అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today February 16th: శ్రీలక్ష్మీ కాలేజీ అడ్మిషన్‌ లెటర్‌ కాల్చివేసిన ప్రియంవద....కాలేజీకి వెళ్లిన మ్యాడీకి లక్ష్మీ ఎలాంటి షాక్‌ ఇచ్చింది..?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode February 16 th: శ్రీలక్ష్మీ కాలేజీ అడ్మిషన్‌ లెటర్‌ కాల్చివేసిన ప్రియంవద....కాలేజీకి వెళ్లిన మ్యాడీకి లక్ష్మీ ఎలాంటి షాక్‌ ఇచ్చింది..?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: ఇంట్లోనుంచి వెళ్లిపొమ్మన్నా ఇంకా ఎందుకు ఉన్నావని శ్రీలక్ష్మిని మ్యాడీ నిలదీస్తాడు.వెళ్లిపోదామని అనుకుని పెద్దయ్యగారి దగ్గరకు వెళ్లానని...ఆయనకు చెప్పి వెళ్లిపోదామని వెళ్లానని అంటుంది. అక్కడికి వెళ్లిన తర్వాత జరిగిన విషయం మొత్తం మ్యాడీకి వివరిస్తుంది. తాను ఇంటిపై బెంగతో వెళ్లిపోతున్నానని ఇక్కడ ఇమడలేకపోతున్నానని చెప్పానని...దానికి ఆయన పెళ్లైన కొత్తలోఅందరి అమ్మాయిలకు ఇలాగే ఉంటుందని, తర్వాత పరిస్థితులు సర్దుకుంటాయని చెప్పారన్నారు. అయనా ఊరిలో నేను చూసిన లక్ష్మీ  ఈ లక్ష్మీ ఒకటి కాదని సూర్యనారాయణ అంటాడు. ఆ లక్ష్మీ సమస్యలు ఎదురైతే పిరికిదానిలా పారిపోదాని...ధైర్యంగా ఎదుర్కొంటుందని అంటాడు. నేను పారిపోవాలని అనుకోవడం లేదని మీతో చెప్పి గౌరవంగానే మాఇంటికి వెళ్లిపోదామని అనుకుంటున్నానని లక్ష్మీ వివరిస్తుంంది. పెళ్లయిన ఆడపిల్ల పుట్టింటికి వెళ్తే భర్తతోనే కలిసి వెళ్లాలని....లేదా ఏదైనా విశేషం ఉంటేనే వెళ్లాలని సూర్యనారాయణ చెబుతాడు. ఇలా వెళ్తే నీకు, మాకు గౌరవంగా ఉండదని చెబుతాడు. నీ మనసుకు ఏదైనా కష్టం వస్తే...నీకు ఇష్టమైన దానివైపు మళ్లించని అప్పుడే అన్ని సర్దుకుంటాయని అంటాడు. నాకు ఇష్టమైనదని ఏం ఉంటుందని అనగా...నీకు చదువు అంటే చాలా ఇష్టం కదా...పెళ్లి తర్వాత కూడా చదువుకోవాలని అనుకున్నావ్ కదా...ఇప్పుడు  అది కొనసాగించమని చెబుతాడు. ఎలాగూ పట్నం వచ్చి చదువుకోవాలని కలలు కన్నావు కాబట్టి...ఇక్కడే ఉండి ఆ కలను సాకారం చేసుకోమని చెబుతాడు.దీంతో శ్రీలక్ష్మీ ఆనందానికి అవుదులు ఉండవు. మ్యాడీ కూడా  ఎంబీఏ చేయడానికి సిటీ కాలేజీలో జాయిన్ అవ్వబోతున్నాడని..ఎలాగూ నీకు అదే కాలేజీలో సీటు వచ్చింది కాబట్టి ఇద్దరూ వెళ్లి హాయిగా చదువుకుని రండని చెబుతాడు. ఇదే విషయాన్ని మ్యాడీకి లక్ష్మీ చెబుతుంది.
