Trinayani Serial Today January 16th - 'త్రినయని' సీరియల్: విశాలాక్షి చేయి పట్టుకొని పాము అంటూ రచ్చ చేసిన తిలోత్తమ!
Trinayani Serial Today Episode: నయని తీసుకొస్తున్న మట్టి కుండ సుమన పగలగొట్టేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode: నయని వాళ్లు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడుతుంటే, విశాల్, విక్రాంత్‌లు భోగి మంటకు కావాల్సిన వాటిని ఏర్పాటు చేస్తుంటారు. ఇంతలో విశాలాక్షి అక్కడి వస్తుంది. విశాలాక్షిని చూపి తిలోత్తమ, వల్లభ షాకైపోతారు.
విశాల్: అమ్మా విశాలాక్షి గుడి దగ్గరకు వచ్చిన నీవు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయావు ఎందుకు.
విశాలాక్షి: అయ్యో నాన్న నేను ఎక్కడికి వెళ్లాను. మిమల్ని పెంచి పెద్ద చేసిన ఈ అమ్మే పంపించిందిగా..
హాసిని: ఏంటి అత్తయ్య.. చిన్న పిల్లని వెళ్లిపోమని మీరే చెప్తారా.. మళ్లీ ఏం తెలీనట్లు నంగనాచి కబుర్లు చెప్తారేంటి..
విశాలాక్షి: ఎక్కడికి పంపించారని అడగకండి.. పైకి పంపించాలి అని కిందకి పంపించారు.
వల్లభ: మమ్మీ భూతం మమ్మీ.. మమ్మీ భూతం
విశాల్: వచ్చింది విశాలాక్షి అన్నయ్య గుర్తుపట్టలేనట్టు భూతం అంటావేంటి..
విశాలాక్షి: ఏంటి అలా చూస్తున్నారు.. ఈ లెక్క ఏంటి అనా ఈ మొక్క ఏంటి అనా(చేతిలో మొక్క పట్టుకొని)
తిలోత్తమ: రెండింటికీ నువ్వే సమాధానం చెప్పు గారడి పాప.
విశాలాక్షి: ముందు ఈ మొక్క గురించి చెప్తా.. ఇది కొండ పిండి మొక్క కొమ్మ.. పండగ మూడు రోజులు ఎక్కువగా నూనెలు, కారాలు, మసాలాలు తింటాం కదా..
విశాల్: కొండ పిండి ఆకును ఆహారంలో భాగంగా చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. లివర్, కాలేయ సంబంధిత తదితర సమస్యలు తలెత్తవు..
విశాలాక్షి: పనికి రానిదంటూ ఏదైనా ఉంది అంటే అది పాడు ఆలోచనే..
హాసిని: మా అత్తయ్య వాళ్లకి బాగా అర్థమై ఉండాలి మరి.
తిలోత్తమ: నువ్వు మళ్లీ వస్తావు అనుకోలేదు పాప.
విశాలాక్షి: పాపగానే రావాలి అని వచ్చాను. ఈ రోజు అమ్మలు పిల్లల నెత్తిన భోగిపళ్లు పోస్తారు కదా అందుకు.
సుమన: నువ్వు కూడా చంటి పిల్లవు అనుకొని మా పిల్లల మధ్య కూర్చొబెట్టి నీకు భోగిపళ్లు పోయాలా..
తిలోత్తమ: కొండ మీద నుంచి కిందకి విసిరేస్తే చచ్చి ఊరుకున్న విశాలాక్షి బతికుండడం ఏంట్రా.
వల్లభ: ఎక్కడ దెబ్బలు కూడా లేవు.. మచ్చలు లేవు. పెళ్లి చూపులకు వచ్చినట్టు చాలా నీటిగా ఉంది మమ్మీ.
తిలోత్తమ: భక్తురాలిని భగవంతుడు కాపాడాడు అంటావా..
విశాలాక్షి: నిజమే దేవుడే నన్ను కాపాడాడు. శివుడు నా ప్రాణనాథుడు. మీలో మీరు మాట్లాడకుండా నాతో చెప్పండి.
