అన్వేషించండి

Naga Panchami Serial Today January 12th: చనిపోయిన మోక్ష - పంచమిని బెదిరించి నాగమణి సొంతం చేసుకున్న కరాళి!

Naga Panchami Serial Today Episode పంచమి, ఫణేంద్ర కలిసి నాగమణి తీసుకురాగా కరాళి వాళ్లని భయపెట్టి నాగమణి సొంతం చేసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode: పంచమి నాగలోకంలో అడుగు పెడుతుంది. నాగలోకం మొత్తం చూసి ఆశ్చర్యంగా చూస్తుంది. ఆమె వెంటే ఫణేంద్ర కూడా ఉంటాడు. ఇక ఫణేంద్ర నాగలోకం ఎలా ఉంది యువరాణి అని అడిగితే.. నా కంటికి మోక్షాబాబు ప్రాణాలు తప్ప మరేం కనిపించడం లేదని పంచమి చెప్తుంది. నాగమణి ఎక్కడ ఉందో త్వరగా చూపించమని చెప్తుంది.

ఫణేంద్ర: చూపిస్తాను యువరాణి, మోక్షని బతికించిన తర్వాత తిరిగి నా దగ్గరకు వస్తావు కదా.. నిన్ను అనుమానించడం లేదు. నా భయం నాది. నా ప్రాణాలకు తెగించి నాగమణి విషయంలో నీకు సాయం చేస్తున్నాను.
పంచమి: ఇప్పుడు నాకు ఒక్కో క్షణం ఒక్కో యుగంలా ఉంది యువరాజా. అక్కడ మోక్షా బాబు బాధ భరించలేక నొప్పితో విలవిల్లాడిపోతుంటాడు. దయచేసి నా బాధని అర్థం చేసుకోండి. వీలైనంత తొందరగా మనం నాగమణిని తీసుకొని వెళ్లిపోవాలి. 
ఫణేంద్ర: అలాగే యువరాణి.. నాగదేవతకి ఏ మాత్రం అనుమానం వచ్చినా మన ఇద్దరిని ఇక్కడే భష్మం చేస్తుంది. విశ్రాంతి సమయం కాబట్టి ఇప్పుడు ఎవరూ ఉండరు నాతో రండి. (ఐదు తలల పెద్ద నాగుపాము తలపై నాగమణి ధగధగ మెరుస్తూ ఉంటుంది.) చూశావు కదా అదే నాగమణి. రాణి వంశస్తులు తప్ప మరెవరూ దాన్ని తాకలేరు నువ్వేల్లి ధైర్యం దాన్ని తీసుకురా యువరాణి. జాగ్రత్తగా తీసుకురా. 
పంచమి: అమ్మా నాగదేవత.. మీ అనుమతి లేకుండా నాగమణిని తీసుకెళ్లాలి అనుకుంటున్నాను. నేను చేసే ఈ పని తప్పే. ఏ ఆడదానికి అయినా భర్త తర్వాతే ఏదైనా. నా మాంగల్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ నాగలోకానికి తెలీకుండా నాగమణిని దొంగతనంగా భూలోకానికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. నేను చేసే ఈ తప్పునకు ఎటువంటి శిక్షనైనా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా భర్తను కాపాడటానికి నాకు వేరే మార్గం లేదు. ఈ నాగమణి ద్వారా నా భర్తని కాపాడుతానని ఈ తప్పు చేస్తున్నాను. నన్ను కనికరించి నా మీద ఆగ్రహం చూపకండి. ఇక నాగమణి పంచమి చేతుల్లోకి వస్తుంది. పంచమి దాన్ని పట్టుకొని చాలా సంతోష పడుతుంది. 
ఫణేంద్ర: త్వరగా వచ్చేయ్ యువరాణి ఇక ఇక్కడ నుంచి జాగ్రత్తగా బయటపడాలి. 

మరోవైపు మోక్షకి పసరులు పూసి నాగసాధువు జాగ్రత్తగా చూస్తుంటారు. 

