అన్వేషించండి

Krishna Mukunda Murari Serial Today January 16th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ఆరిపోయిన హారతి, ముకుందపై మళ్లీ కృష్ణకు అనుమానం వచ్చిందా!

Krishna Mukunda Murari Serial Today Episode: ముకుంద కృష్ణకు హారతి ఇస్తుండంతో హారతి ఆగిపోతుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Today Episode : పంతులు ముకుందతో ఒక సారి మీ భర్తను కూడా రమ్మని చెప్పండి అని అంటే ముకుంద ఫీలవుతుంది. ఇంతలో కృష్ణ వాళ్ల అయిన మిలటరీ ఆఫీసర్ తర్వాత వస్తారు అని చెప్తుంది. తర్వాత అందరి దంపతులతో పంతులు మొక్కకి నీరు పోయిస్తారు. ఇక భవాని తన కుటుంబంలో కలహాలు రాకుండా.. తాను కలలు కన్న తన కుటుంబాన్ని తీర్చిదిద్దు అని దేవుడికి కోరుకుంటుంది. తర్వాత కృష్ణ హారతి ఇస్తుంది. ఇక తాను తీసుకుంటానని ముకుందకు హారతి పళ్లెం ఇస్తుంది. ఇక కృష్ణ హారతి తీసుకునే టైంలో ఆగిపోతుంది.

ముకుంద: అంతా నా వల్లే నేను చేసిన తప్పునకు ఏ దేవుడు క్షమించడు. కృష్ణ ప్లీజ్ ఏం అనుకోకు. నీకు ఏం జరగదు కృష్ణ. 
కృష్ణ: ఊరుకో ముకుంద.. ఏం కాదు.
రేవతి: అక్క నాకు కొంచెం భయంగా ఉంది అక్క. ఇందాక పూజలో అలా జరగడం. పంతులు గారు కూడా భయపడ్డారు. 
భవాని: నువ్వేం టెన్షన్ పడకు రేవతి. ఇన్నాళ్లు వాస్తవాలు తెలీక సమస్యలు సృష్టించుకున్నాం. కానీ ఇప్పుడు అన్నీ తెలిశాక ఆ మాత్రం ప్రమాదాన్ని ఆపలేమా.. 
మధు: బ్రో స్పీడ్‌గా నడవకు నీకు పంచె కట్టుకోవడం రాదు కదా.. ఊడిపోగలదు.
మురారి: అలా ఏం లేదు కృష్ణ కట్టింది ఇప్పుడు కబడ్డీ కూడా ఆడొచ్చట.
కృష్ణ: సార్ మీరే కట్టుకున్నాను అని చెప్పొచ్చు కదా నా పేరు చెప్పకపోతే ఏమయ్యేది. 

మరోవైపు మురారి భవాని సెల్ తేవడానికి మేడ మీదకు వెళ్తాడు. అయితే మురారి పంచె ఊడేలా ఉంటుంది. దాన్ని కృష్ణ చూస్తుంది. అనవసరంగా ఇందాక పంచె తొక్కాను అని తనని తాను తిట్టుకుంటుంది. ఇక పంచె ఊడే టైంలో మురారికి డైనింగ్‌ టేబుల్ దగ్గర ఛైర్ ఇస్తూ కూర్చొమంటుంది. అందరూ భోజనాలు చేస్తారు. తర్వాత పతంగులు ఎగరేయాలి అనుకుంటారు. 

మురారి: పంచె ఊడిపోయేలా ఉంది కృష్ణ ఏం చేయను.
కృష్ణ: నేను ఇందాకే చూశాను.
భవాని: ఏమైంది మురారి.
మురారి: కృష్ణ అందరి తిండి అయిపోయింది. నాదీ అయిపోయింది. నేను ఇప్పుడు ఎలా లేవాలి. మీరందరూ వెళ్లండి నేను మొదటి నుంచి తింటాను. 
కృష్ణ: ఆపండి సార్ ఆ షాక్‌తో ఇంకెంత తింటారు. ఏం లేదు. ఏసీపీ సార్ పంచె ఊడిపోయింది. మీరందరూ ఉన్నారని ఆ షాక్‌తో తింటూనే ఉన్నారు. 
రేవతి: రేయ్ ఆ ముక్కేదో ముందే చెప్పొచ్చు కదరా.. పదండి అక్కా.

ఇక అందరూ మేడ మీదకు వెళ్లి గాలిపటాలు ఎగరేస్తారు. ఇక కృష్ణ మురారి అనుకొని భవానితో ఏవేవో అనేస్తుంది. ఇక మురారి దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్తుంది. ఇక ముకుంద కృష్ణ గాలిపటం కట్ చేసేస్తుంది. దీంతో కృష్ణ బుంగ మూతి పెట్టుకుంటుంది. తర్వాత మురారి గాలిపటం ఎగరేస్తుంది. 

కృష్ణ: (ముకుందకు తనకు మధ్య జరిగిన సంఘటనలు గుర్తుచేసుకుంటూ) ఏంటి ముకుంద మారదు అని హారతి సూచిస్తుందా.. గాలిపటం కావాలనే తెంపేసిందా.. లేదు లేదు ఎంతైనా ముకుంద ఆడపిల్ల ఇంత దారుణంగా బిహేవ్ చేయదు. 
మురారి: కృష్ణ ఒక్కదానివే రూంలో ఏం చేస్తున్నావ్.. సరే కానీ నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను దానికి నువ్వు సమాధానం చెప్పాలి. సినిమా రిలీజ్ చేయడానికి ముందు ఏం చేస్తారు.
కృష్ణ: టీజర్ రిలీజ్ చేస్తారు. అయినా మధుని అడగాల్సిన ప్రశ్నలు నన్ను అడుగతారు ఏంటి.
మురారి: అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. సరే.. ఎలక్షన్ ముందు ఏం చేస్తారు.
కృష్ణ: ప్రచారం చేస్తారు.
మురారి: వెరీగుడ్.. సినిమా రిలీజ్‌కు ముందు టీజర్ ఎలాగో రేపు మన శోభనానికి ముందు ఇప్పుడు టీజర్ రిలీజ్ చేద్దామా..
కృష్ణ: అదేం కుదరదు. ఆదర్శ్ వచ్చాక ముకుంద లైఫ్ సెట్ అయ్యాక.
మురారి: ఇన్ని రోజులు నేను నీ మాట విన్నాను ఇప్పుడు నువ్వు నా మాట విను. నేను నీ మొగుడిని కాబట్టి పెళ్లం నా మాటే వినాలి. 

ఉదయం కృష్ణ ముగ్గు పెట్టడానికి వస్తే అంతకు ముందే ముగ్గు వేసి రంగులు కూడా వేసుంటారు. కృష్ణ వచ్చి అందరినీ అడుగు తుంది ఎవరు వేశారు అని. ఎవరు వేశారా అని కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.   

Also Read: 'త్రినయని' సీరియల్ జనవరి 16: విశాలాక్షి చేయి పట్టుకొని పాము అంటూ రచ్చ చేసిన తిలోత్తమ!

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
Illu Illalu Pillalu Serial Today August 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget