అన్వేషించండి

Naga Panchami November 11th Episode : పంచమిని పెళ్లి చేసుకునేందుకు భూలోకానికి వస్తోన్న యువరాజు!

Naga Panchami Serial Today Episode : పంచమిని నాగ లోకానికి తీసుకొచ్చేందుకు యువరాజు ఫణేంద్ర భూలోకానికి బయలు దేరడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today November 11th Episode : నాగపంచమి సీరియల్​ ఈ రోజు ఎపిసోడ్​లో.. మహాకాళి ఎంత హెచ్చరించినా వినకుండా కరాళి వినకుండా మొండిగా తనకున్న శక్తులతో నాగమణిని దక్కించుకుంటానని శపథం చేస్తుంది. తర్వాత నాగ దేవత ప్రత్యక్షమై సమావేశం ఏర్పాటు చేస్తుంది. నాగలోకంలో ఎప్పటినుంచో ఖాళీగా ఉన్న రాణి స్థానం కోసం మాట్లాడుకుంటారు. పంచమి కోసం ఇంకా ఎదురు చూడటం కంటే ఎవరో ఒకరికి ఆ స్థానాన్ని ఇవ్వాలని కోరుతారు. ఇంతలో యువరాజు ఫణేంద్ర అక్కడికి వస్తాడు. తాను ఆ స్థానానికి అన్ని విధాలుగా అర్హుడినని నాగ లోక అధికారం తనకి ఇవ్వలని నాగదేవతకి కోరుతాడు. 

నాగదేవత: నాగలోకాన్ని పరిపాలించే సంప్రదాయం నాగరాణులకే కానీ నాగరాజులకు లేదు. ఈ విషయం మీ అందరికీ బాగా తెలుసు.

యువరాజు: ఆవిషయం నాకు తెలుసు మాతా. కానీ ప్రస్తుతం నాగలోకంలో యువరాణులు ఎవరూ లేరు కదా మాతా 

నాగదేవత: ఉంది యువరాజా.. ప్రస్తుతం భూలోకంలో ఉంది. తను నాగలోక యువరాణి అందరికీ తెలుసు. జన్మరీత్య తను మానవ రూపంలో జన్మించింది. యవ్వనంలోకి రాగానే నాగ జాతి లక్షణాలు సంతరించాయి. తనను తీసుకొచ్చి రాణి స్థానంలో కూర్చొపెట్టి అధికారాలు ఇవ్వడానికి ప్రయత్నాలు  జరుగుతూనే ఉన్నాయి.  

యువరాజు: నాగ కన్యను నేను వివాహం చేసుకొని ఆమెను యువరాణిని చేయొచ్చు కదా మాతా.

నాగదేవత: రాణి వంశస్తుల రక్తమే వేరు యువరాజా.. పుట్టుకతోనే వారికి సహజసిద్ధంగా వారికి కొన్ని శక్తులు ఉంటాయి. వారు తప్పా.. వేరే వారు ఎవ్వరూ నాగమణిని తాకడం కూడా చాలా కష్టం. 

యువరాజు: నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మాతా. భూలోకంలో ఉన్న యువరాణిని తీసుకొచ్చి ఈ పీఠం మీద కూర్చొపెడతా. ఆమెను పెళ్లి చేసుకొని ఇలాంటి విపత్తులు భవిష్యత్తులో రాకుండా చేస్తా. 

నాగదేవత: యువరాణి ఎవరితోనూ శారీరక సంబంధంలో ఉండకుండా ఎంతో పవిత్రంగా ఉన్నప్పుడే ఈ లోకంలోకి తీసుకురావాలి. అని నాగదేవత చెప్పగానే సరే అనే యువరాజు భూలోకానికి వెళ్తాడు. 

మరోవైపు మోక్ష ఓ ప్రొఫెసర్ దగ్గరకు వెళ్లి తన భార్య పంచమి మనిషి కాదని తాము వెతుకుతున్న ఇష్టరూప పాము అని చెప్తాడు. అయితే ప్రొఫెసర్ నమ్మడు. కానీ అది నిజం అనే పాము పంచమిగా మారాడం తాను కళ్లారా చూశానని మోక్ష చెప్తాడు. దీంతో ప్రొఫెసర్ షాక్ అవుతాడు. 

ప్రొఫెసర్: అది ఎలా సాధ్యం మోక్ష ఓ పాము నీతో కలిసి బతకడం?

మోక్ష: అదో వండర్ సార్.. ఒక నమ్మలేని నిజం. మానవ రూపంలో పుట్టిన పాము పంచమి. కొంత కాలం వరకూ తనకి ఆ విషయం తెలీదు సార్. ప్రతి పౌర్ణమికి పంచమి పాముగా మారి నన్ను కాటేయాలని ప్రయత్నిస్తుంది. ఒక వైపు పాములా నన్ను చంపాలి అనుకుంటోంది నా భార్య. మరోవైపు ఓ భార్యలా నన్ను కాపాడాలి అనుకుంటుందో నా భార్యే. కానీ పాము నుంచి మనిషిగా మారిన తర్వాత తనకి ఏమీ గుర్తుండదు. ఆ విషానికి విరుగుడు కనిపెడితే చాలు సార్ ప్రాబ్లమ్ లేనట్లే.

ప్రొఫెసర్:  అవును మోక్ష. ఆ పాము పగ తీరుతుంది నువ్వు ప్రాణాలతో ఉండొచ్చు. కానీ ఆ ఇష్టనాగుల విషం ఎలా ఉంటుందో దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇందుకు మనం ఆ విషాన్ని కనిపెట్టి దానికి విరుగుడు సిద్ధం చేసుకోవాలి.

మోక్ష: మళ్లీ పౌర్ణమి వచ్చే వరకు ఎదురు చూడాలి సార్. పంచమి పాముగా మారితేనే మనం విషం సంపాదించగలం. ఇక మోక్షకి ప్రొఫెసర్ జాగ్రత్తలు చెప్పగా అక్కడి నుంచి మోక్ష వచ్చేస్తాడు. 

ఇక పంచమి ఓ చోట మోక్ష తనతో మాట్లాడిన మాటలు తలచుకొని చాలా బాధ పడుతుంది. తన భర్తను కాపాడుకోవడానికి ఆ దైవమే తనకు దిక్కని దేవుడే దారి చూపాలని కోరుకుంటుంది. అప్పుడే పంచమికి సుబ్బు కనిపిస్తాడు. పంచమి సుబ్బు దగ్గరికి వస్తుంది ఇంతటితో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక తరువాయి భాగంలో మోక్ష పంచమిని తన గుండెలకు హత్తుకొని ఎప్పటికీ నువ్వు నాతో ఇలాగే ఉండాలి అని చెప్తాడు. నా గుండె ఆగిపోయిన వరకు నా ప్రయాణం నీతోనే పంచమి అని చెప్పాడు. దీంతో పంచమి షాక్ అవుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Embed widget