Meghasandesam Serial Today February 13th: ‘మేఘసందేశం’ సీరియల్: అపూర్వకు షాక్ ఇచ్చిన భూమి - శోభాచంద్ర చేతుల మీదుగా దత్తత కార్యక్రమం
Meghasandesam Today Episode: దత్తత ఇష్టం లేదని అపూర్వ చెప్పగానే అయితే చాలా మంచిది అంటూ భూమి చెప్పడంతో శరత్ చంద్ర షాక్ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode : హాస్పిటల్‌కు వచ్చిన గగన్, నక్షత్ర ఎక్కడుందని చందును అడుగుతాడు. చందు ఐసీయూ దగ్గరకు గగన్‌ను తీసుకెళ్లి లోపల ట్రీట్‌మెంట్ జరుగుతున్న నక్షత్రను చూపిస్తాడు. గగన్ షాక్ అవుతాడు.
చందు: మన సైట్ పక్కనే పడుందట.. ఎవరో అనుకుని హాస్పిటల్‌కు తీసుకొస్తే.. పని మీద ఇక్కడికి వచ్చిన నేను చూశాను.
గగన్: అక్కడే పడి ఉందని నీకెలా తెలుసు..?
చందు: తనను తీసుకొచ్చిన వాళ్లను అడిగి తెలుసుకున్న.. తను నీతో ఏం మాట్లాడిందో.. మాట్లాడిన తర్వాత యాక్సిడెంటల్‌గా ఆ లోయలో పడిందో లేక సూసైడ్ చేసుకుందో నీకే తెలియాలి. ఎందుకంటే నువ్వే అక్కడ చివరి సారిగా ఉన్నది. తర్వాత చీకటి పడిపోయింది. తెల్లవారాక ఇక్కడ ఉంది. అసలు ఏం జరిగిందిరా.. ఎవరు తను..
గగన్: తను ఎవరో తెలియాలి అంటే నీకు నా గతం తెలియాలి.. (అంటూ తన చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలు మొత్తం చెప్తాడు గగన్.) అలా నా చిన్నతనంలో తండ్రికి ఊరికి దూరమై.. ప్రాణాన్ని కాపాడుకోవాలని.. ఎటు వెళ్లాలో కూడా తెలియదు. అలా నా బాల్యాన్ని చంపేసుకుని నా కుటుంబానికి నేనే దిక్కుగా మారాను. ఏ అండా లేకపోయినా.. మారుతున్న కాలంలో ఒక్కో మెట్టు ఎదుగుతూ నేను ఈ స్థాయిలో నిలబడ్డాను. ఎక్కడికి వెళ్లినా మన నీడ మనల్ని వెంటాడుతున్నట్టు.. నా శత్రువు నన్ను వెంటాడుతూనే ఉన్నాడు. ఈ ఐసీయూలో ఉన్న ఆ నక్షత్ర ఎవరో కాదు. ఆ శరత్ చంద్ర కూతురు. ఈ బావను పెళ్లి చేసుకుంటావో వదిలేసి ఈ బావను బలి తీసుకుంటావో అని నా ఫోన్ నుంచి తన ఫోన్‌కు మెసేజ్ పంపించుకుని నన్ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. ఎంత వద్దని చెప్పినా వినకుండా డబ్బు, అహంకారం అనే మూర్ఖత్వంతో తను ఇంత వరకు వచ్చింది.
చందు: ఐ ఆయామ్ సారీ గగన్ నీకు ఇంత బాధకరమైన గతం ఉందని.. అంత బలమైన శత్రువు ఉన్నాడని నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు నక్షత్ర గురించి వాళ్ల వాళ్లకు ఎలా చెప్తావు.
గగన్: ఏముంది. నాకు ఎలా అర్థం అయిందో అదే చెప్తాను.
చందు: నో అలా చెబితే పొరపాటున ఆ నక్షత్ర బతక్కపోతే నువ్వే లోయలో తోసి చంపేశామని.. వాళ్లు పోలీస్ కేసు పెట్టే ప్రమాదం ఉంది. అన్నింటి కంటే ముందు నీ మీదకు గొడవకు వచ్చే అవకాశం ఉంది. నేను నక్షత్ర గురించి చెప్పినప్పుడు ఎలా అర్థం అయిందో అలా మాత్రమే చెప్పు. కావాలంటే నీకు అర్థం అయింది చెప్పొచ్చు.
గగన్ : సరే అలాగే చెప్తాను..
అని గగన్ చెప్పగానే చందు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు శరత్ చంద్ర ఇంట్లో భూమి దత్తత కార్యక్రమం గ్రాండ్‌గా జరుగుతుంది. ఇంతలో చెర్రి.. భూమిని కిందకు పిలుస్తాడు. రూంలో దత్తత ఇష్టం లేని అపూర్వను శరత్ చంద్ర ఒప్పిస్తుంటాడు.
శరత్: కన్నప్రేమ దొరుకుతుందన్న ఆశతోనే వచ్చింది తప్పా.. ఈ ఆస్తి మీద తనుక ఆశ లేదు.
భూమి: నాన్నా.. టైం అయిపోతుంది రమ్మని పంతులు గారు పిలుస్తున్నారు.
శరత్: వస్తున్నాను అమ్మా మీ పిన్నికి నచ్చజెప్పి తీసుకొస్తున్నాను.
భూమి: నచ్చజెప్తున్నాను అంటే ఈ దత్తత పిన్నికి నచ్చలేదనేగా..?
శరత్: అలా ఏం లేదమ్మా..?
భూమి: పిన్నికి ఈ దత్తతు నచ్చకపోవడమే మంచిది నాన్నా.. మీ చేతుల మీదుగా అమ్మ శోభాచంద్ర చేతుల మీదుగా ఈ దత్తత కార్యక్రమం జరగాలన్నదే నా కోరిక.
శరత్: అదెలా సాధ్యం అమ్మా..?
భూమి: రండి చెప్తాను
అని శరత్ చంద్రను కిందకు తీసుకెళ్లి.. శోభాచంద్ర ఫోటో పెట్టి దత్తత కార్యక్రమం చేయండని చెప్తుంది భూమి. పంతులు అలాగే చేస్తుంటాడు. అపూర్వ, సుజాత షాక్ అవుతారు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