వల్లభ: నువ్వు నిజంగా మనిషివేనా..
విశాలాక్షి: కాదు.. మనిషిని కాదు కానీ ప్రాణాలతో లేను అన్నానా.. కావాలి అంటే నా చేయి పట్టుకోండి..
తిలోత్తమ విశాలాక్షి చేయి పట్టుకోగానే పాము కనపడుతుంది. దీంతో తిలోత్తమ గట్టిగా అరుస్తుంది. ఇక ఏమైంది అని హాసిని అడిగితే పాము అని చెప్తుంది. దానికి హాసిని భర్త, అత్తలను తిడుతుంది. ఇక వల్లభ హాసినిని విశాలాక్షి చేయి పట్టుకోమని చెప్తాడు. దీంతో హాసిని విశాలాక్షి చేయి పట్టుకోవడం కాదు ఫ్లూట్‌లా ఊదుతాను అని ఊదితే సౌండ్ వస్తుంది. ఇక విశాలాక్షికి పిల్లలతో పాటు భోగి పళ్లు వేస్తామని రెడీ అవమని హాసిని చెప్తుంది. ఇక తిలోత్తమ గారడీ పిల్లకు మనమే భోగిపళ్లు వేద్దాం రా అని కొడుకుకు చెప్తుంది. మరోవైపు నయని మట్టి కుండ తీసుకొస్తుంటే సుమన సెల్ చూసుకుంటూ వచ్చి ఆ కుండని పగల కొట్టేస్తుంది.
నయని: పిల్లలకు రేగిపళ్లు పోశాక పాయసం తినిపించాలి బాబాగారు.
విక్రాంత్: మట్టి కుండలో స్వీట్ చేయాలి అనుకున్న వదిన ఆశని ముక్కలు చేసింది ఈ రాక్షసి.
నయని: నీకేం తెలుసు పిల్లల బాగోగులు.
సుమన: నేను మాత్రం కనలేదా.. అలా అంటావేంటి అక్క. నాకు అంతా తెలుసు అక్క ఎక్కడ నాకు ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందో అని హాసిని అక్క నువ్వు ప్రెగ్నెంట్ నాటకం ఆడారు.
విశాల్: సుమన అలాంటి నాటకాలు ఆరు నెలల తర్వాత అయినా బయట పడతాయి కదా..
సుమన: మా అక్క తెలివైనది బావగారు. రేపు నిజం బయటపడుతుంది అనేలోపు ఎక్కడినుంచో బిడ్డని తెచ్చి నేను కన్న బిడ్డే అని చెప్తుంది.
విక్రాంత్: అలా ఎవరూ చెప్పరు.
సుమన: పైకి అంటారు కానీ మీరు చెప్పలేదా.. వీళ్ల బిడ్డ గానవిని నా బిడ్డే అని..
నయని: నోర్మయ్ సుమన.. ఇప్పుడు గొడవ జరగాలి అనే కదా ఇలా మాట్లాడుతున్నావు.
సుమన: మీ ఆయన తెచ్చిన ప్రస్తావనకు ఇలా వివరణ ఇస్తున్నా. నువ్వు ఫీలైతే నేనేం చేస్తాను అక్క. బావగారు రాముడు అయితే మా వారు మటుకు దొంగ. కృష్ణుడు అంటే బాగుంటుందేమో.. అలా చెప్పమంటారా..
విశాల్: సుమన నువ్వు ఇంకా ఏం చెప్పకు. పిల్లల తలపై భోగిపళ్లు వేసి ఆశీర్వదించాల్సిన టైంలో గొడవ పెడితే బాగోదు. పైగా పండగ.
సుమన: మీలాంటి కుబేరులకు ప్రతి రోజూ పండగే బావగారు. నాలాంటి వాళ్లకు మీ సంతోషం చూసి మురిసిపోవడం తప్ప ఏముంటుంది. మరోవైపు భోగిపళ్లకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: సత్యభామ సీరియల్ జనవరి 15th: అమెరికా నుంచి వచ్చేసిన పెళ్లికొడుకు మాధవ్, సత్య ఒకే చెప్తుందా!