Krishna Mukunda Murari Serial Today March 16th: ఇంట్లో వాళ్లకి ముచ్చెమటలు పట్టించిన ముకుంద - దారుణంగా మాట్లాడిన ఆదర్శ్!
Krishna Mukunda Murari Serial Today Episode: బతికే ఉన్న ముకుంద మురారి ఇంటికి వచ్చి అందరికి కావాలనే ఎదురు పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Telugu Serial Today Episode: ఆదర్శ్ మాటలకు కృష్ణ ఏడుస్తుంది. తను ఏ తప్పు చేయలేదు అని ముకుంద మారింది అని మీ ఇద్దర్ని కలపాలి అనే ఇలా చేశాను అని ఎంత చెప్పినా ఆదర్శ్ నమ్మడు. నీ స్వర్థం కోసమే ముకుంద మారింది అని నన్ను తీసుకొని వచ్చావని ఆదర్శ్ అంటాడు.
ఆదర్శ్: ఆ అబద్ధంతో ఆగకుండా నా భార్యను ఈ లోకంలోనే లేకుండా చేశావ్.. శభాష్.. నీ ప్లానింగ్‌కు హ్యాట్సాఫ్.. ఇంత చేసి కూడా అమాయకురాలివా నటిస్తున్నావు చూడు.. కృష్ణ అడవిలో పులులు, సింహాలు ఇలాంటి క్రూర మృగాలు ఇలాంటివి ప్రత్యేకంగా కనిపిస్తాయి. వాటి జోలికి ఎవరూ వెళ్లరు. కానీ మనుషులే ప్రమాదం. మంచివాళ్లు ఎవరో క్రూరమైన వాళ్లు ఎవరో తెలుసుకోలేం. నువ్వు క్రూర జంతువువి. మేక వన్నే పులివి నువ్వు. చాలా ప్రమాదం నువ్వు.
రేవతి: నోర్ముయ్‌రా..
నందిని: అన్నయ్య ఒక మంచి మనిషిని నీ సూటిపోటి మాటలతో ఏడిపిస్తున్నావ్ నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు.
ఆదర్శ్: ఏడ్చేవాళ్లు అందరూ మంచోళ్లు కాదు అరిచే వాళ్లు అందరూ చెడ్డ వాళ్లు కాదు. అయినా బలి అయిపోయింది నేను అనుభవిస్తున్నది నేను. నా ప్లేస్‌లో ఉండి ఆలోచిస్తే అర్థం అవుతుంది నేను చేస్తున్నది కరెక్టో కాదో..
మరోవైపు ముకుంద తన తండ్రిని తీసుకొని ఊరి చివర ఉన్న ఓ ఇంటికి తీసుకొస్తుంది. మురారి వాళ్లు ఓదార్చడానికి వస్తే దొరికిపోతాం అని వాళ్లకు దూరంగా ఉండాలి అని అంటుంది.
శ్రీనివాస్: అసలు ఏం ప్లాన్ చేయాలి అనుకున్నావ్ అమ్మా..
ముకుంద: ఏం చేయాలి అనుకున్నానో చెప్పాను కదా నాన్న. కానీ అంతకంటే ముందు చేయాల్సింది కొంచెం ఉంది. అని తన ప్లాన్ తన తండ్రికి చెప్తుంది.
శ్రీనివాస్: ఎందుకు అమ్మ ఇంత రిష్క్.. అవసరమా..
ముకుంద: చేయాలి నాన్న తప్పదు. ఇన్నాళ్లు ఓపికగా మురారి నా ప్రేమను అర్థం చేసుకుంటాడు అని ఎదురు చూశాను. కానీ ఇప్పుడు తప్పదు నాన్న. అసలు నా ప్లాన్ అది కాదు నాన్న. బతికున్నా చనిపోయినట్లు ఉండాలి. చనిపోయినట్లు ఉన్నా వాళ్ల మధ్య బతికే ఉండాలి. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకొని భవాని అత్తయ్య వచ్చేలోపు ఏదో రకంగా ఆ ఇంట్లో సెటిల్ అవ్వాలి. ఆ కుటుంబానికి ఇది జరగాల్సిందే.. అయినా నువ్వు రాత్రి నేను అనుకున్నది జరగాలి అని మాటిచ్చావు కదా. మళ్లీ ఇప్పుడు మాట మార్చుతున్నావేంటి.
శ్రీనివాస్: నా కూతురి జీవితం ఇలా అయిపోయింది ఏంటా అని ఆవేశంలో మాటిచ్చాను అమ్మా కానీ ఆ తర్వాత ఆలోచిస్తే పరిస్థితి మరింత దిగజారిపోతుంది ఏంటా అని అనిపిస్తుంది అమ్మా. భయం వేస్తుంది.
