అన్వేషించండి

Krishna Mukunda Murari Serial Today January 12th: అందరికీ దూరంగా ముకుంద.. భవానికి కృష్ణ మరో రిక్వెస్ట్‌!

Krishna Mukunda Murari Serial Today Episode భోగి మంట పెట్టేందుకు అందరూ ఒక్కచోటుకి చేరితే ముకుంద దూరంగా ఉంటుంది దీంతో ఇవాళ్టి ఎసిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Today Episode:  రేవతి, ముకుంద, శకుంతల పిండి వంటలు చేస్తుంటే మధు వీడియో తీస్తుంటాడు. ఇక ముకుంద చిన్నమ్మ మీరు చిన్నప్పుడు ఎలా సంక్రాంతి పండగ చేసుకున్నారు అని అడుగుతుంది. దానికి శకుంతల ఆరోజుల్లో ఉండే మనుషులే వేరమ్మా.. ఇప్పుడు అందరూ డబ్బు సంపాదన వెనకే తిరుతున్నారు అంటుంది. ఇంతలో కృష్ణ, మురారి ఇంటికి వస్తారు. ఇక ఐస్‌క్రీమ్‌ గురించి కృష్ణ, మురారిలు చెప్తారు. అందరూ నవ్వుతారు. 

ముకుంద: కృష్ణ అసలు నీకు స్వెటర్ ఎందుకు. కొత్తగా పెళ్లి అయింది కదా..
రేవతి: రేయ్ మురారి పంతులు గారు కాల్ చేశారురా.. అదేరా పండగ అయ్యేవరకు ముహూర్తాలు లేవట.
మధు: పండగ అయినతర్వాత అన్నీ మీ రోజులే కదా బ్రో. ఏమత్తా అంతే కదా.

మురారి: (తమ గదిలో) ఛా నవ్వుకు ఒళ్లు మండుతుంది. 
కృష్ణ: ఏంటి కోపమొచ్చిందా.. నిన్నేరా ఏబీసీడీల అబ్బాయి. అదే కోపమొచ్చిందా అని.. 
మురారి: ఒక్కసారి రా అనవా ప్లీజ్.. 
కృష్ణ: నిజంగా ముహూర్తం వాయిదా పడింది అనగానే చిన్న పిల్లాడిలా అలిగారు.
మురారి: హలో చిన్న పిల్లాడిలా ఏంటి.. నేను పెద్దొడిలానే హర్ట్‌ అయ్యాను. 
కృష్ణ: ఒక గేమ్ ఆడుదామా ఏసీపీ సార్.. అని దువ్వెన తెస్తుంది. దీంతో మీ వీపు వెనక లెటర్స్ రాస్తాను అది ఏంటో మీరు చెప్పాలి. ఇక ఎమ్‌, కే అని రాస్తుంది. అది కరెక్ట్‌గా మురారి చెప్పాడు. ఇక ఎమ్ కే అంటే ఏంటి అని అడుగుతాడు.
కృష్ణ: ఎమ్ అంటే మీరు కే అంటే నేను. 
మురారి: నేను అంటే ఎన్ ఉంటుంది కదా.. కే ఎలా..
కృష్ణ: కే అంటే కృష్ణ.. అని చెప్పి ఏబీసీడీల అబ్బాయి అని రాయబోతే ముందే మురారి చెప్తేస్తాడు. ఇక కృష్ణ ఇంకేటో రాయబోతుంటే ఇది తెలుగు కాదు అని మురారి అంటాడు.  అది చెప్పాల్సింది మీరే అని కృష్ణ అంటుంది. 

మురారి కృష్ణని దగ్గరకు తీసుకొని మే తుమ్ సే ప్యార్ కర్‌తే హూ అని రాశావ్ అంటాడు. దానికి కృష్ణ సిగ్గు పడుతుంది. ఇక కృష్ణ పరుగెడితే వెంటపడి పట్టుకుంటాడు. ఇక అన్నీ ముహూర్తం తర్వాతే అని కృష్ణ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 

శకుంతల: ముకుంద ఇంత మారుతుంది అనుకోలేదు వదినా.. ఏమంటావ్ బిడ్డా. ఈ మధు బాబుకి ఆ ముకుంద మారింది అంటే మనసు రావడం లేదు. 
రేవతి: లేదు మధు వాళ్ల శోభనానికి కూడా ముకుంద తొందర చేస్తూనే ఉంది కదా. నాకైతే ఎలాంటి అనుమానం రావడం లేదు.
మధు: దేవ్‌ని చూసి కూడా ఇలాగే అనుకున్నాం కదా.. కానీ ఏమైంది. 
నందూ: లేదు మధు నువ్వు ఎన్ని అయినా చెప్పు నాకు అయితే నమ్మ బుద్ధి కావడం లేదు. దేవ్ విషయంలో అయితే నేను ఇంత స్ట్రాంగ్‌గా అపోజ్ చేయలేదు. వాడి యాటిట్యూడ్ నాకు ముందు నుంచే డౌట్ ఉండేది. 
శకుంతల: వదినా పండగ అయిన తర్వాత తొందరగా ముహూర్తం పెట్టించు అప్పుడు ఏ లొల్లి ఉండదు. 
మధు: మీరంతా ఎంత చెప్పినా సరే నేను ఈ విషయంలో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను. చూద్దాం చివరకు ఏం అవుతుందో. 

