Krishna Mukunda Murari Serial Today March 1st: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ముకుంద ఆటకట్టించేందుకు అదిరిపోయే ప్లాన్ వేసిన కృష్ణ మురారీలు..!
Krishna Mukunda Murari Serial Today Episode ముకుంద శోభనం ఆపేయ్‌మని మురారికి టెన్షన్ పెట్టగా అదే ముహూర్తానికి మురారి, కృష్ణలు ముహూర్తం పెట్టించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode టెన్షన్ పడకుండా ఏదో ఆలోచించాలి అని కృష్ణ మురారిని తీసుకొని కాఫీ షాప్‌కి వస్తుంది. రిసార్ట్‌లోనే ముకుంద కాలు బెనికినట్లు నటించిందని మురారితో కృష్ణ చెప్తుంది. దీంతో మురారి షాక్ అవుతాడు. ఇప్పుడు ఏం చేద్దామని ఇద్దరూ అనుకుంటారు. ఇంతలో ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఓ అమ్మాయి చనిపోయింది అని న్యూస్ వస్తుంది. అది కృష్ణ, మురారి చూసి భయపడతారు.
కృష్ణ: ఏం ఆలోచిస్తున్నారు ఏసీపీ సార్.. పోనీ నేను చెప్పనా ఒకవేళ మీరు కాదు అంటే ముకుంద కూడా ఆ అమ్మాయిలా ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది అని భయపడుతున్నారు కదా.
మురారి: ఒకవేళ ఆ అమ్మాయిలా ప్రాణాలు తీసుకున్నా బాగున్ను. నాలుగు రోజులు ఏడుస్తాం. తర్వాత ఊరుకుంటాం.
కృష్ణ: ఏసీపీ సార్ ఆవేం మాటలు..
మురారి: మరేం చేయను.. ఒకప్పుడు తను చేసిందంతా మర్చిపోయి మారిపోయిందని ఆదర్శ్‌కి నచ్చజెప్పి తీసుకొని వస్తే ఇప్పుడు ఆదర్శ్ వద్దు నువ్వే కావాలి అంటుందా.. అలాంటి మనిషి ఉన్నా లేకున్నా ఒకటే.. సరే మనం ఇప్పుడు ఏం చేద్దాం..
కృష్ణ: ముందు ఈ శోభనం ఆపాలి ఏసీపీ సార్. రిసార్ట్‌లో నాటకం ఆడి ఎలా శోభనం ఆపిందో ఇప్పుడు కూడా ఆపేస్తుంది. కానీ తను ఆపితే అందరికీ తెలిసిపోతుంది. అదే మనం ఆపితే ఎవరికీ తెలీదు. ఆదర్శ్‌కి కూడా ఇప్పుడు ఏం చెప్పొద్దు. ముందు శోభనం ఆపేసి తర్వాత నిధానంగా చెపుదాం. అవసరం అయితే క్షమాపణలు కూడా చెప్దాం.
మురారి: ఎలా అని అడిగితే కృష్ణ ఏదో ఐడియా చెప్తుంది.
మధు: బ్రో నీకు ఇంకా ఉప్మా పెసరట్టు రాలేదా.. ఇంకా రుబ్బుతున్నారో ఏంటో..
రేవతి: ముకుంద ఉప్మా పెసరట్టు అయిందా ఆదర్శ్ వెయిట్ చేస్తున్నాడు.
ముకుంద: మనసులో.. అయ్యో ఈయనకు ఉప్మా పెసరట్టు వేస్తా అన్నాను కదా ఆ సంగతే మర్చిపోయాను. అత్తయ్య అది..
మధు: అది ఇంకా పెసరట్టు వేయలేదా..
ముకుంద: అది పనమ్మాయి పిండి పులుసుపోయింది అని పడేసింది. అదే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా..
రేవతి: ఇంకా ఆలోచిస్తున్నావా ఆ ముక్క నాకు ముందే చెప్పొచ్చు కదా..
మధు: నాకు ముందే తెలుసు ఇలాంటి సమాధానం ఏదో వస్తుంది కానీ ఉప్మా పెసరట్టు రాదు అని.
ఆదర్శ్: పిన్ని ఇప్పుడు ఏమైంది. ముకుంద ఆనియన్ దోశ ఇవ్వు అదే తింటాను.
ముకుంద: అది వద్దులేండి.. అది చల్లారిపోయింది. అదిగో కృష్ణ వాళ్లు కూడా వచ్చేశారు వాళ్లని అడిగి దోశలు వేస్తాను.
మురారి: మాకు ఏ టిఫిన్ అవసరం లేదు తినే వచ్చాం.
రేవతి: ఆఫీస్ అని వెళ్లావు కదరా ఇద్దరూ కలిసి వచ్చారేంటి.
కృష్ణ: ఆఫీస్ లేదు ఏం లేదు అత్తయ్య.. ఏసీపీ సార్ పంతులు గారి దగ్గరకు వెళ్లారు. తర్వాత నన్ను రమ్మని ఫోన్ చేస్తే నేను వెళ్లాను. నేను పిలిచిన పంతులు మాకు మూడు నెలల వరకు ముహూర్తాలు లేవు అన్నారు కదా. అందుకే మీ అబ్బాయి వేరే పంతులు దగ్గరకు వెళ్లారు.
మురారి: ఏయ్ తింగరి మన రెండు జంట శోభనం ఒకేసారి అనుకున్నాం కదా. ఇప్పుడు మనకు లేకుండా వాళ్లకి పెడితే మన మాట కాదు అనలేక ఒప్పుకున్నారు. అరే ఇన్నాళ్లు మా కోసం వీళ్లు ఆగితే వాళ్లకు లేకుండా మాకు మాత్రేమే జరిగింది అని మనసులో ఏదో మూల నొప్పి ఉండిపోతుంది. అవునా కాదా ముకుంద. ఏంటి బ్రో నువ్వేమంటావ్.
