అన్వేషించండి

Pavitranath: ‘మొగలిరేకులు’ నటుడు మృతి - దయ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న పవిత్రనాథ్ ఇక లేరు

Pavitranath: ‘మొగలిరేకులు’ అనే సీరియల్‌కు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. అందులో నటించిన ప్రతీ యాక్టర్‌కు ఇప్పటికీ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక అందులో దయ పాత్రలో కనిపించిన పవిత్రనాథ్ ఇక లేరు.

Mogali Rekulu Fame Pavitranath Death: కొన్ని సీరియల్స్ ముగిసిపోయి ఎంతోకాలం అయినా కూడా బుల్లితెర ప్రేక్షకుల మనసుల్లో మాత్రం నిలిచిపోతాయి. అలాంటి వాటిలో ‘చక్రవాకం’, ‘మొగలిరేకులు’ మొదటి స్థానంలో ఉంటాయి. ముఖ్యంగా ‘మొగలిరేకులు’ అయితే ఎంతోమంది బుల్లితెర నటీనటులను స్టార్లను చేసింది. ఈ సీరియల్ ముగిసిపోయి ఎంతోకాలం అయినా కూడా ఇప్పటికీ ఇందులోని పాత్రలు చాలామందికి గుర్తున్నాయంటే ఇది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. కానీ తాజాగా ఇందులో దయ పాత్రలో నటించిన పవిత్రనాథ్ మరణించాడంటూ వస్తున్న వార్తలు అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాయి. పవిత్రనాథ్ మరణించిన విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు ఓ సీరియల్ నటి.

ఇంద్రనీల్ పోస్ట్..

‘మొగలిరేకులు’లో ధర్మ, సత్య, దయగా నటించిన వారిని ఇంకా ప్రేక్షకులు మర్చిపోలేదు. ఇందులో దయ పాత్రలో నటించిన ఇంద్రనీల్ ప్రస్తుతం ఎక్కువగా బుల్లితెరపై కనిపించడం లేదు. ఇంద్రనీల్, తన భార్య మేఘన కలిసి పవిత్రనాథ్ మరణవార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఎప్పటికీ జరగదు అనుకున్నది జరగడంలో ఎక్కువ బాధ ఉంటుందా లేదా జరిపోయినదాని గురించి షాక్ అవ్వడంలో ఎక్కువ బాధ ఉంటుందా అర్థం కావడం లేదు పవి. నువ్వు మా జీవితాల్లో చాలా ముఖ్యమైన భాగం అయిపోయావు. అందుకే ఈ వార్త విన్నప్పుడు ఇది నిజం కాకూడదని కోరుకున్నాం. ఫేక్ అవ్వాలి అనుకున్నాం’ అంటూ ఇంద్రనీల్ భార్య మేఘన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

అసలు ఏం జరిగింది?

‘నువ్వు నిజంగానే లేవు అనే నిజాన్ని అంగీకరించలేకపోతున్నాం బ్రదర్. కనీసం నీకు గుడ్ బై చెప్పే ఛాన్స్ దొరికినా బాగుండేది అనిపిస్తోంది. కచ్చితంగా నిన్ను చాలా మిస్ అవుతాం పవి. నీకు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. నువ్వు లేవన్న బాధ నుండి నీ కుటుంబం ఎప్పటికీ బయటికి రాదని తెలుసు అయినా వారు ధైర్యంగా ఉండాలని ఆశిస్తున్నాం’ అంటూ మేఘన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పవిత్రనాథ్ మరణించిన విషయం బయటికొచ్చింది. ఇది చూసిన వారంతా అసలు ఎలా జరిగింది, ఎందుకు చనిపోయాడు. ఉన్నట్టుండి ఏంటిది అని ఎన్నో ప్రశ్నలు కురిపిస్తున్నారు. కానీ వీరు మాత్రం ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Meghna Raami (@raamimeghna)

కృంగిపోయాడు..

పవిత్రనాథ్ మరణ వార్త ఒక్కసారిగా బుల్లితెర ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. తను ఏదైనా వ్యాధి వల్ల మరణించాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా? ఇలా ఎన్నో సందేహాలు ప్రేక్షకుల మైండ్‌లో నిండిపోయాయి. కానీ టీవీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం.. గత కొన్నిరోజులుగా పవిత్రనాథ్ పర్సనల్ లైఫ్ ఏం బాలేదని తెలుస్తోంది. తను చాలా కృంగిపోయాడని సన్నిహితులు చెప్తున్నారు. రెండేళ్ల క్రితం పవిత్రనాథ్ భార్య శశిరేఖ.. తనపై సంచలన ఆరోపణలతో మీడియా ముందుకు వచ్చింది. పవిత్రనాథ్‌కు అమ్మాయిల పిచ్చి ఉందని, గత 8 ఏళ్లుగా వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. అంతే కాకుండా ప్రశ్నించినందుకు తనను కొట్టేవాడని కూడా చెప్పింది. అది జరిగిన రెండేళ్ల తర్వాత ఉన్నట్టుండి పవిత్రనాథ్ మరణ వార్త అందరిలో సందేహాలను మరింత పెంచేస్తోంది.

Also Read: కరణ్ జోహార్‌ ను ఉద్దేశిస్తూ నెపోటిజంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన 'లోఫర్' బ్యూటీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget