Australia Squad against India: భారత్‌తో వన్డే, టీ20 సిరీస్ కోసం జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కెప్టెన్‌గా మిచెల్ మార్ష్
India vs Australia ODI series | ఎడమచేతి వాటం బ్యాటర్ మాట్ రెన్షా ఆస్ట్రేలియా A తరపున నిలకడగా రాణించడంతో ODI జట్టులోకి తీసుకున్నారు. వన్డే వరల్డ్ కప్ కోసం ఆసీస్ జట్టును సిద్ధం చేస్తోంది.

Ind vs Aus Captain Mitchell Marsh | ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య త్వరలో వన్డే, టీ20 సిరీస్ జరగనున్నాయి. అక్టోబర్ 19న ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల ODI, ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో తలపడనున్నాయి. BCCI ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ కు బీసీసీఐ బాధ్యతలు అప్పగించింది. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా వైట్ బాల్ సిరీస్‌ల కోసం తమ ఆటగాళ్లను ప్రకటించింది. 2 ఫార్మాట్‌లకు కెప్టెన్‌గా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్‌ను నియమించారు.
ఆస్ట్రేలియా జట్టును ప్రకటన
క్రికెట్ ఆస్ట్రేలియా త్వరలో జరగనున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వైట్-బాల్ సిరీస్ కోసం తన జట్లను అక్టోబర్ 7న ప్రకటించింది. ODIల కోసం 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేయగా, తొలి రెండు T20Iలలో 14 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ విశ్రాంతి తీసుకున్నాడు, దాంతో మిచెల్ మార్ష్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్, భవిష్యత్ టోర్నమెంట్‌లకు జట్టును తయారుచేస్తుంది. దాంతో యువ ఆటగాళ్లు మాట్ రెన్షా, మిచెల్ ఓవెన్ ODIలలో అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
https://t.co/8z0xuRENBZ | #AUSvIND pic.twitter.com/cdLQYkpFQn
— cricket.com.au (@cricketcomau) October 7, 2025
మాట్ రెన్షా ODI అరంగేట్రం కోసం ఖాయమా..
ఎడమచేతి వాటం బ్యాటర్ మాట్ రెన్షా ఆస్ట్రేలియా A జట్టుకు ఆడుతూ నిలకడగా రాణించాడు. దాంతో చివరికి ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ODIలో అరంగేట్రం చేయవచ్చు. జూలైలో శ్రీలంక Aతో జరిగిన మ్యాచ్‌లలో ఇటీవలి స్కోర్లు 80, 106, 62 అతడికి జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చేలా చేశాయి. స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఈ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో 2027 ODI ప్రపంచ కప్‌నకు ముందు ఆస్ట్రేలియా దీర్ఘకాలిక ప్లాన్ పై ఫోకస్ చేసింది. దాంతో రెన్షా మిడిల్ ఆర్డర్‌లో ఉండటం చాలా కీలకంమని ఆసీస్ మేనేజ్‌మెంట్ భావించింది.
ఇండియాతో వన్డే, టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్లు
ఆస్ట్రేలియా వన్డే జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కానోలీ, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), బెన్ డ్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మాథ్యూ రెన్షా, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.
T20Iలు (మొదటి 2 మ్యాచ్‌లు): మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్,జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమన్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా.
ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టు
భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్.
భారత T20I జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శివం దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు సామ్సన్ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, రింకు సింగ్,హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.





















