలకు  మోక్ష మనసు ఎంత గాయం అయింటుందో తెలుసా. 
వైదేహి: నేనేం చేసినా వాడి మంచి కోసమే చేస్తా కదండి
రఘు: ఇంకా నువ్ నీ తప్పును తెలుసుకోలేకపోతున్నావు వైదేహి. పంచమిని దూషిస్తే మోక్ష సంతోషంగా ఉంటాడని అనుకుంటున్నావా. నీలోని గర్వం ఎక్కడికి పోలేదు. పోదు కూడా వైదేహి. వాళ్లిద్దరూ సంతోషంగా ఉండేలా చూడు.  ఆ అమ్మాయిని నువ్వు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే నువ్వు ఏం చెప్పకుండానే ఆటోమెటిక్‌గా నీ కొడుకు నీ దగ్గరకు వస్తాడు. అర్ధం చేసుకో. మనందరికీ ఒక్కటే భయం మోక్షకు ఉన్న నాగ గండం. దాన్ని పంచమి మాత్రమే పరిష్కరించగలదు. అని చెప్పి వెళ్లిపోతాడు. 

మరోవైపు పంచమి దేవుడి దగ్గరు కూర్చొని బాధ పడుతుంది. నంబూద్రిని చంపిన తాను పాములా మారితే మోక్ష బాబుని కాటేయక తప్పదని.. అందుకు తాను పాములా మారకూడదని అనుకొని ఏడుస్తుంటుంది. ఇంతలో అక్కడికి సుబ్బు వస్తాడు. 

సుబ్బు: పంచమి నువ్వు ఇంట్లో కనిపించకపోయే సరికి ఇక్కడికే వచ్చుంటావ్ అని అనుకున్నాను. 
పంచమి: మన మధ్య ఉన్న బంధం ఏంటో తెలియదు సుబ్బు. నిన్ను చూసినా నీ మాటలు విన్నా ఆ స్వామే నా దగ్గరకు వచ్చారని అనిపిస్తుంది.  
సుబ్బు: జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. నీకు నది అడ్డు వస్తే ఏం చేస్తావ్.. పడవలు లేవు. నీకు ఈత రాదు. కానీ కచ్చితంగా అవతలి ఒడ్డుకు వెళ్లాల్సిందే. అప్పుడు ఏం చేస్తావు. 
పంచమి: భగవంతుడి మీద భారం వేయడమే సుబ్బు. ఇంక ఏం చేయలేం కదా. 
సుబ్బు: భగవంతుడ్రి వేడుకుంటే భుజాలమీద తీసుకువెళ్లడు పంచమి. ఆ మార్గాన్ని తెలుసుకొని ముందుకు వెళ్లాలే కానీ. ఆ స్వామి వచ్చి దాటిస్తాడని ఆశ పడటం. అది జరగక దేవుడిని నిందించడం నిజమైన భక్తి అనిపించుకోదు. 

పంచమి: నా కష్టాలు నా ఖర్మ అని నాకు నేను కుమిలిపోవాలి కానీ ఆ స్వామిని నిందించను సుబ్బు. ఎవరూ నా కష్టాలను తీర్చలేరు.  
సుబ్బు: నీ భర్తకు బాలేదు అన్నప్పుడు కొండలు గుట్టలు దాటి స్వామిని దర్శించుకున్నావు. ఇప్పుడు కష్టాన్ని తలచుకొని భయపడి ఇలా కూర్చొంటే నీ కష్టం తీరిపోతుందా. ప్రయత్నించకుండా ఇలా ఉంటే ఎలా ప్రయత్నిస్తే కదా కష్టం దూరమయ్యేది.  

జ్వాలా: నేను చెప్పా కదా చిత్ర. మోక్షకు చావు భయం పట్టుకుంది. 
చైత్ర: అయితే ఈ సారి డెట్ గ్యారెంటీ అంటావా..ఈ సారి ఫిక్స్ అయిపోవచ్చా.. ఆస్తి మనదేనా.. 
జ్వాలా: మోక్ష తన నోటితోనే చెప్పాడు కదా పోయిన పౌర్ణమికి పాము కాటేయబోయాడని.. అలా ఎన్ని సార్లు అని తప్పించుకోగలడు. పౌర్ణమికి, ఆ పాముకి, పంచమికి ఏదో సంబంధం ఉంది
చైత్ర: నాకు తెలిసి పంచమే ఆ పాము మోక్షకు కాటేయకుండా కపాడుతుంది అక్క. అప్పుడు మన ఆస్తికూడా మోక్షనే అనుభవిస్తాడు కదా అక్క
జ్వాలా: అప్పటి వరకు నేను ఊరుకుంటానా. మోక్షకు ఎలాగూ నాగగండం ఉంది కదా. పైగా ఇప్పుడు ఉంటానో పోతానో అన్నట్లు మాట్లాడుతున్నాడు కదా. కాబట్టి మనం ఓ భయంకరమైన నాగుపామును కొని తెచ్చి మోక్ష గదిలో వదిలేద్దాం. అని మోక్ష, పంచమిల ప్రాణాలు తీయడానికి ప్లాన్ చేస్తారు. అందుకు పాములు పట్టేవాడిని వెతుకుదామని బయలు దేరుతారు.  అయితే వారిద్దరూ కూర్చొన్న కుర్చీల నుంచి లేవలేకపోతారు. దీంతో షాక్ అవుతూనే ఒకర్ని చూసి మరొకరు వెటకారంగా నవ్వు కుంటారు దీంతో నేటి ఏపిసోడ్ పూర్తవుతుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 21th:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
గుండెనిండా గుడిగంటలు:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
Brahmamudi Serial Today August 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
Karthika Deepam 2 Serial Today August 21st: కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Embed widget