Lakshmi Nivasam Serial Today: 'లక్ష్మీ నివాసం' సీరియల్: శ్రీ మరణంతో అంధకారంలో తులసి జీవితం - సిద్ధు ఆమె జీవితంలోకి వస్తాడా?
Lakshmi Nivasam Today Episode: ఆస్పత్రిలో శ్రీని చావు బతుకుల్లో చూసిన తులసి ఫ్యామిలీ తల్లడిల్లిపోతుంది. మరోవైపు, ఖుషీకి సిద్ధు బ్లడ్ ఇచ్చి ప్రాణాలు కాపాడతాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.?

Lakshmi Nivasam Serial Today Episode: శ్రీని ఆస్పత్రిలో చూసిన తులసి, ఆమె కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతారు. శ్రీ పరిస్థితి విషమంగా ఉందంటూ డాక్టర్లు చెబుతారు. మరోవైపు, ఆస్పత్రిలో వీరిని చూసేందుకు వచ్చిన సిద్ధు.. ఖుషీకి బ్లడ్ ఇస్తాడు. ఆస్పత్రిలో సుపర్ణికను భార్గవ్ ఓదారుస్తుండగా.. తన అన్నకు ఏదో దరిద్రం పట్టిందంటూ సుపర్ణిక తులసిని ఉద్దేశించి అంటుంది. దీంతో తులసి తీవ్ర ఆవేదనకు గురవుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ విషయానికొస్తే..
ఖుషి సేఫ్.. సిద్ధు తులసిని చూశాడా..
శ్రీ కళ్లు తెరిచి తులసిని ఏడవద్దంటూ ఓదారుస్తాడు. ఆ తర్వాత మళ్లీ స్పృహ కోల్పోతాడు. ఇదే సమయంలో ఖుషి ఎక్కడంటూ తులసి డాక్టర్స్‌ను అడుగుతుంది. పాపకు బ్లడ్ బాగా లాస్ అయ్యిందని సమయానికి ఓ వ్యక్తి బ్లడ్ ఇచ్చాడని డాక్టర్ చెబుతుంది. పాప సేఫ్ అని.. అయితే కాలికి ఫ్రాక్చర్ కావడం వల్ల నడిచేందుకు టైం పడుతుందని చెబుతుంది. లక్ష్మి,శ్రీనివాస్‌లను పాపను చూసుకోమని చెప్పి తాను వసుంధరను చూసి వస్తానని తులసి వారికి చెబుతుంది.
తులసి వసుంధరను బయటి నుంచి చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుండగా.. సుపర్ణిక సైతం అక్కడే ఉంటుంది. యాక్సిడెంట్ ఎలా జరిగిందంటూ తులసి సుపర్ణికను అడుగుతుంది. ఇంతలో డాక్టర్ బయటకు రాగా.. వసుంధర కండీషన్ సీరియస్‌గా ఉందని ఇప్పుడే ఏం చెప్పలేమని చెబుతాడు. లోపలికి వెళ్లి మాట్లాడాలని వారికి చెబుతాడు.
వసుంధర మరణం.. షాక్‌లో తులసి
తులసిని చూసిన వసుంధర ఖుషి ఎలా ఉందని అడుగుతుంది. శ్రీ దేవుడి లాంటి వాడని తనని జాగ్రత్తగా చూసుకోవాలని వసుంధర తులసితో చెబుతుంది. ఖుషికి అన్నీ ఇక నువ్వేనని.. తనని ఎప్పటికీ వదలనని మాటివ్వాలంటూ తులసిని అడుగుతుంది. తన వద్ద మాట తీసుకుంటుంది. ఇక నుంచి ఖుషి తన కూతురు అని తులసి వసుంధరకు చెబుతుంది. తులసి వద్ద మాట తీసుకుని వసుంధర చనిపోతుంది.
సిద్ధుకు తెలియని నిజం
మరోవైపు, సిద్ధు యాక్సిడెంట్ చేసిన వారిలో ఒకావిడ చనిపోయిందంటూ బసవకు ఫోన్ చేసి చెప్తాడు అతని పీఏ. దీంతో వెంటనే సిద్ధుకు ఫోన్ చేస్తాడు బసవ. ఇక్కడ గొడవ జరుగుతుందని.. వెంటనే రావాలని సిద్ధుకు చెప్తాడు బసవ. అయితే, వారికి ఎలా ఉందో తెలుసుకునేంత వరకూ తాను అక్కడి నుంచి రానని చెప్తాడు సిద్ధు. వెంటనే బసవ పీఏకు ఫోన్ చేసి ఎలాగైనా సిద్ధు నుంచి అక్కడ నుంచి పంపించేయాలని చెప్తాడు.
దీంతో పీఏ ఓ డాక్టర్ ద్వారా వారు సేఫ్‌గా ఉన్నారని సిద్ధుకు అబద్ధం చెప్పిస్తాడు. దీంతో సిద్ధు అక్కడి నుంచి ఇంటికి బయల్దేరతాడు. తాను యాక్సిడెంట్ చేసిన వాళ్లకు ఏం జరుగుతుందోనని చాలా నరకం అనుభవించానని వాళ్లు సేఫ్‌గా ఉండడంతో ఆనందంతో దేవునికి మొక్కుతాడు సిద్ధు. ఈ విషయం బయటకు రాకుండా చూడాలని పీఏకు డాక్టర్ చెబుతాడు.
శ్రీ మరణం.. షాక్‌లో తులసి
ఇదే టైంలో శ్రీ కూడా చనిపోతాడు. అతని డెడ్ బాడీని స్ట్రెచర్‌పై బయటకు తీసుకువస్తారు. శ్రీ చేయి తులసికి తగలగా అలా చూసి తులసి కుప్పకూలిపోతుంది. శ్రీనివాస్, లక్ష్మి, సుపర్ణిక అంతా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇక తులసి జీవితం ఏ మలుపు తిరగబోతుంది. సిద్ధుకు నిజం తెలుస్తుందా.?, సిద్ధు తులసికి దగ్గరవుతాడా.? అనేది తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

