అన్వేషించండి

Lakshmi Nivasam Serial Today: 'లక్ష్మీ నివాసం' సీరియల్: సిద్ధు రాకతో తులసి జీవితం మళ్లి గాడిన పడుతుందా? - కొత్త వ్యక్తి జాను విషయంలో విశ్వకు పోటీ అవుతాడా?

Lakshmi Nivasam Today Episode: ఖుషీ రాకతో తులసి జీవితం ఎలాంటి మలుపు తిరగబోతుందోనని లక్ష్మీ, శ్రీనివాస్‌లు ఆవేదనకు గురవుతుంటారు. యాక్సిడెంట్‌ను కప్పి పుచ్చేందుకు బసవ యత్నిస్తుంటాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో

Lakshmi Nivasam Serial Today Episode Review: ఖుషీని ఇంట్లోకి తీసుకురావడంపై తులసి అన్న, వదినలు ఆమెపై చిందులు తొక్కుతుంటారు. ఖుషీ బాధ్యత తాను తీసుకుంటానని తులసి వారికి కచ్చితంగా చెబుతుంది. ఆ యాక్సిడెంట్ చేసిన వారిని వదిలిపెట్టనని తులసి జానుతో అంటుంది. ఖుషీ రాకతో తులసి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందోనని లక్ష్మి, శ్రీనివాస్ బాధ పడుతుంటారు. ఇదే సమయంలో యాక్సిడెంట్ కప్పిపుచ్చేందుకు ఎస్సై, డాక్టర్‌కు బసవ లంచం ఇస్తాడు. ఇది గమనించిన బసవ కోడలు సిద్ధుకు ఈ విషయం చెబుతుంది. దీంతో సిద్ధు ఆలోచనలో పడతాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ విషయానికొస్తే..

తులసి పెళ్లి కోసం లక్ష్మీ, శ్రీనివాస్ వేదన

ఖుషీ ఇంటి బయట బాధతో కూర్చుండగా.. రామం తులసికి చెప్తాడు. తులసి వచ్చి ఖుషీని అడగ్గా.. తనతో అమ్మ, నాన్న ఇద్దరూ ఎప్పుడూ ఉండరని.. చిన్నప్పుడు నాన్న ఉంటే అమ్మ ఉండేది కాదని బాధ పడుతుంది. ఈ మాటలు విన్న తులసి వేదనకు గురవుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మీ, శ్రీనివాస్.. ఖుషీకి నాన్న తోడు కావాలని పెళ్లి కోసం ఆలోచించాలని తులసికి చెప్తారు. అయితే, ఖుషీని చూసుకునేందుకు తులసికి సాయం చేద్దామని జాను అంటుంది. అక్క చేయి పట్టుకునేందుకు ఏ దేవుడు వస్తాడో చూద్దామని చెప్తుంది. దీంతో అంతా ఆలోచనలో పడతారు.

మరోవైపు, సుపర్ణిక, భార్గవ్.. శ్రీకాంత్, వసుంధర కార్యక్రమాలు చేస్తుంటారు. భార్గవ్ ఏడుస్తున్నట్లు నటించి తాను అనుకున్నది నెరవేరిందని.. ఈ ఆస్తి మొత్తం ఇక తనదేనని మనసులో అనుకుంటాడు. 

భార్గవ్ దొరికిపోతాడా..

ఇదే సమయంలో భార్గవ్ యాక్సిడెంట్‌కు సహాయం చేసిన వ్యక్తి అక్కడికి వస్తాడు. అతన్ని చూసిన భార్గవ్ ఒక్కసారిగా షాక్‌కు గురై అతన్ని 'ఇంటి వరకూ వచ్చావేంటి?' అని ప్రశ్నిస్తాడు. బ్యాలెన్స్ డబ్బులివ్వాలని భార్గవ్‌ను అడుగుతాడు. డబ్బులు తర్వాత ఇస్తానని అతనికి చెప్తాడు. బ్యాలెన్స్ సెటిల్ చేయకపోతే యాక్సిడెంట్ విషయం అందరికీ చెప్పేస్తానని బెదిరిస్తాడు. ఇదే టైంలో సుపర్ణిక అక్కడకు వస్తుంది. అయితే, కారు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వచ్చాడని సద్ది చెప్పేస్తాడు భార్గవ్. 

బాధలో జాను.. ధైర్యం చెప్పిన విశ్వ

కాలేజీకి వెళ్లిన జాను.. తన అక్క గురించి ఆలోచిస్తూ బాధ పడుతుంది. అదే సమయంలో అక్కడికి విశ్వ, అతని ఫ్రెండ్స్ వస్తారు. తులసిది చాలా మంది మనసని.. బెటర్ లైఫ్ ఉంటుందని ధైర్యం చెప్తాడు. కాలేజీ కల్చరల్ కాంపిటీషన్ కోసం ప్రిపేర్ అవుదామని జానుతో అంటాడు విశ్వ. ఈ పరిస్థితిలో రాలేనని జాను అనడంతో ఆమెకు నచ్చచెప్పి తీసుకువెళ్తాడు. 

తులసి కోసం లక్ష్మి మొక్కులు

తులసి జీవితం బాగుపడాలని లక్ష్మీ శివాలయంలో అభిషేకం చేస్తుంది. తులసికి శ్రీతో ఎంగేజ్మెంట్ జరగడం, పెళ్లిపీటల వరకూ వచ్చి వారికి ప్రమాదం జరిగి శ్రీ, వసుంధర చనిపోవడం గురించి ఆలోచిస్తుంది. ఇదే సమయంలో పూజారి ఎందుకమ్మా అలా నీళ్లు ఎక్కువ అభిషేకం చేస్తున్నావంటూ లక్ష్మిని ప్రశ్నిస్తాడు. ఓర్పుతో ఉండాలని కష్టాలు గట్టెక్కుతాయని పూజారి లక్ష్మికి ధైర్యం చెప్తాడు. లక్ష్మి అలా అభిషేకం చేస్తూనే సొమ్మసిల్లి పడిబోతుండగా.. సిద్ధు అక్కడికి వస్తాడు. అక్క అంటూ ఆమెను పట్టుకుంటాడు. తులసి లక్ష్మి కూతురే అని సిద్ధుకు తెలుస్తుందా.?, తాను చేసిన యాక్సిడెంట్ వల్లే ఇలా జరిగిందని తెలుసుకుంటాడా.?, సిద్ధు రాకతో సిద్ధు జీవితం మళ్లీ గాడిన పడుతుందా.? అనేది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 17th: నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
Nindu Noorella Saavasam Serial Today August 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
Jabardasth Pavithra : జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
Illu Illalu Pillalu Serial Today August 17th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమకి గోరింటాకు పెట్టిన ధీరజ్! చేతి మీద కల్యాణ్ పేరు రాసిందెవరు?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమకి గోరింటాకు పెట్టిన ధీరజ్! చేతి మీద కల్యాణ్ పేరు రాసిందెవరు?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget