అన్వేషించండి

Krishna Mukunda Murari Serial Today January 13th: భవాని ఇంట్లో సంక్రాంతి సందడి షురూ, మాస్టారూ మాస్టారూ అంటూ అదరగొట్టేసిన కృష్ణ!

Krishna Mukunda Murari Serial Today Episode: పండగ కావడంతో భవాని ఇంట్లో అందరూ కలిసి పంక్తి భోజనం చేస్తూ సంతోషంగా గడపడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Today Episode: శకుంతల భోగి మంటలకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అందరూ అక్కడికి చేరుకుంటారు. భవాని కూడా వచ్చేస్తుంది. ఇక ముకుంద మాత్రం వాళ్ల దగ్గరకు రాకుండా దూరం నుంచి చూస్తూ ఉంటుంది. భోగి మంట వెలిగించమని అందరూ భవానికి చెప్తారు. అప్పుడే ముకుందని కృష్ణ చూస్తుంది. తనని కూడా పిలుద్దామని భవానికి రిక్వెస్ట్ చేస్తుంది. ఇక కృష్ణ వెళ్లి ముకుందని తీసుకొస్తుంది. 

భవాని: మా అమ్మ తెగ హడావుడి చేసేది. మా నాన్నకి ఇవేం ఇష్టం ఉండేవి కాదు అస్తమానం క్రమశిక్షణ అంటూ ఉండేవారు. 
కృష్ణ: హో అంటే మీది అచ్చం మీ నాన్న పోలిక అన్నమాట. 
భవాని: అఫ్ కోర్స్ నువ్వు అన్నది కరెక్ట్‌ ఏలే. 

భవాని భోగిమంట వెలిగిస్తే అందరూ చూట్టూ తిరిగి కోలాటం ఆడుతారు. ఇక మధు పాటలు పెడతాను అని భవానిని అడితితే భవాని పర్మిషన్ ఇస్తుంది. భవాని లోపలికి వెళ్లిపోతాను అంటే ఫస్ట్ పాటకు కృష్ణ, మురారి డ్యాన్స్ వేస్తారు చూడమని అందరూ రిక్వెస్ట్ చేస్తారు. ఇక కృష్ణ, మురారిలు మాస్టారూ మాస్టారూ పాటకు డ్యాన్స్ చేస్తారు. తర్వాత నందూ, గౌతమ్ డ్యాన్స్ చేస్తారు. ఆ తర్వాత శకుంతల తీన్ మార్ డ్యాన్స్ అదరగడుతుంది. అందరూ స్టెప్పులేస్తారు. ఇక ఉదయం కృష్ణ భవాని ఇంటి ఎదురుగా ముగ్గు వేస్తుంది. మురారి అక్కడికి వస్తే కృష్ణ గుడ్ మార్నింగ్ చెప్తుంది. ఇక మురారి కృష్ణని పొగిడేపనిలో పడతాడ. 

మధు: పెద్దమ్మ ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఆ అందం ఈ చీరతోనో పండగ వల్లో వచ్చింది కాదు పెద్దమ్మ నీ కొడుకు కోడలు కలిసి పోవడం వల్ల ఇక నీకు ఏ టెన్షన్ లేకపోవడం వల్ల వచ్చింది. ప్రతీ రోజూ నువ్వు ఇలాగే ఉండాలి పెద్దమ్మ. నిజం పెద్దమ్మ నేను నీ దగ్గరే పెరిగిను. నేను అంటే నేనే కాదు ఇక్కడున్న మేమంతా నిన్నే అమ్మా అనుకునే వాళ్లం. 
కృష్ణ: అవును అత్తయ్య.. అత్తయ్యవి అయినా సరే నువ్వు నాకు అమ్మవే. 
మురారి: హలో అందరూ మా అమ్మని పట్టుకొని అమ్మా అంటారు ఏంటి. నాకు మాత్రమే అమ్మ.
నందూ: అంతలేదులే మురారి.
గౌతమ్: అరే నీకు ఎందుకు అంత జలసీ నందూ.
ప్రసాద్: (భవానితో కలిసి సుమలత రావడంతో) ఏంటి మా వదినను కాకా పడుగున్నావా.. వదిన గదిలోంచి వస్తున్నావ్.
భవాని: ఏం ప్రసాద్ నాతో రాకూడదా.. 
ప్రసాద్: అది కాదు వదిన ఏవో సోది కబుర్లు చెప్పి విసిగిస్తుంది ఏమో అని.
సుమలత: అక్కా నేను మీకు బోర్ కొట్టించానా.. నోటికి ఎంతోస్తే అంత మాట్లాడకండి.
మధు: అమ్మ ఏదో పండగ పూట అని నోరుజారారులే. వదిలేయోచ్చు కదా. మిగతా రోజుల్లో ఎలానూ నోరు జారనివ్వువు కదా. 
సుమలత: నువ్వు నోరు ముయ్యురా. నేను అక్క రూమ్‌లోకి ఎందుకు వెళ్లానో తెలుసా.. అక్క చీర సూపర్‌గా కట్టుకుంది కదా నేను కూడా అలా కట్టుకుందామని వెళ్లా.. 
ప్రసాద్: ఎంత మీలా చీర కట్టుకున్నా మీ అంత హుందాతనం వస్తుందా చెప్పండి వదిన. 
మధు: అది మాత్రం అక్షరాల నిజం.