                       శ్రీలక్ష్మీ మాటలు విని మ్యాడీ షాక్‌కు గురవుతాడు.అంటే ఇప్పుడు నువ్వు నాతోపాటు కాలేజీకి వస్తావా అని అంటాడు. అవునని అంటుంది. మీరే కదా నేను ఇంట్లో ఉంటే నచ్చడం లేదని చెప్పారు. అందుకే మీ కళ్లకు కనపడకుండా నేను  కాలేజీకి వెళ్లిపోతానని అంటుంది. రాత్రి ఈ ఎర్రబస్సును అసలు గెలకకుండా ఉండాల్సింది.ఇంట్లోనేపడి చచ్చేది...ఇప్పుడు నాతో పాటు కాలేజీకి వస్తే అందరికీ తెలిసిపోతుందని మ్యాడీ ఫీలవుతుంటాడు. ఎట్టిపరిస్థితుల్లో నువ్వుకాలేజీకి  రావడానికి వీల్లేదని అంటాడు. నేను పెద్దయ్యగారికి మాటిచ్చానని ఇప్పుడు వెనక్కి తీసుకోలేనని అంటుంది.ఇంతలో మ్యాడీ వాళ్ల  పిన్ని సుకన్య కలగజేసుకుని పెళ్లయిన తర్వాత అమ్మాయిలు ఎక్కడైనా చదువుకుంటారా అని అంటుంది.ఇంట్లో  ఉండి  ఇంటి పనులు చూసుకోవడమే గౌరవమని చెబుతుంది.అలా ఏం  లేదని ఆడపిల్లలు ఇంటిపనులతో పాటు చదువు కొనసాగించవచ్చని చెబుతుంది. మ్యాడీవాళ్ల అమ్మ కల్పించుకుని ఆడపిల్ల పుట్టింట్లో ఎలా ఉన్నా...మెట్టినింట్లో మాత్రం ఆ ఇంటి గౌరవం నిలబెట్టేలా ఉండాలని,నువ్వు ఇప్పడుు కాలేజీకి అని తిరిగితే ఈ ఇంటి గౌరవం పోతుందని అంటుంది. మీ ఇంటి గౌరవం తగ్గకుండా, మ్యాడీ గౌరవం పోకుండా ఇంటిపనులన్నీ చూసుకున్న తర్వాత నేను కాలేజీకి వెళ్తానని అంటుంది. ఇంతంలో ప్రియంవద కల్పించుకుని నీ ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావేంటని మండిపడుతుంది. నువ్వు మా మేనల్లుడితోపాటు కాలేజీకి వెళ్లడం నాకు ఇష్టం లేదని ఇంట్లోనే పడి ఉండమని హెచ్చరిస్తుంది.అయినా సరే తాను వెళ్తానని అనడంతో  అడ్మిషన్‌ లెటర్‌ తీసుకునికాల్చిపడేస్తుంది.
                           కాలేజీకి టైం అవుతుందని మ్యాడీ వెళ్లిపోవడంతో శ్రీలక్ష్మీ మాత్రం ఇంట్లోనే ఏడుస్తూ కూర్చుంటుంది. తన ప్రెండ్స్ మొత్తం కాలేజీకి రావడంతో వాళ్లతో కలిసి హుషారుగా క్లాస్‌లకు వెళ్లడానికి మ్యాడీ సిద్ధమవుతుండగా...అప్పుడే వాళ్ల తాతయ్య కారు అక్కడికి రావడం చూసి భయపడతాడు.ఇంట్లోజరిగిన విషయం మొత్తం శ్రీలక్ష్మీ తాతయ్యకు చెప్పేసిందా అని ఆయన చూడకుండా దాక్కుంటాడు. త్రిషసహా ప్రెండ్స్ మొత్తం ఏమైందని అడిగితే తర్వాత చెబుతానని అంటాడు.ఇంతలో సూర్యనారాణ శ్రీలక్ష్మీతో సహా కారు దిగుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఓ ప్రొఫెసర్‌ సూర్యానారాయణను చూసి ఈ అమ్మాయి ఎవరండీ మీ ఇంట్లో ఎప్పుడూ చూడలేదని అడుగుతాడు. ఈ అమ్మాయి మా మధుసూదన్ భార్యని చెప్పడంతో త్రిషతోపాటు మ్యాడీ ప్రెండ్స్‌ నోళ్లు వెళ్లబెడతారు.

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget