Lakshmi Nivasam Serial Today: 'లక్ష్మీ నివాసం' సీరియల్: 'లక్ష్మీ నివాసం' సీరియల్: తులసి ఇంటికి సిద్ధు.. ఇద్దరూ కలుస్తారా? - జానుతో పెళ్లి కలల లోకంలో జై!
Lakshmi Nivasam Today Episode: లక్ష్మీ, శ్రీనివాస్‌లను జైలు నుంచి ఎవరు బయటకు తీసుకొచ్చారో అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుండగా.. ఖుషీ సుపర్ణిక ఇంట్లో ఇబ్బందులు పడుతుంటుంది. ఈ రోజు ఎపిసోడ్‌లో..

Lakshmi Nivasam Serial Today April 11th Episode: ఖుషీని కిడ్నాప్ చేశారంటూ భార్గవ్, సుపర్ణిక తప్పుడు కేసులు పెట్టడంతో లక్ష్మీ, శ్రీనివాస్‌లను జైలులో పెడతారు. అయితే, ఎవరో ఫోన్ చేయడంతో పోలీసులు వారిద్దరినీ గౌరవంగా ఇంటి వద్ద దించుతారు. దీంతో ఆ ఫ్యామిలీ అంతా ఆనందపడతారు. మరోవైపు, ఖుషీతో పనులు చేయిస్తూ.. భార్గవ్, అతని తల్లి భాగ్యం ఇబ్బందులు పెడుతుంటారు. అటు, గుడికి వెళ్లిన సిద్ధు తులసిని చూసి ఆనందపడతాడు. ఆమెను కలుసుకునే లోపే మిస్ అవుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో..
తులసిని సిద్ధు కలుస్తాడా?
గుడిలో మిస్ అయిన తులసిని జాను, కీర్తితో కలిసి ఆటోలో వెళ్తుండగా సిద్ధు బైక్‌తో వెంబడిస్తాడు. అయితే, వేరే వ్యక్తి అడ్డుగా రావడంతో మళ్లీ తులసి మిస్ అయిపోతుంది. ఇదే సమయంలో ఎలక్షన్ క్యాంపెయిన్‌కు సిద్ధు వెళ్లలేదని తెలుసుకున్న బసవ టెన్షన్ పడుతుంటాడు. సిద్ధు ప్రేమలో పడ్డాడేమో అంటూ బసవ కోడలు నీలిమ అంటుంది. దీంతో ఆమెపై కోప్పడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు బసవ. సిద్ధు ప్రేమలో పడితే అది శాపంగా మారుతుందని.. నీలిమ తన భర్తతో అంటుంది.
అలా తులసిని వెతుక్కుంటూ వెళ్లిన సిద్ధు ఆమె మిస్ కావడంతో విసుక్కుంటాడు. ఇదే సమయంలో లక్ష్మి అతన్ని చూసి తన ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. కాఫీ తాగి వెళ్లాలని సిద్ధును అడుగుతుంది. దీనికి అతను సరే అంటూ లోపలికి వెళ్తాడు. సిద్ధును చూసిన బామ్మ అతన్ని గుర్తు పట్టి దొంగ నుంచి కాపాడినందుకు ప్రశంసలు కురిపిస్తుంది. ఇదే సమయంలో సిద్ధు చెల్లెలు కీర్తి అక్కడకు వస్తుంది. అయితే, సరిగ్గా ఫోన్ రావడంతో సిద్ధుని చూడడం మిస్ అవుతుంది.
ఫోన్లతోనే ఒకరికొకరు మిస్
సిద్ధుకు కాఫీ పెట్టాలని తులసిని లక్ష్మి అడగ్గా.. ఎవరికని అడుగుతుంది. తన ఫ్రెండ్‌కు అని చెబుతుంది లక్ష్మి. అయితే, తనకు పరిచయం చేయాలని తులసి అంటుంది. కాఫీ పెట్టి తీసుకురావాలని చెబుతుంది. ఇదే సమయంలో సిద్ధుకు కీర్తి ఫోన్ చేయగా మాట్లాడడానికి బయటకు వెళ్తాడు. అయితే, ఇంటిపైన కీర్తి.. కింద సిద్ధు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటారు. కానీ అక్కడే ఉన్నట్లు ఇద్దరికీ తెలియదు.
ఈలోపు తులసి కాఫీ తీసుకుని వస్తుంది. అయితే, సిద్ధు ఫోన్ మాట్లాడి వచ్చే లోపు తులసికి ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. లక్ష్మి ఇచ్చిన కాఫీ తాగిన సిద్దు అమృతంలా ఉందంటూ ప్రశంసిస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తులసిని చూడకుండానే వెళ్లిపోతాడు. ఇంతలో ఫోన్ మాట్లాడడం పూర్తైన తులసి.. సిద్ధును చూడడం మిస్ అవుతుంది.
జాను ధ్యాసలో జై
మరోవైపు, తన ఆఫీసులో జాను ధ్యాసలో గడుపుతుంటాడు జై. తన ప్యూన్‌ను పిలిచి తన ఎంప్లాయీస్ అందరినీ పిలుస్తాడు జై. వారితో ఓ గేమ్ ఆడుతాడు. ఓ బౌల్‌లో చీటీలు వేసి అందరినీ తీయమంటాడు. ఓ ఉద్యోగి 'జానుతో పెళ్లి జరగదు' అనే చీటీ తీయగా అతన్ని జాబ్‌లోంచి తీసేస్తాడు. మరో ఉద్యోగి 'జానుతో పెళ్లి జరుగుతుంది.' అని తీయగా వారికి ప్రమోషన్‌తో పాటు బోనస్ ఇస్తాడు. ఇలా అందరి ఎంప్లాయీస్‌తోనూ చేస్తాడు. మరి జానుతో జై పెళ్లికి శ్రీనివాస్ ఫ్యామిలీ ఒప్పుకొంటుందా?, సిద్ధును తులసి ఇంకా రౌడీ షీటర్‌గానే భావిస్తుందా?, చిన్నారి ఖుషి భవిష్యత్తు ఏంటి? తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.






















