Lakshimi Raave Maa Intiki Serial Today December 31th: శ్రీలక్ష్మీని ఇరకాటంలో పెట్టేందుకు మ్యాడీ ఏం చేశాడు...? అర్థరాత్రి రోడ్డుపై శ్రీలక్ష్మీని అటకాయించెదెవరు..?
Lakshimi Raave Maa Intiki Serial Today Episode December 31th: భోజనాల వద్ద మ్యాడీ చెవిలో ఉన్న ఇయర్‌బడ్స్ తీసి లక్ష్మీ పక్కనపెడుతుంది. వాటిని మ్యాడీ దాచిపెట్టిన శ్రీలక్ష్మిని అడుగుతాడు.

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: సింధూను ఈరోజు రాత్రికే ఆస్ట్రేలియా పంపించేందుకు ప్లాన్ గురించి వాళ్లకు చెబుతుండగా...అప్పుడే ఆ గదిలోకి లక్ష్మీ రావడంతో మ్యాడీ కంగారుపడిపోతాడు. తాను మొత్తం విని ఉంటుందని భయపడతాడు. కానీ భోజనాలు చేయడానికి శ్రీలక్ష్మీ పిలవడంతో మ్యాడీ కాస్త ఊపిరి పీల్చుకుంటాడు. ఊళ్లోవాళ్లందరితో కలిసి సూర్యనారాయణ కుటుంబం సహఫంక్తి భోజనానికి సిద్ధమవుతారు. తమకు కింద కూర్చుని తినే అలవాటు లేదని మ్యాడీ, సింధూ చెప్పగా...కూర్చుని తింటే అదే అలవాటు అవుతుందని సూర్యనారాయణ గద్దిస్తాడు. దీంతో చేసేది లేక అందరూ కింద కూర్చుంటారు. లక్ష్మీ అందరికి విస్తర్లు వేసి భోజనాలు వడ్డిస్తుంది. ఇంతలో మ్యాడీ ఇయర్ ఫోన్ పెట్టుకుని కాల్ మాట్లాడుతుండగా...లక్ష్మీ వాటిని తీసి కిందపెడుతుంది. అన్నం తినేప్పుడు ఫోన్లు మాట్లాడకూడదని చెబుతుంది. అందరి భోజనాలు ముగిసి ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోతారు. శ్రీవల్లి, గోపి విస్తర్లు తీసి పారవేసి వస్తారు.
తనకు ప్రతిపనిలో అడ్డువస్తున్న శ్రీవల్లికి గట్టిగా ఒక షాక్ ఇవ్వాలని మ్యాడీఅనుకుంటాడు. దీంతో తన ఇయర్‌ఫోన్లు తానే దాచి పెట్టుకుని శ్రీవల్లిని అడుగుతాడు. మీరు తింటున్న ఆకుపక్కనే వాటిని పెట్టాని లక్ష్మీ చెబుతుంది. నేను వాటిన చూడలేదని మ్యాడీ అంటాడు. నా ఇయర్‌బడ్లు నాకు కావాల్సిందేనని గట్టిగా నిలదీస్తాడు. నేను చేతులు కడుక్కుని వచ్చేసరికి ఆకులు, ఇయర్‌బడ్స్ లేవని అంటాడు. నేను నువ్వు అన్నం తిన్న ఆకు పక్కనే పెట్టానని చెప్పినా వినడు. ఆ ఇయర్‌బడ్స్ తనకు ఎంతో ముఖ్యమని...నువ్వే వాటిని ఆకులతోపాటు తీసి పడేసి ఉంటావని గట్టిగా కోప్పడతాడు. వెళ్లి వెతికి తీసుకుని రావాలని అంటాడు. దీంతో గోపిని అడిగి ఆకులు పడేసిన చోట వెతకడానికి శ్రీవల్లి బయలుదేరుతుంది. అలా రాత్రి అయ్యేవరకు ఇయర్‌బడ్స్ కోసం అక్కడ లక్ష్మీ వెతుకుతూనే ఉంటుంది. శ్రీవల్లి ఇంటికి రాకపోవడంతో నూకాలు తన కొడుకిని పిలుచుకురమ్మని పంపిస్తుంది.
శ్రీవల్లిని పెళ్లిచేసుకోవడానికి వచ్చిన పెళ్లికొడుకు ఓ తిరుగుబోతు. అంతకు ముందే ఓ మహిళతో సంబంధం పెట్టుకుని అక్కడికి వెళ్తాడు. నువ్వుపెళ్లి చేసుకోబోతున్నావని...కాబోయే భార్యను పై చదువులు కూడా చదివించబోతున్నావని ఆమె నిలదీస్తుంది. దీంతో వాడు అసలు విషయం చెబుతాడు. పెళ్లి చేసుకోవడానికే అలా చెప్పానని....నాకు ఇంట్లో పనిమనిషి అవసరం ఉండి ఆ లక్ష్మీని పెళ్లి చేసుకుంటున్నానని చెబుతాడు. అలాగే ధాన్యం, మందు లెక్కలు చూసేందుకు చదువుకున్న అమ్మాయి అయితే బాగుంటుందని దాన్ని చేసుకుంటున్నాని చెబుతాడు. ఇంతలో శ్రీలక్ష్మీ కోసం వెళ్తున్న వాళ్ల తమ్ముడికి ఆమె దారిలో ఆకులు వెతుకుతూ కనిపిస్తుంది.అక్కడ ఏం చేస్తున్నావని తమ్ముడు ప్రశ్నించగా...మ్యాడీ ఇయర్‌బడ్స్ పోయాయని వాటినే వెతుకుతున్నానని చెబుతుంది. అక్కడే ఇద్దరూ ఇయర్‌బడ్స్ కోసం మళ్లీ వెతుకుతారు. చీకటిలో అక్కడ లక్ష్మీని చూసిన ముగ్గురు తాగుబోతులు ఆమె దగ్గరికి వస్తారు. తనను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు.





















