Krishna Mukunda Murari Serial Today June 8th: కృష్ణ ముకుంద మురారి.. సీరియల్‌కు శుభం కార్డు - కలిసిపోయిన కృష్ణ, ముకుంద, చివరి ఎపిసోడ్ ఇలా ముగిసింది
Krishna Mukunda Murari Serial June 8th Last Episode: ఇంట్లో వాళ్లందికీ మీరానే ముకుంద అని తెలియడం ముకుందకి పాప కృష్ణకు బాబు పుట్టడంతో అందరూ కలిసిపోవడంతో చివరి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Serial Last Episode: కృష్ణ కళ్లు తిరిగి పడిపోవడంతో డాక్టర్ ఇంటికి వస్తుంది. కృష్ణని పరీక్షించి ప్రెగ్నెంట్ అని చెప్తుంది. అందరూ ముందు షాక్ అయి తర్వాత చాలా సంతోషిస్తారు. భవాని అయితే ఎగిరి గంతేసినంత పని చేస్తుంది. గర్భసంచి తీసేశారు కదా ప్రెగ్నెంట్ ఎలా అని అంటే అలాంటిది ఏం జరగలేదు అని చెప్తుంది. ముకుంద షాక్ అయిపోతుంది. అది ఎలా సాధ్యం అని అనుకుంటుంది.
కృష్ణ: డాక్టర్ వైదేహి టెస్ట్ చేసి చెప్పిందని సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు డాక్టర్.
భవాని: వైదేహి అంటే మీకు సరోగసీ చేసిన డాక్టరే కదా. ఇదిగో ఈ మీరా దీంతో కలిసి ఆ డాక్టర్ డ్రామా చేసింది దాని మాటలు ఎలా నమ్మావు. ఇక డాక్టర్ అడిగితే తమ ఫ్యామిలీ మేటర్ అని ఆమెని వెళ్లిపోమని అంటుంది. ఇక ముకుంద కూడా అక్కడి నుంచి జారుకోవాలి అని ప్రయత్నిస్తే ఆపుతుంది. ఎవరు నువ్వు..
కృష్ణ: పెద్దత్తయ్య అడుగుతున్నారు కదా సమాధానం చెప్పు.
భవాని: ఎవరు నువ్వు.. కృష్ణ ఇది ఎవరో దీని బాగోతం మొత్తం నీకు తెలుసు చెప్పు.
కృష్ణ: నేను కాదు అత్తయ్య దానికి అదే సమాధానం చెప్పాలి అప్పుడే ఒక ముగింపు దొరుకుతుంది.
ముకుంద గట్టిగా నవ్వుతూ ఈ కృష్ణ నా ప్లాన్స్ అన్నీ నాశనం చేసిందని మిమల్ని మోసం చేయాలి అనుకున్న కానీ చేయలేకపోయాను అత్తయ్య అని అంటుంది. ఎవరే నీకు అత్తయ్య అని భవాని ఫైర్ అయితే తాను ముకుంద అని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. ఇక భవాని తల పట్టుకుంటుంది. ముకుందని వద్దు అనుకోలేము. ముకుంద కడుపులో ఉన్న కృష్ణ బిడ్డని వద్దు అనుకోలేం అని అంటుంది. ఇంతలో ఆదర్శ్ వచ్చి భవాని కాళ్ల మీద పడతాడు.
ఆదర్శ్: నేను లెక్క పెట్టుకోలేనన్ని తప్పులు చేశారు. మీరు పట్టించుకోలేదు కాబట్టి మీకు నేను భారం అనిపించలేదు. జరిగింది అంతా తెలుసుకున్నాను. కృష్ణని ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టానో ఎంత టార్చర్ చేశాను తెలీదు. ఐయామ్ సారీ కృష్ణ. అమ్మ కాలు కాదు నీ కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. మురారి విషయంలోనూ చాలా తప్పులు చేశాను. మీరు నన్ను క్షమించాలి.
కృష్ణ: నువ్వు క్షమాపణ చెప్పొద్దు ఆదర్శ్. నువ్వు మమల్ని అర్ధం చేసుకుంటే చాలు.
ఆదర్శ్ ముకుందని మార్చుకుంటాను అని. ముకుంద కడుపులో బిడ్డ ఉన్నా తాను పవిత్రంగానే ఉందని, ముకుందకు ఓ కాపలా కావాలి అని తను తన భార్య కాబట్టి తన భర్తగా తనకి కాపలా ఉంటాను అని ముకుందని తీసుకొని వెళ్లిపోతాను అని అంటాడు. ముకుంద మారితేనే తనని ఇంటికి తీసుకొస్తా అంటాడు. ఇక మురారి దగ్గరకు అందర్ని తీసుకెళ్తా అని కృష్ణ అంటుంది. అందర్ని హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. మురారిని చూసి అందరూ ఎమోషనల్ అయిపోతారు. మురారి తన పెద్దమ్మతో నేను ఏ తప్పు చేయలేదు అని అంటాడు. ముకుంద తన బిడ్డకు మురారినే తండ్రి అని చెప్పగానే ఏం సమాధానం చెప్పాలో తెలీక ఇంటి నుంచి బయటకు వెళ్లగా యాక్సిడెంట్ అయిందని కళ్లు తెరిచి చూస్తే ముకుంద దగ్గర ఉన్నాను అని చెప్తాడు. ఇక ఆదర్శ్ మురారికి కూడా సారీ చెప్తాడు.
భవాని కృష్ణ తల్లి అయిందని ఇప్పుడు మూడో నెల అని చెప్తుంది. మురారి షాక్ అయితే వైదేహి ముకుంద చెప్పినట్లు సరోగసీ చేసింది కానీ కృష్ణ గర్భం తీయలేదు అని చెప్తుంది. మురారి హ్యాపీగా ఫీలవుతాడు. ఇక మధు ఇంటికి ఇద్దరు వారసులు రాబోతున్నారు అని ఒకరు కృష్ణ కడుపులో మరొకరు ముకుంద కడుపులో ఉన్నారని చెప్తాడు.
ఆరు నెలల తర్వాత..
కృష్ణకు కొడుకు పుడతాడు. మురారి, కృష్ణ బాబుని ముద్దాడుతూ మాట్లాడుతాడు. కృష్ణ ముకుంద కడుపులో ఉన్న తమ బిడ్డ గురించి బాధపడుతుంది. ఇంతలో ముకుంద బుజ్జి పాపాయిని తీసుకొని వస్తుంది. ఈ బిడ్డ మీ కృష్ణకు ఇచ్చి ఇది మీ పాపే తొమ్మిది నెలలు మోస్తా అన్నాను మోశాను అని ఇస్తుంది. ఇక ఆదర్శ్ ముకుంద పూర్తిగా మారిపోయిందని చెప్తాడు. ఇక ముకుంద మురారి, కృష్ణలకు క్షమాపణ చెప్తుంది. ఇక మిమల్ని ఇబ్బంది పెట్టనని వెళ్లిపోతా అంటుంది. ఇక కృష్ణ మురారి వాళ్లని ఆపి ఆ బిడ్డను ముకుందకే ఇచ్చేస్తుంది. రెండు జంటలు సంతోషంగా ఉంటాయి. ఇక భవాని వాళ్లు వచ్చి ఇన్నాళ్లు నా కుటుంబంలో ఈ సంతోషమే కోరుకున్నాను అని అంటుంది. ఇక అందరూ కలిసి సంతోషంగా ఉంటారు. దీంతో శుభం కార్డు వేసి కృష్ణ ముకుంద మురారి సీరియల్‌కి ముగింపు పలికారు.