అన్వేషించండి

Meghasandesham Serial Today September 5th: ‘మేఘసందేశం’ సీరియల్‌: రోడ్డు మీద డాన్స్ చేసిన భూమి – చెర్రీ చేతికి గాయం చూసి ఎమోషన్ అయిన గగన్

Meghasandesham Today Episode: తన తల్లి శోభాచంద్రే అని తెలుసుకున్న భూమి ఆనందంలో రోడ్డు మీద ఉన్న శోభ ఫ్లెక్సీ దగ్గర డాన్స్ చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesham Serial Today Episode:  శోభాచంద్రే తన తల్లి అని తెలిసి ఎమోషన్‌ అవుతుంది భూమి. పరుగెత్తుకెళ్లి శోభాచంద్ర ఫ్లెక్సీ దగ్గర నిలబడి ఏడుస్తూ.. నా గురువే నా తల్లి అంటే నమ్మలేకపోతున్నాను అంటూ రోడ్డు మీదే డాన్స్‌ చేస్తుంది భూమి. ఇంతలో  నాట్యం చేసే అమ్మాయిల బృందం కూడా వచ్చి భూమితో కలిసి నాట్యం చేస్తుంటారు. డాన్స్‌ చేస్తున్నవాళ్ల ముందు జనం డబ్బులు వేస్తుంటారు. ఇంతలో కారులో వెళ్తున్న గగన్‌, భూమిని చూసి జనం డబ్బులు వేయడం చూసి షాక్ అవుతాడు. భూమి దగ్గరకు వెళ్లి ఇంటికి వెళ్దాం పద అంటాడు.

భూమి: నేను ఎవరి కోసం వచ్చానో.. నేను ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నానో వాళ్ల గురించి తెలిసింది.

గగన్‌: నువ్వు ముందు ఇంటికి పద..

భూమి: నా పుట్టుక గురించి తెలిసింది. మా అమ్మ ఎవరో తెలుసా? అదిగో ఆ శోభాచంద్ర గారే..

 గగన్‌: ఇన్ని రోజులు గురువు అన్నావు. ఇప్పుడేమో అమ్మా అంటున్నావా?

భూమి: నిజంగా ఆమే మా అమ్మ..

గగన్‌: మాట్లాడింది చాలు పద వెళ్దాం..

అని గగన్‌, భూమిని తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంట్లో శారదమ్మా ఎదురుగా వచ్చి భూమిని ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది. లోపలికి వచ్చిన గగన్‌ శారదకు చెప్పి ఇంట్లో డబ్బులు తెప్పించి భూమి ముందు పెట్టించి ఇవి సరిపోకపోతే చెప్పు రేపు బ్యాంకు నుంచి తెప్పిస్తానని లేదంటే నీ జీతం డబుల్‌ చేస్తాను అంటాడు. ఎందుకు ఏమైందని శారద అడగ్గానే రోడ్డు మీద భూమి డాన్స్‌ చేస్తుంటే జనాలు డబ్బులు వేస్తున్నారు అని చెప్తాడు.

భూమి: శోభాచంద్రగారి పోస్టర్‌ చూసి డాన్స్‌ చేస్తుంటే వాళ్లెవరో డబ్బులు వేశారు.  దానికి మీరు ఫీలయితే ఎలా?

శారద: అవునా.. ఓరేయ్‌ గగన్‌ ఆ శోభాచంద్ర వీళ్ల గురువు గారిలా ఫీలవుతుంది కదరా? అందుకు డాన్స్‌ చేసిందట.

గగన్‌: నిన్నటి దాకా గురువు అంది. ఇప్పుడు అమ్మ అంటుంది.

భూమి: అవును ఆంటీ మా అమ్మే.. నాకు ఈరోజే తెలిసింది.

శారద: భూమి కిందేమైన పడ్డావా?

భూమి: లేదు ఆంటీ..

శారద: పోనీ పైనుంచి ఏదైనా మీద పడటం.. తల మీద

భూమి: అలాంటి ఏం లేదు ఆంటీ.. ఎందుకు?

శారద: బాగానే ఉంది కదరా? ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్‌ కు తీసుకెళ్లు.

 అనగానే భూమి నేను చెప్పేది నమ్మరా అంటూ అమాయకంగా మాట్లాడుతుంది. త్వరలోనే నిజం తెలిసినప్పుడు మీరే నమ్ముతారు అని చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత నేను శోభాచంద్ర గారి కూతురిని అంటే ఆంటీవాళ్లే నమ్మటం లేదు. ఇక మా నాన్న ఎలా నమ్ముతారు అని నేను ఎవరో చెప్పగలిగేది ఆయనొక్కరే అని తనకు నిజం చెప్పిన వ్యక్తిని గుర్తు చేసుకుంటుంది.  వెంటనే హాస్పిటల్‌ కు వెళ్తుంది. అక్కడ ఐసీయూలో ఉన్న వ్యక్తి గురించి ఆరా తీస్తుంది.

    అతనికి ఎవరూ లేరని తెలిసి ఆయన్ని తన ఇంటికి తీసుకెళ్తానని డాక్టర్‌ ను అడుగుతుంది. దీంతో అతను కోమాలో ఉన్నాడని డాక్టర్‌ చెప్పడంతో భూమి షాక్‌ అవుతుంది. దీంతో ట్రీట్‌మెంట్‌కు రెండు లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్‌ చెప్పగానే నేను ఎవరో నిరూపించుకోవడానికి కూడా ఖర్చు అవుతుందన్నమాట అనుకుని భూమి సరే అంటుంది. మరోవైపు గగన్‌ తింటుంటే చెర్రీ వస్తాడు. చేతికి కట్టు ఉండటం చూసి గగన్‌, శారద, పూరి కంగారు పడతారు. ఏమైందని అడిగితే ఇంట్లో జరిగిన విషయం చెప్తాడు చెర్రీ. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిక్నిక్ కు వెళితే ప్రమాదం అన్న గుప్త –పిక్నిక్ ను క్యాన్సిల్ చేయించిన మనోహరి

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today August 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
Jabardasth Pavithra : జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
Illu Illalu Pillalu Serial Today August 17th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమకి గోరింటాకు పెట్టిన ధీరజ్! చేతి మీద కల్యాణ్ పేరు రాసిందెవరు?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమకి గోరింటాకు పెట్టిన ధీరజ్! చేతి మీద కల్యాణ్ పేరు రాసిందెవరు?
Brahmamudi Serial Today August 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీతో నందు గురించి మాట్లాడిన ఇందు – రాజును అవమానించిన చలపతి
‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీతో నందు గురించి మాట్లాడిన ఇందు – రాజును అవమానించిన చలపతి

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget