krishna Mukunda Murari Serial Today February 8th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: మురారి బిడ్డకు తానే తల్లి అన్న ముకుంద.. టెన్షన్‌లో కృష్ణ, ఆదర్శ్!
Krishna Mukunda Murari Serial Today Episode మురారి, తాను ఒకటే అని ముకుంద కృష్ణ, ఆదర్శ్‌లతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode కృష్ణ చీర కట్టుకుంటుంటే మురారి సాయం చేస్తాడు. కృష్ణ సిగ్గు పడుతుంది. ముకుంద, ఆదర్శ్ సరిగా ఉంటున్నారా అని కృష్ణ అంటుంది. నీకు ఎందుకు ఆ అనుమానం వచ్చిందని మురారి అడిగితే నాకు కాదు పెద్దత్తయ్యకు వచ్చిన అనుమానం నిజమేనేమో అని నా అనుమానం అని.. లేకపోతే ఊరికే అంత పెద్ద అనుమానం ఎలా వస్తుంది అని అంటుంది.
మురారి: నిజమే కానీ మనకు అలా అనిపించడం లేదే..
కృష్ణ: కానీ మనం సరిగా పరిశీలించడం లేదేమో.. ఇప్పుడు బయటకు వెళ్తాం కదా అక్కడ సరిగా పరిశీలిద్దాం. ఇక రెండు జంటలు కారులో బయటకు వెళ్తారు.. కారులో.. ఇద్దరూ ఏ సంబంధం లేకుండా ఎవరికి వారు బయటకు చూసుకుంటున్నారు ఏంటి. పెద్దత్తయ్య అనుమానం నిజమేనా.. ముకుంద మారలేదా.. మరి ఆదర్శ్‌కి ఏమైంది తను అయినా మాట్లాడొచ్చుకదా.. ఏసీపీ సార్ కారు ఆపండి. ఇంటికి వెళ్దాం పదండి. లేకపోతే మరేంటి సరదాగా బయటకు వచ్చింది ఎవరికి వాళ్లు మూతులు ముడుచుకొని దిక్కులు చూసుకోవడానికా..
మురారి: అంటే ఇప్పుడు డ్రైవింగ్ మానేసి నీతో కబుర్లు చెప్తూ కూర్చొవాలా.. అయినా నువ్వే కదా ఎప్పుడూ వాగుతూ ఉంటావు. స్టార్ట్ చేయ్.. (కృష్ణ ముకుంద వాళ్లు గురించి సైగ చేస్తే.. ) కదా.. నువ్వు ఒక్కదానివే ఎంత సేపు మాట్లాడుతావ్. ఏంటి ఆదర్శ్ మీరిద్దరూ ఏం మాట్లాడరేంటి.
ఆదర్శ్: నేనా..
కృష్ణ: కాదు పక్కనే ఉన్న వాళ్లు. లేకపోతే కారు ఎక్కినప్పటి నుంచి చూస్తున్నా ఎవరికీ సంబంధం లేనట్లు ఎవరి లోకంలో వారు ఉన్నారు. అర్థమైంది ఏసీపీ సార్ మనం ఏదో పార్టీ పార్టీ అంటే ఇలా వచ్చారు కానీ మనతో బయటకు రావడం ఇష్టంలేదు.
ఆదర్శ్: అదేం లేదు కృష్ణ ఇష్టం లేకపోతే నేనే చెప్పేవాడిని కదా..
ముకుంద: మనసులో.. ఇప్పుడు ఏదో ఒకటి మ్యానేజ్ చేయాలి లేదంటే నాకు ఇష్టం లేదు అని వీళ్లకి డౌట్ వస్తుంది.
కృష్ణ: మరి అయితే మాట్లాడాలి కదా.. ఏసీపీ సార్ ఏదో కారు డ్రైవర్ అయినట్లు. మీరు ఏదో క్యాబ్ షేర్ చేసుకున్నట్లు సంబంధం లేకుండా కూర్చొన్నారు ఏంటి.
మురారి: ఆదర్శ్ మీరు ఏదో ఒకటి మాట్లాడకుంటే నన్ను క్యాబ్ డ్రైవర్‌ని చేసేలా ఉంది.
ముకుంద: మాట్లాడకపోవడానికి ఏంలేదు నాకు ఇష్టమైనా పాట వస్తే వింటున్నాను అందులోనే లీనం అయిపోయాను. ఇక కృష్ణ వేరు పాటలు పెడితే మురారి తనకు నచ్చిన పాట పెడతాడు. ముకుంద కూడా మురారికి నచ్చిన పాటే తనకు ఇష్టం మేం ఇద్దరం ఒకటే అంటుంది. ఆ మాటకు ఆదర్శ్, కృష్ణ షాక్ అయిపోతారు. ఇక పాటల టేస్ట్ అంటూ ముకుంద కవర్ చేస్తుంది.
కృష్ణ: గుడికి వచ్చి.. మురారితో.. ఏసీపీ సార్ ఏం జరుగుతోంది. కారులో జరిగిన దాని గురించి ముకుంద ఏంటి మీరిద్దరూ ఒకటి అంటుంది.