ఇక రాత్రి మురారి, కృష్ణ హాల్‌లో ఉండగా.. మధు వచ్చి భోగి మంట వేద్దాం అంటాడు. ఇంతలో గౌతమ్ కూడా వస్తాడు. ఇక అందరూ హాల్‌ దగ్గరకు చేరుకుంటారు. ఇక భవాని భోగిమంటలో వేయడానికి పనికి రాని వస్తువులను తీసుకురమ్మని చెప్తుంది. ఇక రేవతి అక్క మిమల్ని ఇంత సంతోషంగా చూసి ఎన్ని రోజులు అవుతుందో అంటుంది. ఇక భవాని నేను మాత్రం నిన్ను సంతోషంగా ఉండనిచ్చానా అంటుంది. ఇంట్లో అందరూ తమ తమ గదుల్లో పనికి రాని వస్తువులు తీసుకొని వస్తారు. మధు మాత్రం ఖాళీ చేతులతో వస్తాడు. ఏమైందని భవాని అడిగితే నా కంటే పనికిమాలినది ఈ ఇంట్లో ఇంకేం కనిపించడం లేదని అంటాడు. 

భవాని: మధు నేను ఏదో సరదాగా అన్నాను రా. నువ్వేందుకు బాధ పడతావు. నీ భాషలోనే చెప్తాను విను. ఒక అద్భుతమైన కథ ఒక హీరోకి చెప్తే హీరోకి నచ్చలేదు. అంతమాత్రానా ఆ డైరెక్టర్‌ గానీ నిరాశతో నేను పనికిరాను అనుకుంటాడా ఏంటి. ఇంకో హీరోకి చెప్పి ఆ కథని సూపర్ సక్సెస్ చేస్తాడు. అప్పుడు ఆ కథ నచ్చలేదు అన్న హీరో బాధ పడటం తప్ప ఇంకేం చేయలేడు కదా.. సో గో ఎహెడ్.

 కృష్ణ: రాడ్ తీసుకొని వచ్చి.. బయట ఇంతకు మించి పనికి రానిది ఏం కనిపించలేదు. ఏమైంది అందరూ అలా చూస్తున్నారు.
మురారి: అది ఐరన్ రాడ్.. మంట్లో చెక్కలు వేస్తారు. ఇనుము కాదు. 
కృష్ణ: నిజమే కదా.. పెద్దత్తయ్య పనికి రానిది అన్న మాట ఒక్కటే గుర్తుంది. అందరూ నవ్వుకుంటారు. 
భవాని: మీరు తెచ్చిన ఈ వస్తువులు మీకు ఎవరికీ పనికిరాకపోవచ్చు. అదే పేదవాలకి ఇస్తే వాళ్లు వాటిని కొంచెం బాగుచేసుకొని వాడుకుంటారు. కానీ బూడిదలో చేస్తే ఏం వస్తుంది. భోగి మంటల కోసం నేను ఆల్రెడీ కట్టెలు తీసుకురమ్మని చెప్పాను వెళ్లండి.
కృష్ణ: పెద్దత్తయ్య మీరు మాతో పాటు రావాలి. ప్లీజ్ అత్తయ్య రండి..
భవాని: సరే మీరు వెళ్లండి నేను వస్తాను. 
శకుంతల: భోగి మంటకు కట్టెలు పేర్చుతూ.. వదినా పెద్దవదిన నాతో మాట్లాడిందని సంతోషంగా చెప్తుంది. ఇక మధు కూడా రేపటి నుంచి తన లైఫ్ మారిపోతుంది అని అంటాడు. మురారి, గౌతమ్‌లు ఆటపట్టిస్తే కృష్ణ మధుని ఎందుకు అలా అంటారు తను పెద్ద డైరెక్టర్ అవుతాడు అంటుంది. మధు అప్పుడు ఎవర్ని దగ్గరకు రానివ్వకు అని చెప్తుంది. మరోవైపు ముకుంద వాళ్లందరూ ఉన్న దగ్గరకు రాకుండా దూరంగా నిల్చొని చూస్తుంది. ఇక భవానిని కూడా వస్తుంది. ముకుంద దూరంగా ఉండటం చూసిన కృష్ణ భవానికి చెప్పి ముకుందని కూడా పిలుద్దామని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  

Also Read: నాగ పంచమి సీరియల్ జనవరి12th: చనిపోయిన మోక్ష - పంచమిని బెదిరించి నాగమణి సొంతం చేసుకున్న కరాళి!

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 18th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
Nindu Manasulu Serial Today July 18th: నిండు మనసులు: కలిసిపోదాం గణ.. అర్థం చేసుకో.. ప్రేరణ ప్రపోజల్‌ని గణ ఒప్పుకుంటాడా!
నిండు మనసులు: కలిసిపోదాం గణ.. అర్థం చేసుకో.. ప్రేరణ ప్రపోజల్‌ని గణ ఒప్పుకుంటాడా!
Karthika Deepam 2 Serial Today July 18th: కార్తీకదీపం 2 సీరియల్: అత్తని ఓడించడానికి పోటీకి దిగిన అక్కాచెల్లెళ్లు! దీప, జ్యోత్స్న ఒకటిగా వంటలు చేస్తారా!
కార్తీకదీపం 2 సీరియల్: అత్తని ఓడించడానికి పోటీకి దిగిన అక్కాచెల్లెళ్లు! దీప, జ్యోత్స్న ఒకటిగా వంటలు చేస్తారా!
Nindu Noorella Saavasam Serial Today July 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చేయడానికి వచ్చిన స్వామిజీ – స్వామిజీని చూసి భయపడ్డ మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చేయడానికి వచ్చిన స్వామిజీ – స్వామిజీని చూసి భయపడ్డ మనోహరి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Anna Lezhneva Visits Thirumala: శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
Embed widget