ఇక భవాని కింద కూర్చొని అరిటాకులో భోజనం చేద్దామని చెప్తే మధు, మురారి అరిటాకులు తీసుకురావడానికి వెళ్తామంటారు. గౌతమ్ కూడా వస్తా అంటే అల్లుడు పండగ పూట ఏం చేయకూడదు అని అందరూ అంటారు. దీంతో తమని అతిథుల్లా చూస్తున్నారని నందూ ఏడుస్తుంది. ఇక అందరూ ఆమెను ఓదార్చుతారు. ఇక అందరికీ భవాని వడ్డిస్తుంది. 

మధు: బ్రో పెద్ద పెద్దమ్మ కింద కూర్చొకుండా వడ్డిస్తాను అని భలే ఎస్కేప్ అయింది కదా.. 
మురారి: రేయ్ వినిపిస్తుంది రా.
భవాని: ఏం వినిపిస్తుంది మురారి.
మురారి: ఏం లేదు పెద్దమ్మ.. కృష్ణ ఏం లేదు కదా.. 
కృష్ణ: నాకు ఏం వినిపించలేదు.
భవాని: లేదు మీరిద్దరూ నా మీద ఏదో సెటైర్ వేసుకున్నారు. 
కృష్ణ: వాళ్ల మొఖం పెద్దత్తయ్య వాళ్లకు అంత సీన్ ఎక్కడ ఉంది. 
రేవతి: వీళ్ల ముఖం వీళ్లకు అంత లేదు. వీళ్లకు అంత ధైర్యం ఎక్కడుంటుంది.
మురారి: హలో మేడమ్ మాకు ఉన్నదే టన్నుల టన్నుల కొద్ది ధైర్యం. 
ముకుంద: అహా మరి అంత ధైర్యం ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా చెప్పు. 
మధు: చెప్తాం ఎందుకు చెప్పం. మురారి నువ్వు చెప్పు.
మురారి: స్టార్ట్ చేసింది నువ్వే కదా నువ్వే చెప్పు. పెద్దమ్మ మీరు కింద కూర్చోకుండా ఉండటానికి వడ్డిస్తాను అని షాకు చెప్పి భలే ఎస్కేప్ అయ్యారు అని అంటున్నాడు. 
మధు: పెద్దమ్మ ఏదో పండగ కదా.. క్షమించి వదిలేయరా ప్లీజ్.
భవాని: కృష్ణ నువ్వు లే.. లే నువ్వు వడ్డించు. కింద కూర్చొని ఏంట్రా నేను కింద కూర్చోలేనా నాతో పాటు మీరు సూర్యనమస్కారాలు చేయండి చూద్దాం. ఇక కృష్ణ  అందరికి వడ్డిస్తుంది. అందరూ హ్యాపీగా తింటారు. ఇక వంటలు అన్నీ సూపర్ అని కృష్ణే చేసింది అని అందరూ మెచ్చుకుంటారు. అయితే ఆ వంటలు అన్నీ ముకుంద చేసింది అని కృష్ణ చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: ప్రియాంక జైన్: బిగ్ బాస్‌లో శివ్ చెప్పాలనుకున్న బ్యాడ్ న్యూస్ ఇదేనా? ఇక ప్రియాంకకు దూరంగా ప్రియుడు, కారణం ఇదే

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Embed widget