మురారి: పాటల గురించి అంది. నువ్వేందుకు ఏదేదో ఊహించుకుంటున్నావ్. ముకుంద మారిపోయింది. నామీద అప్పుడు ఉన్న ఫీలింగ్స్ ఇప్పుడు లేవు. నువ్వు అర్థం చేసుకోకపోతే మరెవ్వరు అర్థం చేసుకుంటారు.
కృష్ణ: అయ్యో ఏసీపీ సార్ నేను అలా ఏం అనడం లేదు. ఇప్పుడు వాళ్లిద్దరు భార్యభర్తలు ఒకరికి నచ్చిన పాట మరొకరికి నచ్చింది అని చెప్పొచ్చు. ముకుంద ఏమో నీకు నచ్చిన పాట నచ్చింది అంటుంది. ఆదర్శ్ ఏమో నాకు నచ్చిన పాట నచ్చింది అన్నాడు. ఇలా అభిప్రాయబేధాలు ఉంటే ఎలా..
మురారి: తింగరి.. మరి నాకో పాట నచ్చితే నీకు ఇంకోపాట ఎలా నచ్చింది. ఇష్టాలు వేరేలా ఉన్నంత మాత్రాన ఇష్టంలేదు అని కాదు. అయినా ఆదర్శ్ కావాలనే అలా చెప్పాడు. మేం ముగ్గురం ఒకటి చెప్తే నువ్వెక్కడ బుంగమూతి పెట్టుకుంటావో అని ఆదర్శ్ అలా చెప్పాడు.
కృష్ణ: అయితే ముకుంద ఆదర్శ్‌కి ఒకరంటే ఒకరికి ఇష్టమే కదా.. డౌట్ ఏం అక్కర్లేదు కదా..
మురారి: అంటే అది పెద్దమ్మకి అనుమానం ఉంది కదా కాబట్టి మనం అబ్జర్వ్ చేయాలి. అయినా అది చేద్దామనే కదా ఇక్కడికి తీసుకొచ్చావ్.
ముకుంద: వీళ్లు రాలేదు ఏంటి.
ఆదర్శ్: కావాలనే ఆగిపోయినట్లు ఉన్నారు. మనద్దరికీ ఏకాంతం ఇవ్వడానికి. వాళ్లు మనద్దరి కోసం చాలా కష్టపడుతున్నారు. మనద్దరినీ ఒకటి చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. కానీ మనమే ఎందుకో దగ్గర కాలేకపోతున్నాం.
ముకుంద: మనసులో.. భగవంతుడా.. గుడిలో కూడా ప్రశాంతత లేదు. ఈయన ఈఆలోచన నుంచి దూరం కావడం లేదు.
కృష్ణ: మీరేదో సీరియస్‌గా మాట్లాడుతున్నారు. మేం ఇబ్బంది పెట్టామా..
ముకుంద: టైంకి వచ్చి రక్షించారే బాబు. రెండు జంటలు దేవుణ్ని దర్శించుకుంటారు. రెండు జంటల్ని పంతులు దీవిస్తారు. రెండు జంటలు ఏడాదిలో పండంటి బిడ్డని తీసుకొని రావాలి అంటారు. దానికి ముకుంద మనసులో మా ఇద్దరం కలిసి రావడం జరగదు. ఇద్దరిలో ఒకరే మురారి బిడ్డకు తల్లి అవుతారు అనుకుంటుంది. మళ్లీ ఏంటి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని కృష్ణకి అన్యాయం చేయకుండా తనకు కలలో కూడా అలాంటి ఆలోచనలు రాకుండా చేయు అని కోరకుంటుంది.
ఇక ముకుంద, కృష్ణలు ధ్వజస్తంభం దగ్గర దీపాలు పెట్టి మొక్కుంటుంటారు. ఇంతలో ధ్వజస్తంభం నుంచి గంట కింద పడుతుంది. దీంతో పంతులు వచ్చి ఇలా జరిగింది ఏంటి అది మనకే కాదు దేవాలయానికి కూడా కీడే అని అంటారు. అందరూ షాక్ అవుతారు. కృష్ణ ఇంకా టెన్షన్ పడుతుంది. ముకుంద కూడా తన కోరికలు జరగవా ఊహించనిది ఏదో జరుగుతుందా అని టెన్షన్ పడుతుంది. ఆదర్శ్ ముకుందకు ధైర్యం చెప్తాడు. తర్వాత కృష్ణకు నచ్చచెప్తాడు. ఇంతలో కొబ్బరి చిప్ప కొట్టగానే ఆదర్శ్ చేతికి దెబ్బతగులుతుంది. ముకుంద మాత్రం పట్టించుకోకుండా ఏదో ధ్యాసలో ఉంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ఈగల్: రవితేజ 'ఈగల్'ను ఎన్ని కోట్లకు అమ్మారు? ఎన్ని కోట్లు వస్తే హిట్టు?