Lakshimi Raave Maa Intiki Serial Today January 21th: బుల్లిరాజుతో శ్రీలక్ష్మీపెళ్లి జరుగుతుందా లేదా..? సింధూను తప్పించేందుకు మ్యాడీ మళ్లీ ఎలాంటి ప్లాన్ వేస్తాడు..?
Lakshimi Raave Maa Intiki Serial Today Episode January 21th:బుల్లిరాజుతో శ్రీలక్ష్మీపెళ్లి జరుగుతుందా లేదా..? సింధూను తప్పించేందుకు మ్యాడీ మళ్లీ ఎలాంటి ప్లాన్ వేస్తాడు..?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: ఇల్లు వదిలి వెళ్లిపోతున్నందుకు బాధపడుతున్న శ్రీలక్ష్మీని చూసి వాళ్ల నాన్న కోటేశ్వరరావు ఓదార్చుతాడు. ఆడపిల్ల ఎప్పటికీ పుట్టింట్లో ఉండటం సాధ్యం కాదని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన నూకాలు మొగుడిపై కోప్పడుతుంది. లక్ష్మీ ఏమైనా పరాయిదేశం పోతుందా అని మండిపడుతుంది. పక్క ఊరికే కదా వెళ్తుంది అని అంటుంది. తెల్లారగానే శ్రీలక్ష్మీ పెళ్లిపనులు చకచకా జరిగిపోతుంటాయి. పెళ్లిమండపంల వద్ద ఊరిలో అందరూ వస్తుంటారు. శ్రీలక్ష్మిని పెళ్లి కుమార్తెగా రెడీ చేస్తారు. ఊరిలో అందరితో కలివిడిగా ఉండే శ్రీలక్ష్మీ పెళ్లిచేసుకుని వెళ్లిపోతుంటే అందరూ వచ్చి చాలా బాధపడతారు. ముసలివాళ్లందరినీ ఓ సంఘంగా ఏర్పాటు చేసి మా బాగోగులు ఇన్నాళ్లు చూసుకున్నావని...ఇకపై మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారంటూ వాళ్లు కన్నీరు పెట్టుకుంటారు. మాకు వచ్చే ఉత్తరాలన్నీ ఇకపై ఎవరు చదివిపెడతారంటూ ఏడుస్తారు. వాళ్లు కన్నీరు పెట్టుకోవడంతో శ్రీలక్ష్మీ కళ్లల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. శ్రీలక్ష్మీ దగ్గర ట్యూషన్‌కు వచ్చే పిల్లలు సైతం వచ్చి తమను వదిలి వెళ్లిపోవద్దంటూ బ్రతిమిలాడుతుంటారు.పెళ్లికి వచ్చే అతిథులను కోటేశ్వరరావు, నూకాలు పలకరిస్తుంటారు.
ముందుగా గోపి కుుటుంబం రాగానే....ఇంతసేపటికా వచ్చేది అని నూకాలు వాళ్ల అక్కపై కోప్పడుతుంది. ఇంటికి కొత్తకోడలు వచ్చిందని...ఆమెకు అసలు మన తిండి,నీళ్లు వంటబట్టడం లేదని...ఆవిడగారు రెడీ అయ్యి వచ్చేసరికి ఈ వేళ అయ్యిందని అంటుంది. సరేసర్లే వెళ్లి కూర్చండంటూ నూకాలు వాళ్లను లోపలికి తీసుకెళ్తుంది. మావాళ్లు ఇంకా రాలేదేంటి అని సింధూ ఎదురుచూస్తుండగానే సూర్యనారాయణ ఫ్యామిలీ పెళ్లి ఇంట్లోకి అడుగుపెడుతుంది. సింధూ పరుగున వెళ్లి వాళ్ల అమ్మానాన్ను వాటేసుకుంటుంది. అందరూ కలిసి పెళ్లి ఇంట్లోకి వెళ్తుండగా....సింధూ మ్యాడీ దగ్గరకు వెళ్లి నన్ను ఎప్పుడు తీసుకెళ్తావని అడుగుతుంది. ఈ పెళ్లి అయిపోయేసరికి నిన్ను ఈ ఊరి నుంచి పంపించేస్తానని అంటాడు. అయితే ఇప్పుడే వెళ్లిపోదామని సింధూ అనగా....మనల్ని ఇంతలా ఏడిపించిన ఆ ఎర్రబస్సు బతుకు బుగ్గిపాలు అవుతుంటే చూడకుండా ఎలా వెళ్తామని అంటాడు. ఈ లక్ష్మీని పెళ్లిచేసుకోబోయేవాడు పెద్ద తాగుబోతు,తిరుగుబోతని వాడితో పెళ్లి అయితే దీని బతుకు నాశనమేనని అంటాడు. ఆ పండుగను కళ్లారా చూడకుండా ఎలా వెళ్తామని అంటాడు. అప్పుడే మేళతాళాలతో వచ్చిన బుల్లిరాజును చూసి అక్కా, తమ్ముడు నవ్వుకుంటారు. అక్కా,తమ్ముడు ఇద్దరూ గుసగుసలాడుకుంటుంటే మంగకు,వాళ్లఅమ్మకు అనుమానం వస్తుంది.వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారని అనుకుంటారు. మంగను వెళ్లి చూసి రమ్మంటే వాళ్ల దగ్గర చోటు లేదని ఎలా వెళ్లి చూడనని మంగ అంటుంది.ఇదే విషయం గోపిని పిలిచి వాళ్ల చెబితే గోపి వాళ్లనే తిడతాడు. అక్కా తమ్ముడు అన్న తర్వాత వాళ్ల మధ్య ఎన్నో విషయాలు ఉంటాయని...అవన్నీ మనకు ఎందుకు అని వాళ్ల అమ్మపై మండిపడతాడు. పంతులుగారు ముహూర్తానికి సమయం అయిపోతుందని చెప్పడంతో బుల్లిరాజు వెళ్లి పెళ్లిపీటలమీద కూర్చుంటాడు. శ్రీలక్ష్మీ వచ్చి సూర్యనారాయణ దంపతుల కాళ్లకు మొక్కి వెళ్లి పెళ్లిపీటలపై కూర్చుంటుంది.
Before You Go
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
ట్రెండింగ్ వార్తలు






