మేఘన: పంచమి వచ్చేలోగా మోక్ష కనిపించకూడదు అప్పుడే నాగమణి నా చేతికి వస్తుంది. ఆగండి స్వామి మోక్ష చనిపోయాడు. ఒక్క నాగమణి తప్ప ఇంకే మోలికలు మోక్షని బతికించలేవు. మీకేమైనా పనులు ఉంటే మీరు చూసుకోండి స్వామి. వాళ్లు నాగమణి తెచ్చేవరకు మోక్షశరీరాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. 
నాగసాధువు: ఇంతకన్నా ముఖ్యమైన పని ఇంకేం లేదు. నేను ఇక్కడే ఉంటాను. 
మేఘన: ఈ సాధువు ఇక్కడే ఉంటే మోక్ష శరీరాన్ని మాయం చేయలేను. ఏదో ఒకటి చేయాలి. అనుకొని నాగసాధువు మీదకు మంత్ర శక్తులు ప్రయోగిస్తుంది దీంతో నాగసాధువు ఉక్కిరిబిక్కిరి అయి కళ్లు తిరిగి పడిపోతారు. ఇక మేఘన తన మంత్ర శక్తితో కనికట్టు వేసి మోక్ష శరీరం ఎవరికీ కనపడకుండా చేయాలి అని అనుకుంటుంది. మంత్ర శక్తితో కనికట్టు వేస్తుంది. దీంతో మోక్షశరీరం అక్కడే ఉన్నా ఎవరికీ కనిపించదు. ఇంతలో నాగసాధువు లేస్తారు. మోక్షశరీరం కనిపించకపోయేసరికి కంగారు పడతారు. మోక్షని ఏం చేశావ్ అని నాగసాధువు అడగడంతో ఆయన శరీరాన్ని కాల్చి బూడిద చేస్తుంది. 

మరోవైపు పంచమి, ఫణేంద్రలు నాగమణిని తీసుకొస్తారు. మోక్ష కనిపించకపోవడంతో మేఘన మోక్ష ఎక్కడ అని అడుగుతుంది. 

మేఘన: మేఘన కాదు కరాళి.. అవును పంచమి నేను కరాళినే.. నాగమణి కోసమే మేఘన పేరుతో నీ పక్కన చేరాను. నేను నీ పక్కన బల్లెంలా ఉన్నా నువ్వు కనిపెట్టలేకపోయావు. 
ఫణేంద్ర: అంటే నువ్వు నాగకన్యవి కాదా.. నిన్ను ఏం చేస్తానో చూడు.
కరాళి: ఆగు.. మీ ప్రతాపాలు నా దగ్గర పనికి రావు. ప్రాణం పోయిన నీ మోక్షని మళ్లీ ప్రాణంతో చూడాలి అంటే ముందు ఆ నాగమణి నా చేతికి ఇవ్వు. 
పంచమి: నేను ఇవ్వను కరాళి. మర్యాదగా నా మోక్షాబాబుని ఏం చేశావో చెప్పు. 
కరాళి: ఆ నాగమణి నా చేతికి ఇస్తేనే చెప్తాను. లేదంటే మోక్ష ఇంకెప్పటికీ నీకు కనిపించడు. 
పంచమి: నీకు దండం పెడతాను కరాళి మోక్షాబాబు ఎక్కడున్నాడు. 
కరాళి: ప్రాణాలతో మాత్రం లేడు పంచమి. నువ్వు ఆ నాగమణిని నీ చేతికిస్తే నేను మొదట నా అన్న నంబూద్రిని బతికించుకొని ఆ తర్వాత మోక్షకి కూడా ప్రాణం పోస్తాను. 
పంచమి: మోక్షాబాబు ఎక్కడున్నాడో చూపించి కరాళి అప్పుడు ఈ నాగమణిని నీకు ఇచ్చేస్తాను. 
కరాళి: ముందు నాగమణిని ఇవ్వు. ఆ తర్వాత నీ మోక్ష కనిపిస్తాడు. ఆలస్యం చేస్తే చనిపోయిన నీ భర్త శరీరాన్ని పురుగులు తీనేస్తాయి పంచమి. తర్వాత బతికించుకోవడం కష్టం. నీ చేతుల్లో చనిపోయిన నా అన్న నంబూద్రి శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను.  నా మాట నమ్ము. నీకు మరో దారి లేదు పంచమి త్వరగా ఇవ్వు. 

పంచమి నాగమణిని బయటకు తీయగానే మొత్తం కాంతిమయం అవుతుంది. ఇక పంచమి నాగమణిని కరాళి చేతికి ఇస్తుంది. నాగమణిని తాకిన పంచమి ఆనందంతో అన్నా వచ్చేస్తున్నా.. నీ చెల్లెలు కరాళి నాగమణిని సంపాదించింది.. ఇప్పుడే నిన్ను బతికించుకుంటాను అన్నా అని అంటుంది. ఫణేంద్ర చాలా భయపడతాడు. ఇక కరాళి నాగమణి తీసుకొని వెళ్తుంది. కొంత దూరం వెళ్లే సరికి నాగమణి తన చేతి నుంచి మాయం అవుతుంది. కరాళి షాకైపోతుంది. దీంతో ఇదంతా కల అని కరాళి అనుకుంటుంది. ఇదే కల కచ్చితంగా నిజం కావాలి అని అనుకుంటుంది. ఇక నాగసాధువు వచ్చి పంచమి, మోక్షలతో నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించారు అని ప్రశ్నిస్తారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్ జనవరి12: మురారికి కృష్ణ ప్రేమ పరీక్ష, ఐ లవ్‌ యూ అని చెప్పగానే అతుక్కుపోయిన తింగరి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Embed widget