Lakshmi Nivasam Serial Today: 'లక్ష్మీ నివాసం' సీరియల్: ఖుషీని చూసేందుకు తులసికి సిద్ధు హెల్ప్ - ఖుషిని తులసి కాపాడుతుందా?
Lakshmi Nivasam Today Episode: జైతో జాను పెళ్లికి ఓకే చెప్పడంతో ఫ్యామిలీ అంతా సంతోషిస్తారు. ఇక జాతకాలు చూపించే క్రమంలో జై పంతంతో పూజారి జాతకాలు కలిశాయని అబద్ధం చెబుతారు.

Lakshmi Nivasam Serial Today Episode: జైతో జాను పెళ్లికి ఓకే అనడంతో శ్రీనివాస్ ఫ్యామిలీ సంతోష పడుతుంది. ఇద్దరి జాతకాలను పూజారికి ఇచ్చి చూడమంటారు శ్రీనివాస్ దంపతులు. అయితే, జాతకాలు కలవకపోయినా జై పంతంతో.. పూజారి ఇద్దరి జాతకాలు అద్భుతంగా కలిశాయంటూ శ్రీనివాస్ ఫ్యామిలీకి చెబుతాడు. దీంతో అంతా సంతోషిస్తారు. పూజారి మాత్రం మనసులో వేదన చెందుతుంటాడు. ఇదే సమయంలో ఆయన వద్దకు జై వస్తాడు. మరోవైపు, విశ్వ జానుకు రాసిన లవ్ లెటర్ చదవడం మిస్ అవుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో..
సూసైడ్ చేసుకుంటానంటూ జై బెదిరింపులు
జాను, జై జాతకాలు కలవలేదని శ్రీనివాస్, లక్ష్మిలకు చెప్పేందుకు పూజారి యత్నించగా.. జై అతన్ని అడ్డుకుంటాడు. మీరు అలా చెబితే తాను చనిపోతానంటూ గన్ పట్టుకుని పూజారిని బెదిరిస్తాడు. దీంతో వారి ఫ్యామిలీకి అలానే చెబుతాడు పూజారి. జై ప్రేమను జాను ఎలా తట్టుకుంటుందో అంటూ పూజారి ఆలోచిస్తాడు.
ఖుషిని కలిసేందుకు తులసి ప్లాన్
మరోవైపు.. సుపర్ణిక, భార్గవ్ కలిసి తమకు శ్రీ చనిపోయే ముందు కంపెనీ బాధ్యతలు అప్పగించారంటూ అందరికీ గెట్ టు గెదర్ పార్టీ ఇస్తారు. ఈ విషయం తెలుసుకున్న తులసి.. ఖుషీని చూసేందుకు ఆ పార్టీకి వెళ్లాలని అనుకుంటుంది. అయితే, ఇన్విటేషన్ కార్డ్ లేకుండా లోపలికి పంపించలేమని సెక్యూరిటీ గార్డ్ చెబుతాడు.
ఇంతలో తులసిని చూసిన సిద్ధు.. విషయం ఏంటని అడుగుతాడు. దీంతో విసుక్కుంటూనే అతనికి పార్టీ లోపలకి వెళ్లాలని అంటుంది. తాను లోపలికి వెళ్లేందుకు హెల్ప్ చేస్తానని తులసితో చెబుతాడు. ఆ తర్వాత ఆమెను బైక్ ఎక్కించుకుని ఓ కరెంట్ పోల్ వద్ద ఆపి నిచ్చెన తీసుకొస్తాడు. నిచ్చెన సాయంతో గోడ ఎక్కి లోపలికి వెళ్లొచ్చని ఐడియా చెప్తాడు సిద్ధు. దీంతో ఇది పిచ్చి ఐడియా అని అనుకుంటుంది.
విశ్వకు జాను ఫోన్
ఇదే సమయంలో విశ్వకు జాను ఫోన్ చేస్తుంది. మన ఇద్దరం కలిసే స్పాట్‌కు రావాలని అంటుంది. దీంతో తాను బుక్‌లో పెట్టిన లవ్ లెటర్ చదివే తనను పిలిచిందని అనుకుంటాడు విశ్వ. వెంటనే అక్కడకు బయలుదేరుతాడు.
తులసికి సిద్ధు హెల్ప్
మరోవైపు.. తులసిని చూసిన సిద్ధు ఆమె పార్టీ లోపలికి వెళ్లేందుకు ఆ బిల్డింగ్ గోడకు నిచ్చెన వేసి హెల్ప్ చేస్తాడు. నిచ్చెన సాయంతో తులసి ఎక్కుతుండగా సిద్ధు పట్టుకుంటాడు. తులసి గోడ ఎక్కి అవతలికి దూకుతుంది.
పార్టీలో చిన్నారి ఖుషి వేదన
పార్టీలో చిన్నారి ఖుషి ఆకలితో ఇబ్బందులు పడుతుంది. ఖుషిని చూసేందుకు తులసి ఆరాటపడుతుంది. ఖుషిని చూసిన భాగ్యం ఎందుకొచ్చావని అడగ్గా.. తనకు ఆకలేస్తుందని అంటుండగా.. పనులు చేస్తేనే తిండి అంటూ పాపను కసురుకుంటుంది. ఇంతలో ఎంగిలి ప్లేట్స్ పెట్టిన దగ్గరకు వెళ్లి అందులోది తీసుకుని తినాలని చూస్తుంది ఖుషి. ఇది చూసిన తులసి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
మరోవైపు.. ఖుషిని చూసిన భార్గవ్ పాపను కసురుకుంటాడు. పాప ఆకలేస్తుందని అనగా.. స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేస్తాడు. ఇది చూసిన తులసి పాప దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది. స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి ఖుషీని కాపాడుతుంది. ఇది చూసిన సుపర్ణిక, భార్గవ్, భాగ్యం షాక్ అవుతారు. పాపను ఎందుకు టార్చర్ పెడుతున్నారంటూ వాళ్లపై కసురుకుంటుంది. ఖుషీని ఇక్కడ ఉంచనంటూ తనతో తీసుకెళ్తానంటూ తులసి అంటుంది. దీంతో సుపర్ణిక తులసిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
మరి తులసి ఖుషీని తనతో తీసుకెళ్తుందా?, జాను విశ్వతో ఏం చెప్తుంది? వంటివి తెలియాలంటే రేపటి ఎపిసోడ్స్ వరకూ ఆగాల్సిందే.






















