Lakshimi Raave Maa Intiki Serial Today January 15th: గోపీ, సింధూ ఫస్ట్‌నైట్‌రోజు ఏం జరిగింది..? మ్యాడీ వాళ్ల అక్కను ఇంట్లో నుంచి తప్పించాడా.?
Lakshimi Raave Maa Intiki Serial Today Episode January 15th:గోపీ, సింధూ ఫస్ట్‌నైట్‌రోజు ఏం జరిగింది..? మ్యాడీ వాళ్ల అక్కను ఇంట్లో నుంచి తప్పించాడా.?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: కొత్త ఇంట్లో సింధూ ఎలాంటి ఇబ్బందులు పడుతుందోనని ఆమె తల్లిదండ్రులతోపాటు పిన్ని, బాబాయి చాలా కంగారుపడుతుంటారు. ఇంతలో అక్కడి నుంచి వచ్చిన మ్యాడీ, పిల్లలను అడుగుతారు. అసలు అది ఇల్లే కాదని...పశువుల కొట్టం కన్నా హీనంగా ఉందని అంటారు. దోమలు రక్తం పీల్చేస్తున్నాయని...ఇల్లంతా పేడ వాసన వస్తోందని అంటారు. అటాచ్‌డ్ బాత్‌రూం కూడా లేదని....బయట కామన్ బాత్‌రూం మాత్రమే ఉందని అంటాడు. ఆ ఇల్లు మొత్తం కలిపినా మన బాత్‌రూం కన్నా తక్కువే ఉందని అంటారు. మేం ఒక్కరోజు కూడా అక్కడ ఉండలేకపోయామని....మరి అక్క జీవితాంతం ఎలా ఉంటుందోనని మరింత కంగారు పెట్టిస్తారు. ఇంతలో ప్రియంవద అందుకుని అందుకే నా మేనకోడలికి ఈ పల్లెటూరు సంబంధం వద్దని మొత్తుకున్నా వినలేదని మండిపడుతుంది.నాన్నగారు తన పంతం నెగ్గించుకోవడానికే ఈ సంబంధం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సింధూ ఆస్ట్రేలియా వెళ్లాలని ఎన్నో కలలు కన్నదని....మొత్తం నాశనం చేశారని కోప్పడుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన సూర్యనారాయణ ఆమెపై మండిపడతాడు. సింధూ మన ఇంటిలో కన్నా ఇక్కడే చాలా ఆనందంగా ఉంటుందని చెబుతాడు. ఒకసారి పల్లెటూరిలో ప్రేమలకు అలవాటుపడితే మనం గుర్తుకు రామని అంటాడు.పట్నంలో పెరిగి వచ్చింది కాబట్టి కొంత సర్దుకుపోవడానికి సమయం పడుతుందని....గోపీపై నాకు చాలా నమ్మకం ఉందని తనను బాగా చూసుకుంటాడని అంటాడు. మనం ఇక్కడే ఉంటే...తను అక్కడ కుదురుగా ఉండలేదని కాబట్టి రేపు ఉదయం అందరూ తిరిగి వెళ్లిపోవాలని బట్టలు సర్దుకుని రెడీ అవ్వమని చెబుతాడు. కొన్ని రోజులు ఉండి వెళ్తామని చెప్పినా....సూర్యనారాయణ వినడు. మనం ఇక్కడే ఉండే మీరంతా కలిసి తనకు లేనిపోనివి చెప్పి చెడగొడతాడని రేపు ఉదయం అందరూ వెళ్లిపోవాల్సిందేనని గట్టిగా హెచ్చరిస్తాడు.
రేపు ఉదయం వెళ్లిపోవాలంటే ఖచ్చితంగా ఈరాత్రికి అక్కను అక్కడి నుంచి తప్పించాలని....లేకపోతే ఆత్మహత్య చేసుకుంటుందని మ్యాడీ భయపడతాడు. కాబట్టి ఈ రాత్రికి ఆమెను ఊరు దాటించాలని పథకం వేస్తాడు. మరోవైపు గోపీ, సింధూజాక్షికి తొలిరాత్రికి ఏర్పాట్లు చేస్తుంటారు. మహాలక్ష్మీ సింధూజాక్షిని అందంగా రెడీ చేస్తుంది. పాత విషయాలన్నీ మర్చిపోయి ఆనందంగా ఉండమని వదినకు చెబుతుంది. మా అన్నయ్య నిన్ను చాలా బాగా చూసుకుంటాడని వివరిస్తుంది.ఇంతలో మ్యాడీ ఫోన్ చేసి వాళ్ల అక్కకు విషయం చెబుతాడు. నేను రాత్రికి కారు తీసుకుని రెడీగా ఉంటానని....నీకు ఫోన్ చేసినప్పుడు బయటకు వచ్చేయమని చెబుతాడు.
ఫస్ట్‌నైట్‌కు ముహూర్తం కావడంతో సింధూజాక్షిని గోపి గదిలోకి పంపించి తలుపులు వేస్తారు. గోపీ తాను చిన్నప్పటి నుంచి నిన్నే ప్రేమిస్తున్నానని....నీ వస్తువులన్నీ భద్రంగా దాచిపెట్టుకున్నాని వాటిని సింధూజాక్షికి చూపిస్తాడు. నిజంగా నువ్వు నన్ను ప్రేమించి ఉంటే...ఈ పెళ్లి నాకు ఇష్టమో కాదో కనుక్కుని ఉండేవాడివని సింధూ అంటుంది. పెద్దయ్యగారు పెళ్లికి ముహూర్తం పెట్టించే సరికి నిన్ను అడిగే...నీ అనుమతితోనే పెట్టించారని అనుకున్నానంటాడు. కానీ నీవు పెళ్లికి రెడీగా లేవన్న సంగతి నాకు తెలియదంటాడు.అలాగే ఈ ఫస్ట్‌నైట్ కూడా నాకు తెలియకుండా ముహూర్తం పెట్టించారని చెబుతాడు. కానీ నీకు ఇష్టం లేకుండా ఇక్కడ ఏం జరగదని...నువ్వు మనస్పూర్తిగా సిద్ధం అయిన తర్వాతే మన ఫస్ట్‌నైట్ జరుగుతుందని చెప్పి తాను చాపమీద పడుకుంటాడు. ఇంతలో అర్థరాత్రి మ్యాడీ ఫోన్ చేయడంతో చప్పుడుకాకుండా పారిపోయేందుకు సింధూజాక్షి బయటకు వస్తుంది.





















