Meghasandesam Serial Weekly Roundup September 1st to 6th: ‘మేఘసందేశం’ సీరియల్: గడచిన వారం మేఘసందేశం సీరియల్‌లో ఏ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం
Meghasandesam serial weekly episode September 1st to 6th: మేఘసందేశం సీరియల్ ఈ వారంలో చాలా ఆసక్తికరంగా జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Meghasandesam Serial weekly Episode: నక్షత్ర రూంలో కూర్చుని మందు తాగుతూ ఉంటుంది. ఇంతలో చెర్రి వస్తాడు. మందు తాగడం చూసి షాక్ అవుతాడు. ఇంట్లో అందరూ ఉన్నా కూడా మందు తాగుతున్నావా..? అని అడుగుతాడు. గగన్ ను పెళ్లి చేసుకుని తనకు నచ్చినట్టు తాను బతకాలనుకుందని అదంతా చెర్రి డిస్టబ్ చేశాడని తిడుతుంది. అందుకే తాగుతున్నానని చెప్తుంది నక్షత్ర. అయితే నువ్వు చేసిందేమిటి భూమి లైఫ్‌ను స్పాయిల్ చేయాలనుకోలేదు. మొన్న ఒకసారి మా అన్నయ్య ఇంటికి వెళ్లి మందు తాగి గొడవ చేశావు. ఈరోజు ఇంట్లోనే కూర్చుని తాగుతున్నావు. ఇలా కాదు ఇప్పుడే మామయ్యను పిలిచి నీ నిజస్వరూరం ఏంటో ఆయనకు చూపించేస్తాను అంటూ నక్షత్రను బెదిరించాలనుకుంటాడు చెర్రి కానీ నక్షత్ర రివర్స్ నాటకం మొదలు పెడుతుంది. చెర్రి చేతిలో గ్లాస్ పెట్టి.. కొద్దిగా మందు చెర్రి షర్ట్ మీద పోసి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులకు శరత్ చంద్ర, భూమి పైకి వస్తారు. వెంటనే నక్షత్ర డాడీ చెర్రి మందు కొడుతూ నన్ను కొడుతున్నాడు అంటూ ఏడుస్తున్నట్టు నాటకం ఆడుతుంది. శరత్ చంద్ర కోపంగా చెర్రిని కొట్టి వెళ్లిపోతాడు.
తర్వాత శివ తీసుకొచ్చిన బొమ్మ కోసం భూమి గగన్ వాళ్ల ఇంటికి వెళ్తుంది. అందరూ భోజనం చేస్తుంటారు. భూమి లోపలికి వెళ్లి ఇంట్లో అంతా వెతుకుతుంది. రత్న భూమిని చూసి ఈ అమ్మాయి ఎవరు మేడం.. ఇల్లంతా వెతుకుతుంది అంటూ శారదను అడుగుతుంది. అందరూ భూమిని చూస్తారు. గగన్ వెళ్లి మళ్లీ ఎందుకు వచ్చావు అంటూ భూమిని అడుగుతాడు. శివ తీసుకొచ్చిన బొమ్మ కావాలని చెప్తుంది. గగన్ కోపంగా భూమిని బయటకు గెంటేస్తాడు.
ఉదయ్ ప్లాన్ ప్రకారం భూమి దగ్గరకు వెళ్తాడు. ఎలాగైనా భూమిని పబ్‌కు తీసుకెళ్లాలనుకుంటాడు. అందుకోసం బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నట్టు చెప్పాలనుకుంటాడు. అందుకు భూమి ఒప్పుకోదు.. దీంతో ఉదయ్ నేరుగా వెళ్లి శరత్ చంద్ర కాళ్ల మీద పడి పార్టీకి భూమి రానంటుంది మీరే చెప్పండి అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. శరత్ చంద్ర భూమిని పిలిచి పార్టీకి వెళ్లమని ఒప్పిస్తాడు.
గగన్ ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్లు ఉండగా రత్న ఒక సంచిలో తన బట్టలు పెట్టుకుని గగన్ రూంలోకి వెళ్లి బొమ్మను ఆ సంచిలో పెట్టుకుని పైన తన బట్టలు పెట్టుకుని తీసుకుని వెళ్లిపోతుంది. బయటకు వెళ్లి అపూర్వకు ఫోన్ చేసి చెప్తుంది. లోకేషన్ షేర్ చేస్తాను అక్కడికి వచ్చేయ్ అని చెప్తుంది అపూర్వ. అపూర్వ చెప్పినట్టే అక్కడికి వెళ్తుంది రత్న. అక్కడే అపూర్వ వెయిట్ చేస్తుంది. రత్న ఇచ్చిన బొమ్మను చూసి నవ్వుకుంటుంది. బొమ్మ ఓపెన్ చేసి చూస్తే అందులో వీడియో రికార్డర్ ఉండదు. అపూర్వ షాక్ అవుతుంది. బొమ్మతో నేనేం చేసుకుంటాను ఆ వీడియో రికార్డర్ కావాలి అని చెప్తుంది. మళ్లీ ఎలాగైనా వెళ్లి రికార్డర్ తీసుకురా అని చెప్తుంది. సరే అంటుంది రత్నం.
ఇంట్లో పూజ కాదని బయట గుడిలో శారదతో కలిసి పూజలో పాల్గొంటాడు కేపీ. కేపీ కోసం మీరా ఇంట్లో వెతుకుతుంది. చెర్రిని పిలిచి మీ నాన్న ఎక్కుడున్నా వెంటనే తీసుకురా అంటుంది. అలాగే అంటాడు చెర్రి. ఇక బ్యాచిలర్ పార్టీకి వెళ్లిన గగన్‌ను అవమానించాలనుకుంటాడు ఉదయ్. భూమి అడ్డుపడుతుంది. అప్పటికే గగన్ ఫుల్లుగా మందు కొట్టి ఉంటాడు. గగన్ కు పోటీగా భూమి మందు తాగుతుంది. మందు మత్తులో గగన్ భూమిని ఎత్తుకుని అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతాడు. మధ్యలో ఒక గుడి దగ్గర భూమిని దింపి అమ్మవారి దగ్గర ఉన్న పూలదండలు మార్చుకుంటారు. అక్కడే ఉన్న పసుపుతాడును తీసి గగన్, భూమి మెడలో కడతాడు. దీంతో ఈ వారం మేఘసందేశం చివరి ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!



