ముకుంద: మనసులో.. ఏదో స్కెచ్ వేసుకొని వచ్చారు అని అర్థమైంది.
మురారి: కుదిరింది మాకు కూడా మీకు వచ్చిన ముహూర్తానికే కుదుర్చుకున్నాం.
ముకుంద: మనసులో.. నా శోభనం ఆపమంటే వీళ్లు ముహూర్తం పెట్టించుకొని వచ్చారా.. నేను నా శోభనం జరగకూడదు అని ఎలా అనుకుంటున్నానో. మురారి కృష్ణలది కూడా జరగకూడదు.
ఆదర్శ్: ముకుంద ఏం ఆలోచిస్తున్నావ్..
కృష్ణ: షాక్ అయినట్లు ఉంది ఆదర్శ్. అదే ఈ న్యూస్ తెలియగానే సంతోషంగా అలా ఉన్నట్లుంది. అంతేనా ముకుంద.
ముకుంద: ఆశ్చర్యం కాదు అనుమానం. ఇంతకు ముందు వచ్చిన పంతులు దగ్గర కుదరని ముహూర్తం ఈ పంతులు దగ్గర ఎలా కుదిరిందా అని అడుగుతున్నాను.
కృష్ణ: మనసులో.. ఇది నీ తిక్క కుదర్చడానికి మేం ఆడుతున్న నాటకం ముకుంద. ఆయన గోచారం ప్రాకారం చూశారంట కుందరలేదు. ఈయన గ్రహచారం ప్రకారం చూశారు. అందుకే కుదిర్చేశారు.
మధు: మనసులో..అసలు ఈ శోభనం జరగక ముందే ఏదో జరిగేలా ఉంది.
రేవతి: సరే ఈ రెండు జంటలకు గుడికి తీసుకెళ్లి పూజ చేయించాలి తొందరగా వెళ్లి రెడీ అవ్వండి..
మురారి: నువ్వు సూపర్ కృష్ణ. చాలా హ్యాపీగా ఉంది. ఏం చేయాలో తెలియని టైంలో భలే ఐడియా ఇచ్చావ్. అక్కడ ముకుంద జుట్టు పీక్కుంటుంది. ఇక్కడ మన శోభనం అయిపోతుంది.
కృష్ణ: ఏంటి అయిపోయేది అంత లేదు. ఇది నాటకమే..
మురారి: నాటకం ఏంటి మన శోభనం జరిగిపోతే ముకుంద నా గురించి ఆలోచించడం మానేస్తుంది ఆదర్శ్‌తో కలిసి ఉంటుంది అని నువ్వే అన్నావు కదా. మళ్లీ ఇంతలోనే మాట మార్చుతావేంటి. ఇంతకీ ముకుంద ఏం చేయాలి అనుకుంటుందో ఏంటో..
కృష్ణ: ఈ పాటికే తను చెప్పినట్లు మీరు చేయరు అని అర్థమైపోయింటుంది. తర్వాత మీతో మాట్లాడటానికి ట్రై చేస్తుంది. తన ప్రమేయం లేకుండా తనని ఎవరూ వెలెత్తి చూపించకుండా అంతా తను అనుకున్నట్లే జరిగిపోవాలి అనుకుంటుంది.
మురారి: జరగదు కృష్ణ ఏం చేసినా తను అనుకున్నది జరగదు అని తనకి అర్థం కావాలి. ఆదర్శ్ తోనే తన జీవితం.. అబ్బా.. ముకుంద గురించి ఆలోచిస్తూ ఆదర్శ్ గురించి మర్చిపోయాం. రేపు ఎలాగూ శోభనం జరగదు. రేపు ఆదర్శ్‌ని అనుమానం వస్తుంది. నిజం తెలిసిపోయే ఛాన్స్ ఉంది. అప్పుడు వాడికి ఏం సమాధానం చెప్పాలి.
కృష్ణ: ఏసీసీ సార్ పరిస్థితి అంత వరకు తీసుకురాకూడదు. ముందే ఆదర్శ్‌కి అర్థమయ్యేలా చెప్పడం మంచిది. ముకుంద ఎలా ప్రవర్తించినా తట్టుకునేలా ఆదర్శ్‌ని మనం ప్రిపేర్ చేయాలి.
మురారి: నిజం చెప్తే తట్టుకుంటాడా..
కృష్ణ: ముకుంద మారుతుంది. కచ్చితంగా మార్చుదాం అని ఆదర్శ్‌కి చెప్దాం.
గుడికి రెడీ అయి ఆదర్శ్ ముకుంద దగ్గరకు వస్తాడు. రెడీ అవ్వమంటే తాను అలానే వస్తా అంటుంది. ఏమైంది అంత డిస్ట్రబ్‌గా ఉన్నావని ఆదర్శ్ అడిగితే మనసులో ముకుంద మురారి మామూలు షాక్ ఇవ్వలేదు కదా అని అనుకుంటుంది. నీకు దూరం అయి నేను మురారికి దగ్గర అవ్వాలి అనుకుంటే తాను కృష్ణకు దగ్గర అయిపోవాలి అనుకుంటాడా.. నాకు మండిపోతుంది అని ముకుంద అనుకుంటుంది. తాను ఊరుకోను అని ఈ శోభనం జరగనివ్వను అని అంటుంది. ఇక మురారితో మాట్లాడాలి అని ముకుంద ఫోన్ చేస్తుంది. తర్వాత గార్డెన్‌లోకి రా నీతో మాట్లాడాలి అని మెసేజ్
చేస్తుంది. అది కృష్ణ చూసేస్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.