అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today February 9th: రిసెప్షన్‌కు రాకుండా తప్పించుకోవాలని మ్యాడీ వేసిన ఎత్తులను శ్రీలక్ష్మీ ఎలా చిత్తు చేసింది..?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode February 9th: రిసెప్షన్‌కు రాకుండా తప్పించుకోవాలని మ్యాడీ వేసిన ఎత్తులను శ్రీలక్ష్మీ ఎలా చిత్తు చేసింది..?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: శ్రీలక్ష్మీతో  పెళ్లి జరిగిన విషయం మన వాళ్లందరికీ తెలియదు కాబట్టి సరిపోయింది కానీ లేకుంటే నా పరువు మొత్తం పోయేదని మ్యాడీ వాళ్ల అత్తయ్య ప్రియంవదతో అంటాడు. ఆ ఎర్రబస్సు నా భార్య అన్న సంగతి ఎవరికీ తెలియకుండా నువ్వే చూసుకోవాలి అత్తయ్యని అంటాడు. ఈ మాటలన్నీ సూర్యనారాయణ వింటాడు. ఓహో మీరు ఇలా ఆలోచిస్తున్నారా మీ పని చెబుతా ఉండండని వెళ్లిపోతాడు. ఇంట్లో అందరినీ పిలుస్తాడు. మ్యాడీ తల్లిదండ్రులను పిలిచి మీ కొడుకు పెళ్లిపై మీరు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారని...బంధుమిత్రులందరినీ పిలిచి గ్రాండ్‌గా పెళ్లి చేయాలని కలలు కని ఉంటారని....కానీ  నా నిర్ణయం వల్ల అవన్నీ తలకిందులయ్యాయని అంటాడు. మీ బాధ నేను అర్థం చేసుకోగలనని అందుకే మన బంధువులు, మిత్రులు అందరినీ పిలిచి మ్యాడీ, శ్రీలక్ష్మీ వివాహ రిసెప్షన్‌ గ్రాండ్‌గా చేద్దామని అంటాడు. ఆ మాటాలు విన్న మ్యాడీతోపాటు ప్రియంవద అందరూ ఆశ్చర్యపోతారు. అందుకే  రేపే వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేశానని అంటాడు. దీంతో మ్యాడీ మరింత కంగుతింటాడు. ఇప్పుడు నాకు పెళ్లయ్యిందన్న విషయం అందరికీ తెలిస్తే నా పరువు పోతుందని అందుకే రిసెప్షన్ వద్దని అంటాడు. కానీ సూర్యనారాయణ రేపే వివాహ పరిచయం వేదిక ఏర్పాటు చేయాలని అంటాడు. ఇద్దరు కొడుకులను దగ్గర ఉండి ఈ పనులు చూసుకోవాల్సిందిగా ఆదేశిస్తాడు. ఇప్పటికిప్పుడు అంటే ఊరి నుంచి మా అమ్మానాన్నలు రాలేరు కదా పెద్దయ్య అని  శ్రీలక్షీ అంటే అవన్నీ నేను చూసుకుంటానులేమ్మా అని చెప్పి వెళ్లిపోతాడు. శ్రీలక్ష్మీ అమ్మానాన్నలకు ఫోన్‌ చేసి మీరు తప్పకుండా రావాలని సూర్యనారాణయ చెబుతాడు.
                ఇంట్లో ఏ పనులు చేయకుండా కూర్చుని ఫోన్ చూసుకుంటున్న సింధూజాక్షిపై ఆమె అత్త, ఆడపడుచు మండిపతారు. పూటకు రెండు చీరలు విడిచి పడేస్తే ఎవరు ఉతుకుతారని అంటారు. ఇవన్నీ ఉతకడం నావల్లకాదని కావాలంటే డబ్బులు పడేస్తాం మీరే ఉతకండని అనడంతో ఆమె కోడలపై తీవ్ర కోపంతో మండిపడుతుంది. ఇంతలో గోపీ అక్కడికి వచ్చి ఏం జరిగిందని ఆరా తీస్తాడు. మీ ఆవిడ ఏం పనులు చేయకుండా కూర్చుంటే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారని వాళ్ల అమ్మ మండిపడుతుంది. అయినా నువ్వు ఇంతపొద్దున్నే ఎక్కడికి వెళ్లావని అడుగుతుంది. ఇవాళ మ్యాడీ. శ్రీలక్ష్మీ రిసెప్షన్‌ ఉందని...సూర్యనారాయణగారు ఫోన్‌ చేస్తే బాబాయి, పిన్నిని ఫ్లైట్‌ ఎక్కించి రావడానికి వెళ్లానని చెబుతాడు. ఆ మాటలు విన్న సింధూ షాక్‌కు గురవుతుంది. అసలు మ్యాడీ ఈ రిసెప్షన్‌కు ఎలా ఒప్పుకున్నాడని కంగారుగా ఫోన్‌ చేయడానికి పరుగుతెత్తుతుంది.
                           మ్యాడీ, శ్రీలక్ష్మీ పెళ్లి రిసెప్షన్‌ ఏర్పాట్లు ఘనంగా సాగుతుంటాయి. ఇంతలో ప్రియంవద అక్కడికి వచ్చిఈ రిసెప్షన్‌కు ఎలా వస్తావని మ్యాడీని అడుగుతుంది. నేను రిసెప్షన్‌కు రావడం లేదని...తప్పించుకుని పబ్‌కు వెళ్తున్నానని అంటాడు. ఆ మాటలన్నీ శ్రీలక్ష్మీ వింటుంది. మ్యాడీ వాళ్ల అత్తయ్య వాళ్లు వెళ్లిపోగానే...మ్యాడీ వద్దకు వచ్చి రిసెప్షన్ తప్పించుకోవడానికి ఎత్తులు వేస్తున్నారా అని మండిపడుతుంది. మీరు రాకపోతే అందరి ముందు మీ తాతయ్య పరువు ఏమైపోతుందని అంటుంది. వాళ్లు నా గురించి ఆలోచించనప్పుడు నేను ఎందుకు వాళ్ల గురించి ఆలోచిస్తానని మ్యాడీ అంటాడు. దీంతో నీ పని చెబుతా ఉండు అంటూ...అతను పబ్‌కు వెళ్లడానికి రెడీ చేసుకున్న డ్రెస్‌, ఫోన్ తీసుకుని గదిలో నుంచి బయటుకు పరుగెడుతుంది. బయట గదికి తాళం వేసి తాళం చెవి తన దగ్గర పెట్టుకుంటుంది.

