అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today January 27th: పెళ్లిచేసుకుని కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన శ్రీలక్ష్మీకి ఎదురైన అనుభవం ఏంటి..? మ్యాడీపై వాళ్ల తాత ఎందుకు చేయి చేసుకుంటాడు.

Lakshimi Raave Maa Intiki Serial Today Episode January 27th: పెళ్లిచేసుకుని కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన శ్రీలక్ష్మీకి ఎదురైన అనుభవం ఏంటి..? మ్యాడీపై వాళ్ల తాత ఎందుకు చేయి చేసుకుంటాడు.

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: సూర్యనారాయణ,ఇందిర బెదిరింపులతో శ్రీలక్ష్మీని అయిష్టంగానే పెళ్లిచేసుకోవడానికి ఒప్పుకున్న మ్యాడీ...పెళ్లిపందిరిలో ఆమె మెడలో మూడుముళ్లు వేస్తాడు. తాళి కట్టడం నుంచి తలంబ్రాలు పోసుకోవడం వరకు అన్నీ తనకు ఇష్టం లేకుండానే చేస్తాడు. మ్యాడీ శ్రీలక్ష్మీని పెళ్లిచేసుకోవడం సూర్యనారాయణ కుటుంబంలో ఎవరికీ నచ్చదు. మొత్తానికి పెళ్లి పూర్తవ్వడంతో అప్పగింతల కార్యక్రమంలో అందరినీ వదిలిపెట్టి వెళ్లేందుకు శ్రీలక్ష్మీ ఏడుస్తూనే ఉంటుంది. సాధారణంగా  అప్పగింతల్లో తల్లిదండ్రులు మాత్రమే బాధపడతారని...కానీ శ్రీలక్ష్మీ వెళ్లిపోతుంటే ఊరు ఊరంతా బాధపడుతోందంటేనే అర్థమవుతోందని శ్రీలక్ష్మీకి ఈ ఊరితో ఉన్న అనుబంధంమని పెద్దయ్య అంటాడు. మేం ఎంత అదృష్టవంతులమో మాకు అర్థమవుతోందని అంటాడు. శ్రీలక్ష్మీ గురించి మీరు ఎవరు బాధపడొద్దని...మీరు ఎలా చూసుున్నారో అంతకన్నా బాగా చూసుకుంటామని అంటాడు. శ్రీలక్ష్మీని మా ఇంటి కోడలుగా కాకుండా మహాలక్ష్మీగా చూసుకుంటామని హామీ ఇస్తాడు. వీలుకుదురినప్పుడల్లా మీ అందరికీ ఫోన్లు చేయిస్తానని అంటాడు. శ్రీలక్ష్మీ కంటి నుంచి ఒక్క కన్నీటిబొట్టు కూడా రాకుండా మా కుటుంబం చూసుకుంటుందని సూర్యనారాయణ చెబుతాడు. కోటేశ్వరరావు, నూకాలు చెప్పి సూర్యనారాయణ బయలుదేరతాడు. వీలుచూసుకుని సిటీకి వస్తే శ్రీలక్ష్మీని మావాళ్లందరికి పరిచయం చేస్తానని చెబుతాడు. శ్రీలక్ష్మీ ఏడూస్తూ కారు ఎక్కుతుంది. అటు మ్యాడీ కూడా కన్నీటితోనే కారు ఎక్కుతాడు. వాళ్ల అక్క జీవితం  ఏమైపోతుందోనని బాధపడుతుంటాడు.
                              తెల్లారేసరికి సూర్యనారాయణ కుటుంబం సిటీకి చేరుకుంటుంది.అంతపెద్ద ఇంటిని ఎప్పుడూ చూడని శ్రీలక్ష్మీ తలపైకి ఎత్తి వాళ్ల బిల్డింగ్‌ చూస్తుంటుంది. సూర్యనారాయణ కిందకు దిగి  శ్రీలక్ష్మీని రమ్మని ఆహ్వానిస్తాడు. ఇదే నీ మెట్టినిల్లు అని చెబుతాడు. యువరాణిలా పెరిగిన ఇంటి అమ్మాయిని తీసుకెళ్లి పల్లెటూరులో ఓ అనామకుడికి కట్టబెట్టి....ఈ పల్లెటూరు బైతును తీసుకొని వచ్చారని సూర్యనారాయణ పెద్దకోడలు హైమావతి అనుకుంటుంది.ఆమెతోపాటు అందరూ తలోమాట అనుకుంటుంటారు.అసలు పల్లెటూరు ముఖమే చూడకూడదని అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఆ పల్లెటూరుునే తీసుకుని వచ్చి ఇంట్లో పెడుతున్నారని అనుకుంటారు. ఇంట్లో ఈ పెద్దాయని నస తట్టుకోలేకపోతుంటే ఇప్పుడు ఈయనకు తోడు  ఈ పల్లెటూరిది తోడయ్యిందని చిన్నకోడలు గుసగుసలాడుతుంది. సింధూ, మ్యాడీని ఆ దేవుడే కాపాడాలని అంటుంది. మ్యాడీ కూడా కారు దిగి వచ్చి ఆమె పక్కనే నిల్చుంటాడు.గుమ్మం వరకు నడిచి వచ్చిన తర్వాత సూర్యనారాయణ వారిని ఆపుతాడు. కొత్త దంపతులకు కనీసం హారతి ఇవ్వరా అని కూతురుపై మండిపడతాడు.  కానీ ఎవరూ ముందుకు కదలరు...ఇంతలోఇందిరా వెళ్లబోతుండగా...సూర్యనారాయణ ఆపుతాడు. మనఇంట్లో దీపం పెట్టడానికి వస్తున్న కోడలికి ఇంటి ఆడపడుచు హారితి ఇవ్వాలని తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ప్రియంవదను వెళ్లి హారతి తీసుకుని రమ్మని చెబుతాడు. దీంతో నేను వెళ్లనని...అది జరగని పని అని అంటుంది. నేను దీనికి హారతి ఇవ్వాలా అంటుంది. దీని మెడలో మ్యాడీ తాళి కట్టడమే ఎక్కువని...దీని ముఖానికి నేను మంగళ హారతి ఇచ్చి స్వాగతం పలకాలా అని అంటుంది.ఆ మాటలకు సూర్యనారాయణకు తీవ్రమైన కోపం వస్తుంది. శ్రీలక్ష్మీ గురించి ఇక్కొక్కమాట జారావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదని హెచ్చరిస్తాడు. నోరుమూసుకుని వెళ్లి చెప్పింది చెయ్యమని అంటాడు. వెళ్లి హారతి పట్టుకుని రా అని ఆదేశిస్తాడు.దీంతో చేసేది లేక ప్రియంవద వెళ్లి హారతి పల్లెంతో వస్తుంది. ఇద్దరికి హారతి  ఇస్తుంది. హారతి ఇచ్చిన ఈ చేతులతోనే నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటకపోతే నా పేరు ప్రియంవదే కాదని మనసులో అనుకుంటుంది.అప్పటికే కోపంతో రగిలిపోతున్న మ్యాడీ....హారతి పళ్లెంను ఎత్తికొడతాడు. దీంతో హారతి పళ్లెం ఎగిరి పక్కనపడుతుంది. దీన్ని చూసిన సూర్యనారాయణ కోపంతో రగిలిపోయి మధుసూదన్ చెంప పగులగొడతాడు. 

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
Podarillu Serial Today August 15th:చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ.
పొదరిల్లు: చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget