Lakshimi Raave Maa Intiki Serial Today January 19th: శ్రీలక్ష్మీ పెళ్లిముహూర్తం ఖరారు...? పెళ్లయ్యే వరకు ఉండి తీరాల్సిందేనని సూర్యనారాయణను కోరిన శ్రీలక్ష్మీ
Lakshimi Raave Maa Intiki Serial Today Episode January 19th:శ్రీలక్ష్మీ పెళ్లిముహూర్తం ఖరారు...? పెళ్లయ్యే వరకు ఉండి తీరాల్సిందేనని సూర్యనారాయణను కోరిన శ్రీలక్ష్మీ

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: శ్రీలక్ష్మీకి, బుల్లిరాజుకు ఎంగేజ్‌మెంట్ అవుతుంది. కోటేశ్వరరావు మరోసారి శ్రీలక్ష్మీ చదువు గురించి కాబోయే అల్లుడి దగ్గర ప్రస్తావించగా....తప్పకుండా పెద్ద చదువులు చదివిస్తానని అంటాడు. ఆ తర్వాత బుల్లిరాజు వాళ్లు వెళ్లిపోగానే..పెద్దయ్య ఆశీర్వాదం తీసుకుని వద్దామంటూ శ్రీలక్ష్మీని కోటేశ్వరరావు తీసుకుని వెళ్తాడు.
రాత్రి సింధూను తప్పించలేకపోయినందుకు మ్యాడీ చాలా బాధపడుతుంటాడు. అంతలోనే సూర్యనారాయణ పట్నం వెళ్లిపోవడానికి రెడీ అవ్వమని ఆదేశించడంతో ఇంట్లో అందరూ బట్టలు సర్దుకుంటారు. ఇక్కడ అక్కడ ఎలా ఉంటుందని మ్యాడీ బాధపడుతుంటాడు. అక్కను ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పిస్తానని మాట ఇచ్చానని....ఆ పనిచేయకపోతే తను చనిపోతానని బెదిరిస్తోందని అత్త ప్రియంవదతో అంటాడు. ఎలాగైనా తాతయ్యను ఒప్పించి మనం ఇక్కడే మరో రెండురోజులు ఉండేలా చేయాలని బ్రతిమలాడతాడు. నా ప్రయత్నం నేను చేస్తానంటూ ప్రియంవద్ద సూర్యనారాయణ దగ్గరకు వెళ్లి మరో రెండురోజులు ఉండి వెళ్దామని కోరుతుంది. కొత్త ఇంట్లో సింధూ ఎలా ఉంటుందోనని బెంగగా ఉందని తనకు ఇక్కడి వాతావరణం కొంచెం అలవాటు అయ్యేవరకు ఉండి వెళ్దామని అంటుంది. దీనికి సూర్యనారాయణ కోప్పడతాడు. సింధూ ఆ ఇంట్లో అలవాటుపడటానికే కదా మనం ఇక్కడ నుంచి త్వరగా వెళ్లిపోతోందని అంటాడు. మీరు ఎవరూ సింధూ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని...మనం ఇక్కడ లేకపోతేనే తను ఇక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటుపడిపోతుందని చెబుతుంది.ఇప్పుడే అందరూ వెళ్లిపోదామంటూ తేల్చిచెబుతాడు.
మ్యాడీ ఎలాగైనా ఈ ఇంటి నుంచి తప్పిస్తాని మాట ఇచ్చాడు కదా ఎలా తీసుకెళ్తాడా అని సింధూ ఆలోచిస్తుండగా...మంగవచ్చి టిఫిన్ చేయడానికి రా వదినా అంటూ ఆమెను లాక్కుని వస్తుంది. డైనింగ్ టేబుల్ లేదని..అందరం కింద కూర్చుని తినాల్సిందేనని అంటుంది. సింధూవాళ్ల అత్తచేసిన ఉప్మాచూసి సింధూకు భయం వేస్తుంది. ఇంతలో బయట నుంచి గోపి కొత్త ఫ్యాన్, టిఫిన్ తీసుకుని వస్తాడు. మా గదిలో ఫ్యాన్ పాతది అయిపోయిందని దోమలు కుట్టి రాత్రంతా సింధూ పడుకోలేదని అందుకే కొత్త ఫ్యాన్ తీసుకొచ్చానని చెబుతాడు. మరి మా గదిలో ఫ్యాన్ కూడా మార్చలేదేంటని వాళ్ల అమ్మ మొహం మాడ్చుకుంటుంది.ఇంతలో గోపి తీసుకొచ్చిన ఇడ్లీలు, ఉప్మా కలుపుకుని మంగతినే తిండి చూసి సింధూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
సూర్యనారాయణ తన ఫ్యామిలీతో బయటకు రాగానే శ్రీలక్ష్మీ ఆశీర్వాదం కోసం ఎదురువస్తుంది. కోటేశ్వరరావు రేపే శ్రీలక్ష్మీ పెళ్లి పెట్టుకున్నామని మీరంతా ఉండి ఆశీర్వదించి వెళ్లాలని అంటాడు. ఇంత త్వరగా ఎందుకు పెట్టుకున్నారని అంటే రేపు తప్పితే మళ్లీ 6నెలల వరకు ముహూర్తాలు లేవని పెట్టుకున్నామని అంటాడు. ఇదే అదునుగా మ్యాడీ రెచ్చిపోతాడు. లక్ష్మీపెళ్లిఅడ్డం పెట్టుకుని ఇక్కడే ఉండిపోవడానికి ప్లాన్ వేస్తాడు. మా అక్క పెళ్లిలో గోలగోల చేసిన నీ పెళ్లి చూడకుండా మేం ఎక్కడికి పోతాం అని అంటాడు. దీంతో సూర్యనారాయణ కూడా తప్పకుండా పెళ్లి చూసే ఇక్కడి నుంచి వెళ్తామని శ్రీలక్ష్మీతో చెబుతాడు.





