 

 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 6th:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మాధవ్‌ కోసం వెతుకులాట... ఇంతకీ మాధవ్‌ ఎక్కడున్నాడు..?ఎవరికి దొరికాడు..?
పొదరిల్లు: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మాధవ్‌ కోసం వెతుకులాట... ఇంతకీ మాధవ్‌ ఎక్కడున్నాడు..?ఎవరికి దొరికాడు..?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 6th:సుందరి చిట్టికాదని విక్కీకి అనుమానం....డీఎన్‌ఏ టెస్ట్‌కోసం విక్రమ్ ఏం చేశాడు...?
నువ్వులేక నేను లేను: సుందరి చిట్టికాదని విక్కీకి అనుమానం....డీఎన్‌ఏ టెస్ట్‌కోసం విక్రమ్ ఏం చేశాడు...?
Karthika Deepam 2 Serial Today August 6th: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ దూరం పెట్టడంతో పిచ్చెక్కిపోతున్న జ్యోత్స్న! ఆస్తి మొత్తం తనదే.. కానీ..?
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ దూరం పెట్టడంతో పిచ్చెక్కిపోతున్న జ్యోత్స్న! ఆస్తి మొత్తం తనదే.. కానీ..?
Gundeninda Gudigantalu August 6th:రోహిణిని జుట్టుపట్టి ఈడ్చుకుంటూ వచ్చి గెంటేసిన ప్రభావతి...భార్యను మళ్లీ తీసుకురానన్న మనోజ్‌
గుండెనిండా గుడిగంటలు:రోహిణిని జుట్టుపట్టి ఈడ్చుకుంటూ వచ్చి గెంటేసిన ప్రభావతి...భార్యను మళ్లీ తీసుకురానన్న మనోజ్‌

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget