Meghasandesam Serial Today November 4th: ‘మేఘసందేశం’ సీరియల్: నక్షత్రను కొట్టిన భూమి – చెర్రి రియాక్షన్ చూసి షాకైన అపూర్వ
Meghasandesam serial today episode November 4th: గుడిలో ఉన్న అపూర్వను డైవర్ట్ చేయడానికి భూమి, నక్షత్రను కొడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: గుడిలో దూరం నుంచి కేపీని గమనిస్తున్న అపూర్వ, నక్షత్రలను వెనక నుంచి చూస్తుంది. భూమి వీళ్లను ఎలాగైనా ఇక్కడి నుంచి డైవర్ట్ చేయాలి అని మనసులో అనుకుంటుంది భూమి. ఇంతలో నక్షత్ర చెర్రి గురించి తప్పుగా మాట్లాడుతుంది. అదే అదనుగా భూమి వెళ్లి నక్షత్రను కొడుతుంది.
నక్షత్ర: ఒసేయ్.. నన్ను కొడతావా..? నిన్ను..
భూమి: ఏమే భర్తతో కలిసి అర్చన చేయించుకోను అంటావా…? అది కూడా గుడిలో నిలబడి ఆ మాట చెప్తావా..? ఎంత ధైర్యమే నీకు
అపూర్వ: భూమి ఆగే.. నువ్వు తప్పుకో.. ఏంటే..?
భూమి: చీచీ అసలు మీకు బుద్దుందా..? ఎద్దుల్లాగా..? తుమ్మ మొద్దుల్లాగా ఎదిగారు (అనుకుంటూ హోమం వైపు చూస్తుంది. అక్కడ శారద కేపీని పక్కకు తీసుకుపోతుంది.) పాప పెళ్లి గురించి దాని పవిత్రత గురించి పాపపు మాటలు మాట్లాడుతుంటే బుద్ది చెప్పాల్సింది పోయి చెప్తున్న నన్ను అడ్డకుంటారా..?
అపూర్వ: ఎంత పొగరే నీకు ఏమున్నా సరే నా కూతురుకు నేను చెప్పుకుంటాను.. నువ్వెవరే నా కూతురును కొట్టడానికి ఇప్పుడు చెప్తున్నాను.. ఈ రోజు ఆ పరమశివుడి సాక్షిగా నిన్ను చావగొట్టే తీరతాను..
భూమి: ఏంటి తీరేది..?
నక్షత్ర: మమ్మీ ఈరోజు దీని అంతు చూడాల్సిందే..
అపూర్వ: ఎస్ బేబీ.. అసలు నీకెంత ధైర్యం ఉంటే నా కూతురినే కొడతావే..?
సుజాత: నా కూతురునే ఎదురించేంత పెద్దదానివి అయిపోయావే..?
నక్షత్ర: ఈరోజు నీ సంగతి తేలస్తాం..
భూమి: చూడండి నన్ను రౌండప్ చేసి కన్ఫీజ్ చేయోద్దు.. కన్ఫీజ్‌లో ఎక్కువ కొట్టేస్తాను..
అపూర్వ: ఏం చేస్తావే.. పెద్ద మహేష్ బాబులా డైలాగులు కొడుతున్నావు. నువ్వు ఏమైనా మహేష్ బాబువు అనుకుంటున్నావా..?
భూమి: మీకు మళ్లీ చెప్తున్నాను..
అపూర్వ: ఏం చేస్తావు నువ్వు..
ఇంతలో టికెట్స్ కోసం వెళ్లిన చెర్రి వస్తాడు.
చెర్రి: ఏయ్ ఆగండి.. ఏం చేస్తున్నారు..?
నక్షత్ర: నువ్వు నోరు మూసుకో..
చెర్రి: గుళ్లోకి వచ్చి చిన్న పిల్లల లాగా ఈ ఆటలేంటి..?
అపూర్వ: అరేయ్ అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏం మాట్లాడుతున్నావురా..? ఇది నీ భార్య నక్షత్రను కొట్టిందిరా..?
చెర్రి: కొట్టిందా..?
అపూర్వ: ఎలాగైనా సరే ఇవాళ మనం దీన్ని కొట్టాల్సిందే.. రారా నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వు..
చెర్రి: అబ్బా అవసరం వచ్చినప్పుడేమో నేను నక్షత్ర మొగుణ్ని.. మీకు అవసరం లేనప్పుడేమో లేత వంకాయనా..? మరీ నేను తింగరోడిరా కనబడుతున్నానా అత్తా..?
భూమి: ఒరేయ్ చెర్రి
చెర్రి: ఒరేనా..?
భూమి: నువ్వు నిజంగా తింగరోడిలా మట్లాడుతున్నావు.. నేను కొట్టింది మీ ఆవిడను.. నిజంగ నీకు దమ్ముంటే వచ్చి వాళ్లతో జాయిన్ అవ్వు.. జాయిన్ అవ్వరా..?
చెర్రి: అమ్మమ్మా.. నువ్వు ఇంతకు తెగిస్తావని అనుకోలేదు.. బాహుబలి లాంటి నాతోనే పెట్టుకోవాలి అనుకుంటావా..? ఈరోజు నువ్వు నా చేతుల్లో అయిపోయావు..
భూమి: ఏయ్ ఆగు.. ఇప్పుడు చెప్తున్నాను వినండి.. మీ చేయి నా మీద పడటం కాదు కదా… చేతి గోరు పడ్డా మీ నలుగురిని మా ఆయన చీరేస్తాడు. అదిగో మా ఆయన కూడా వచ్చేశాడు అక్కడ చూడండి..
అని చెప్పగానే.. అందరూ తిరిగి చూస్తారు. అక్కడ గగన్ కనిపిస్తాడు. గగన్ ను చూసి భయపడతారు.
సుజాత: గుడిలో గొడవలు ఎదుకులే అమ్మాయి. ఏదైనా ఉంటే బయట చూసుకుందాం..
అపూర్వ: అంతేలే పిన్ని వెళ్దాం పద.. ఒసేయ్ నిన్ను మాత్రం అసలు వదలను బేబీ వీడితో మనకేంటి వెళ్దాం పద..
నక్షత్ర: ఒసేయ్ నీ సంగతి చెప్తానే..
అంటుండగానే అపూర్వ, నక్షత్రను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
చెర్రి: అత్తయ్య.. అత్తయ్య..
భూమి: ఏం బాహుబలి నాతో కయ్యానికి కాలు దువ్వాలని ఇంకా ఉందా..?
చెర్రి: భూమి ఫ్లోలో నువ్వు నన్ను అరేయ్ గిరేయ్ అంటున్నావు ముందు సారీ చెప్పు నాకు
భూమి: ఏదో సరదాగా అన్నానులే.. సారీ
చెర్రి: థాంక్యూ భూమి.. బై ది బై నక్షత్రను లాగిపెట్టి కొట్టి నేను చేయలేని పని నువ్వు చేశావు.. సూపర్..
అంటూ చెర్రి, భూమిని మెచ్చుకుంటాడు. భూమి మాత్రం తమను గగన్ చూస్తే పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















