అన్వేషించండి

Krishna Mukunda Murari Serial Today Februaru 19th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: కృష్ణని చంపేస్తానని ముకుందతో చెప్పిన దేవ్.. ఆదర్శ్‌కి నిజం చెప్పేందుకు ముకుంద అంతకు తెగించిందా!

Krishna Mukunda Murari Serial Today Episode కృష్ణని చంపేస్తాను అని ముకుందకు ఫోన్ చేసి దేవ్ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Today Episode కృష్ణ, మురారి, ముకుంద, ఆదర్శ్‌లు రిస్టార్ట్‌కి వస్తారు. ఇక రూమ్స్ బుక్ చేయాలి అని రిసెప్షన్‌ దగ్గర అడిగితే అల్రెడీ రెండు రూమ్‌లు మీ పేరు మీద బుక్ అయ్యాయని అంటాడు. దీంతో నలుగురు షాక్ అవుతారు. ముకుంద పేరు మీద బుక్ అయ్యాయని అంటారు. దీంతో అందరూ ముకుందని చూస్తారు. 

కృష్ణ: ముకుంద ఆల్రెడీ బుక్ చేసేశావా చెప్పనే లేదు. సర్‌ఫ్రైజ్ చేద్దాం అనుకున్నావా.
ఆదర్శ్‌: ముకుంద బుక్ చేశావ్ అని తెలిసిపోయిందిలే. కానీ వేరే వాళ్ల పేరుమీద బుక్ చేసి ఉంటే మా అందరకీ తెలియకపోయేది. 
మురారి: నేను అప్పుడే అనుకున్నాను రూమ్స్ బుక్ చేయకుండా ఇంత ధైర్యంగా ఎలా తీసుకొచ్చిందా అని సూపర్ ముకుంద.. 
ముకుంద: మనసులో.. నేను బుక్ చేయకుండా నా పేరు మీద రూమ్స్ బుక్ అవ్వడం ఏంటి. అయినా నా పేరు మీద ఎవరు బుక్ చేసుంటారు. వీళ్లే ఏమైనా చేసుంటారా.. సరే సరే దాని గురించి ఇప్పుడు ఎందుకు ఆదర్శ్‌కి విషయం ఎలా చెప్పాలా అనేది ఆలోచించాలి.
కృష్ణ: మనసులో.. ముకుంద పేరు మీద రూమ్స్ ఎలా బుక్ అయ్యాయని ఆలోచిస్తున్నట్లుంది నేనే చేశాను అని తెలీదు పాపం. అప్పుడే ఏముంది ఇంకా ముందు ముందు చాలా థ్రిల్ అయ్యే మేటర్స్ ఉన్నాయి. 

రెండు జంటలు వారి వారి రూమ్స్‌లోకి వెళ్తారు. ఇక రేవతి భవాని అమెరికా వెళ్లింది అని నెలరోజుల వరకు రాదు అని ఎవరికో ఫోన్‌లో చెప్తుంది. 

మధు: పెద్దమ్మ ముకుంద వాళ్లని పని కట్టుకొని ఎందుకు బయటకు తీసుకొని వెళ్లినట్లు.
రేవతి: రేయ్ నీకు అన్నీ అనుమానాలేరా వాళ్లు సరదాగా బయటకు వెళ్లారు అందులో నీ డౌట్ ఏంటి.
మధు: అసలు ముకుంద ఇంత హుషారుగా ఉండటం ఏంటి. ఆదర్శ్‌ వచ్చినప్పుడు కూడా ఇలా లేదు. పెద్ద పెద్దమ్మకు కూడా అదే డౌట్.. ముకుంద ఇంత సడెన్‌గా యాక్టివ్ అవ్వడం వెనక ఏదో ఒక కారణం ఉంటుంది పెద్దమ్మ. వాళ్లు తిరిగి వచ్చిన తర్వాత ఏదో ఒక మ్యాటర్ చెప్తారు చూడు. 
రేవతి: రేయ్ నువ్వు ఆపరా.. 

