Air India Flight Bird Strike: కొలంబో- చెన్నై ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి.. ల్యాండింగ్ సమయంలో ఘటన
Chennai Colombo Flight Cancel | చెన్నైలో దిగిన ఎయిర్ ఇండియా విమానానికి పక్షి తగలడంతో తిరుగు ప్రయాణంలో విమానాన్ని నిలిపివేశారు. భద్రతా సిబ్బంది, టెక్నికల్ ఇంజినీర్లు తనిఖీ చేస్తున్నారు.

Air India Flight | చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై విమానాశ్రయం సమీపంలో ప్రమాదం తప్పింది. కొలంబో నుండి 158 మంది ప్రయాణికులతో చెన్నైకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానాన్ని పక్షి ఢీకొట్టింది. విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. అయితే పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా విమానం నుంచి దిగిపోయారు. దాంతో కొలంబోకు తిరిగి వెళ్లే విమానాన్ని ఎయిర్ ఇండియా రద్దు చేసింది. సాధారణ తనిఖీలో పక్షిని ఢీకొన్నట్లు గుర్తించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.
తనిఖీలు చేపట్టిన టెక్నికల్ ఇంజినీర్లు, సిబ్బంది
ఈ ఘటన తరువాత, ఎయిర్ ఇండియా ఇంజనీర్లు తనిఖీలు నిర్వహించడానికి విమానాన్ని గ్రౌండ్ చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా ఎయిరిండియా విమానయాన సంస్థ చెన్నై నుంచి కొలంబోకు తిరిగి వెళ్లే విమానాన్ని రద్దు చేసింది. బయలుదేరే ప్రయాణికులను సహాయం చేయడం, ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయడంతో 137 మంది ప్రయాణికులు ఏ ఇబ్బంది లేకుండా తమ ప్రయాణాన్ని యథావిధిగా కొనసాగించారు.
రెండు రోజుల కిందట ర్యాట్ ఘటన..
అమృత్‌సర్, బర్మింగ్‌హామ్ మధ్య నడుస్తున్న మరో ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ రెండు రోజుల కిందట ప్రమాదం నుంచి తప్పించుకుంది. రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) అత్యవసర బ్యాకప్ పవర్ సిస్టమ్ ఫైనల్ అప్రోచ్ సమయంలో తెరుచుకోవడంతో భయాందోళన నెలకొంది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కమాండ్ చేయని RAT ఓపెన్ కావడంపై దర్యాప్తు చేపట్టింది. రెగ్యులేటర్ ప్రకారం, ఎత్తులో ఉన్న సమయంలో దాదాపు 400 అడుగుల ఎత్తులో టర్బైన్ సరిచేశారు. ఊహించని సమస్య తలెత్తినప్పటికీ పైలట్ ఎటువంటి సమస్యలు లేవని రిపోర్ట్ చేస్తూ ఎయిరిండియా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడని DGCA స్పష్టం చేసింది. గత కొన్ని నెలలుగా విమాన ప్రమాదాలు పెరిగాయి. ముఖ్యంగా జూన్ నెలలో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే క్రాష్ కావడాన్ని విమాన ప్రయాణికులు ఎవరూ మరిచిపోరు. ఈ ప్రమాదం తరువాత కొన్ని రోజులపాటు ఎయిరిండియా పలు విమాన సర్వీసులను రద్దు చేసింది.






