ముకుంద: చూడు నాన్న నాకు ఏం కాదు.. నాకు మురారి మీద ఎంత ప్రేమ ఉందో.. కృష్ణ మీద అంత పగ ఉంది.
శ్రీనివాస్: మధ్యలో కృష్ణ ఏం చేసిందమ్మ నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఆ మురారి. ఏదైనా పగ ఉంటే మురారి మీద ఉండాలి కదా..
ముకుంద: మురారిని నేను ప్రేమించాను నాన్న తన మీద నాకు పగ ఉండదు. అసలు మురారి మారడానికి ఆ కృష్ణ కారణం అసలు అదే అడ్డు లేకుంటే మురారి నా వాడు ఎప్పుడో అయ్యుండేవాడు. కానీ కృష్ణ తిరిగి నేను తనకు అడ్డు అనుకొని ఘోరంగా అవమానించి ఏ ఆడపిల్లా చెప్పని మాట నాతో చెప్పించి ఈ రోజు నా ఈ పరిస్థితికి కారణం అయింది నాన్న. ఒకర్ని ప్రేమతో మరొకరికి పగతో ఇద్దర్నీ వదలను నాన్న.
ముకుంద మురారి ఇంటికి వస్తుంది. వచ్చిన పని తొందరగా చేసుకొని వెళ్లిపోదాం అంటే మురారి ఇంకా రాలేదు ఏంటా అనుకొని బయట వెయిట్ చేస్తుంటుంది. ఇంతలో మురారి బయటకు వస్తాడు. దూరం నుంచి మురారి ముకుందను చూస్తాడు. షాక్ అవుతాడు. ముకుంద దగ్గరకు పరుగులు తీస్తాడు. ఇంతలో ముకుంద దాక్కొంటుంది. తర్వాత మురారి చూస్తే కనిపించదు. అయినా మురారి వెతుకుతాడు. ఎంతకీ ముకుంద కనిపించకపోవడంతో ఇంట్లోకి వెళ్లిపోతాడు.
ముకుంద: నేను చనిపోయాను అని నమ్ముతున్నావ్ కానీ ఒక్కసారి నీ కళ్లముందు కనిపించగానే ఎక్కడ బతికున్నానో అని వెతికావ్.. మళ్లీ ఇది నీ భ్రమ అనుకొని వెళ్లిపోతున్నావ్. నాకు కూడా కావాల్సింది ఇదే.. నేను పక్కన ఉన్నప్పుడు నాకోసం బతకాలి. నేను లేనప్పుడు నా భ్రమలో బతకాలి. మొత్తంగా నేనే నీ బతుకు కావాలి. అందుకే ఈ చిన్న ప్రయత్నం.
ఇక మధు అటుగా రావడంతో ముకుంద టెన్షన్ పడుతుంది. మధు చూడకుండా తప్పించుకుంటుంది. అక్కడ నుంచి వెళ్తుండగా రేవతి వంట చేస్తూ ముకుందను చూస్తుంది. అనుమానంతో వెనక్కి తిరిగి చూస్తే ముకుంద కనిపించదు. దీంతో రేవతి కూడా భ్రమ పడ్డాను అనుకొని వెళ్లిపోతుంది.
ముకుంద: ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు ఏంటి. ఒక్కరికీ నేను పోయాను అన్న బాధే లేదు. పరిస్థితి ఇలా ఉంటుంది అని తెలీక అనవసరంగా తొందర పడి వచ్చానే. ఈ రోజు ఎవరికో ఒకరికి దొరికిపోయేలా ఉన్నాను. మెల్లగా బయట పడాలి. లేదంటే మొత్తం ప్లాన్ బెడిసికొడుతుంది. అని ముకుంద బయటకు వెళ్లబోతుంటే కృష్ణ వస్తుంటుంది.
ఆరు బయట ఉన్న చీరలు దగ్గర నిల్చొంటుంది ముకుంద. ఇక కృష్ణ చీరలు తీస్తుంటుంది. ఆ చీరల వెనకే ముకుంద భయంతో దాక్కొంటుంది. మొత్తానికి ముకుంద అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఇక మురారి తను నిజంగా ముకుందను చూశానా లేక అబద్ధమా అని ఆలోచిస్తుంటాడు. ముకుంద చనిపోయింది కదా మరి అచ్చం బతికున్న మనిషిలా అనిపిస్తుంది ఏంటా అని ఆలోచిస్తాడు. తాను ఏదో ముకుందకు అన్యాయం చేసినట్లుగా తప్పు చేసినట్లుగా ముకుంద చూపు కనిపిస్తోంది అని నిజంగా ముకుంద విషయంలో తప్పు చేశానా అని మురారి ఆలోచిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: గుంటూరు కారం: బుల్లితెరకు 'గుంటూరు కారం' - ఆ స్పెషల్ డేకి టెలికాస్ట్!