మురారి: కృష్ణ మనల్ని ఇక్కడ ఆపేవారు లేరు నాకు నువ్వు నీకు నేను. మనల్ని ఎవరూ డిస్ట్రబ్ చేయరు.
కృష్ణ: ఏబీసీడీల అబ్బాయి ఎక్కువ కలలు కంటున్నారు కానీ ముందు ఫ్రెష్ అయిరా బయటకు వెళ్దాం.  
మురారి: బయటకు వెళ్లే ఛాన్సే లేదు. రూంకి తాళం వేసేశా.. మన శోభనానికి ఇప్పటికి వరకు ముహూర్తాలు కుదర్లేదు కాబట్టి ఇప్పుడు ముహూర్తాలు ఇక లేవు. అంటూ దగ్గరకు తీసుకుంటాడు. 
ముకుంద: మనసులో.. నా పేరున రూం ఎవరు బుక్ చేశారు. నన్ను ఆటపట్టించడానికి వీళ్లు ముగ్గురు కలిసి చేశారా అసలు అంత అవసరం ఎవరికి ఉంది. దేవ్ ఏంటి నాకు కాల్ చేస్తున్నాడు. చెప్పు దేవ్..
దేవ్: ఏంటి నీ మొగుడుతో శోభనం చేసుకోవడానికి వచ్చావా.
ముకుంద: పిచ్చిపిచ్చిగా వాగితే పళ్లు రాలుతాయ్. నాకు మొగుడు అయితే సరిపోతుందా నేను మొగుడు అనుకోవద్దా. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఈ ముకుంద మనసు మారదు. ఆ సంగతి పక్కన పెట్టుకాని.. దేవ్ ఇక్కడ నా వెనక ఏదో కుట్ర జరుగుతుందిరా. నేను బుక్ చేశాను అని ఎవరో రూమ్స్ బుక్ చేశారు రా. ఎవరు చేశారో తెలీదురా..
దేవ్: ఎవరు కృష్ణ చేసుంటుంది. నీ జీవితానికి తనో పెద్ద అడ్డు కదా. ఆ అడ్డు తొలగించడం అంటే అస్సలు కుదరడం లేదు.
ముకుంద: ఆ అవసరం ఇప్పుడు లేదు. 
దేవ్: మీ లొకేషన్ పంపించు వీలుంటే కృష్ణని.. 
ముకుంద: ప్రాణాలు తీయడం లాంటి పిచ్చి పనులు మాత్రం చేయకు. నాకు అడ్డు పడకుండా ఉంటే చాలు. కృష్ణ చాలా మంచిదిరా. అప్పుడే ఆదర్శ్‌ వస్తాడు. ముకుంద చూసి షాక్ అవుతుంది. సరే అన్నయ్య ఉంటాను. నువ్వు అడిగింది ఇస్తాను.
ఆదర్శ్‌: ఎవరితో మాట్లాడుతున్నావ్.
ముకుంద: మా అన్నయ్య ఒకరు ఇక్కడ రిసార్ట్ ఎలా ఉంది అంటే.. 
ఆదర్శ్‌: కృష్ణ మంచిది అంటున్నావ్ చెడ్డది అని మీ అన్నయ్య అనుకుంటున్నాడా.
ముకుంద: అదేం లేదండి.. 

ఇక నలుగురు బయటకు వచ్చి కూర్చొంటారు. దీంతో మురారి మీమల్ని కూడా హౌస్ కీపింగ్ వాళ్లు గెంటేశారా అని సెటైర్ వేస్తాడు. ఇక మాటల్లో మురారి మందు తాగుతామని కృష్ణని అడుగుతాడు. ఇది కూడా వద్దు అన్నావు అంటే అంటాడు. దానికి ఆదర్శ్‌ ఇది కూడా అంటే ఇంకేంటి వద్దు అంది అంటాడు. దానికి మురారి కవర్ చేస్తాడు. ఇక ఇద్దరూ మందు తాగడానికి పర్మిషన్ ఇస్తారు.

ముకుంద: మనసులో.. ఆదర్శ్‌ మందు తాగితే నా మనసులో మాట చెప్తే అర్థం చేసుకుంటాడు. కానీ చెప్పడానికి నాకు ధైర్యం చాలడం లేదే మందు తాగితే ధైర్యం వస్తుంది అని మధు చెప్తాడు కదా నేను కూడా కొంచెం తాగితే.. 

మరోవైపు ముకుంద గురించి మధు చెప్పిన మాటలు రేవతి గుర్తుచేసుకొని ఆలోచిస్తుంది. మధు రావడంతో ముకుంద మారకపోతే ఆదర్శ్ పరిస్థితి ఏంటి తట్టుకోగలడా అని అంటుంది. నిజంగా తట్టుకోలేడు అని మధు అంటాడు. ఈసారి ముకుంద ఆ తప్పు చేస్తే తనని వదలను అని మధు అంటాడు. ముకుంద ప్రాణాలు తీసేస్తా అంటాడు. దీంతో రేవతి మధుని తిడుతుంది. అయినా నేను ఊరుకోను అని మధు అంటాడు. 

ఇక ఆదర్శ్‌కి విషయం చెప్పడానికి ధైర్యం సరిపోవడం లేదు అని ముకుంద అనుకుంటుంది. ఇక తన విషయంలో ఏదో జరుగుతుంది అని ముకుంద అనుకుంటుంది. ఇంతలో ఆదర్శ్‌కి కశ్మీర్ నుంచి ఫోన్ వస్తుంది. దీంతో ఆదర్శ్‌ మందు వదిలేసి వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: వరుణ్‌ తేజ్‌: వాలెంటైన్స్‌ డేకు లావణ్య ఇచ్చిన గిఫ్టెంటీ? - వరుణ్‌ తేజ్‌ షాకింగ్ రిప్లై!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
Embed widget