Krishna Vamsi: మళ్లీ వార్తల్లోకి కృష్ణ వంశీ... శిష్యుడు తీసిన సినిమా కారణంగా!
RK Sagar's The 100 Movie: దర్శకుడు కృష్ణవంశీ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆయన కొత్త సినిమా ఏదీ చేయలేదు. కానీ, ఆయన శిష్యుడు చేసిన సినిమా 'ది 100'కు అవార్డులు వస్తున్నాయి.
కృష్ణవంశీ (Krishna Vamsi) అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్, రెస్పెక్ట్... రెండూ ఉన్నాయి. ఆయనకు క్రియేటివ్ డైరెక్టర్ అని బిరుదు ఇచ్చారు. ఇటీవల కృష్ణవంశీ తీసిన 'రంగమార్తాండ' ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ఆ సినిమా తర్వాత ఆయన కొత్త ప్రాజెక్ట్ ఏదీ అనౌన్స్ చేయలేదు. కానీ, ఇప్పుడు ఆయన పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. అందుకు కారణం కృష్ణవంశీ అసిస్టెంట్. ఆ వివరాల్లోకి వెళితే...
'ది 100' సినిమాకు అవార్డులు... కృష్ణవంశీకి అంకితం
'మొగలి రేకులు' సీరియల్ ద్వారా తెలుగు ప్రజల్లో పాపులర్ అయిన నటుడు ఆర్కే సాగర్. ఆయన హీరోగా రూపొందిన సినిమా '100'. ఈ చిత్రానికి ఓంకార్ రాఘవ్ శ్రీధర్ దర్శకుడు. ఆయన మెగాఫోన్ పట్టిన మొదటి చిత్రమిది. ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తోందని ఓంకార్ రాఘవ్ శ్రీధర్ చెప్పారు.
''దర్శకుడిగా నా మొదటి సినిమా 'ది 100'. పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాలు అందుకుంటోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో అప్రిషియేట్ చేస్తున్నారు. సినిమాలో పాజిటివ్ క్యారెక్టరైజేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఈ తరహా అర్థవంతమైన కథ, క్యారెక్టర్లు క్రియేట్ చేయడం వెనుక నా స్ఫూర్తి మా గురువు కృష్ణవంశీ గారు. కథ చెప్పే విధానం, విలువలు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. మనస్ఫూర్తిగా నా విజయాన్ని మా గురువు గారు కృష్ణవంశీకి అంకితం ఇస్తున్నాను. అతి త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నాను. ప్రేక్షకుల అశీసులు, మద్దతు మా టీం అందరికీ కావాలి. నా మాగదర్శిగా ఉంటూ నాకు వెలుగు చూపిస్తున్న కృష్ణవంశీ గారికి థాంక్స్'' అని ఓంకార్ రాఘవ్ శ్రీధర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Also Read: శృతి హాసన్ పోయే... మృణాల్ ఠాకూర్ వచ్చే - అడివి శేష్ సినిమాలో హీరోయిన్ ఛేంజ్!
View this post on Instagram
'ది 100' సినిమా మోషన్ పోస్టర్ మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు చేతుల మీదుగా విడుదలైంది. ఈ సినిమా టీజర్ మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి విడుదల చేశారు. ఇందులో ఆర్కే సాగర్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. త్వరలో సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.
Also Read: బిగ్ బాస్ 8 విజేత నిఖిల్... అతని కంటే ముందు విన్నర్స్ ఎవరో గుర్తు ఉన్నారా? ఓ లుక్ వేయండి
View this post on Instagram
View this post on Instagram