Krishna Mukunda Murari Serial Today December 27th Episode - ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్: మురారి, భవానీల మాటల యుద్ధం, కాలుజారి పడ్డ కృష్ణ!
Krishna Mukunda Murari Today Episode - మధుకి దేవ్, ముకుందల మీద అనుమానం రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Telugu Serial Today Episode :
మురారి: చూశావా కృష్ణ నేను నీకు ఎంతలా చెప్పాను. వీళ్లకి కాఫీ తీసుకురావడానికి నువ్వు ఏమైనా పని మనిషివా నువ్వే ఓ అంటే ఓవరాక్షన్ చేసుకుంటూ తీసుకొచ్చావు. ఇప్పుడు అర్థమైందా.
భవాని: షభాష్.. మురారి.. కేసు తేలకముందే నువ్వు వేరు మేము వేరు అని చెప్పకనే చెప్పేశావ్ అన్నమాట. ఇక కేసులు ఎందుకు పంచాయతీలు ఎందుకు. నువ్వు ఇక ఎంత చెప్పినా కప్పిపుచ్చుకోవడమే తప్ప ఇంకేం కాదు. రాత్రి నేను చాలా క్లియర్‌గా కేసు తేలే వరకు రావొద్దు అని చెప్పాను. అయినా ఫలితం లేదుగా..
మురారి: మీకు ముందే చెప్పాను కదా.. కృష్ణ ఈ ఇంటికి రావొచ్చు పోవచ్చు అని.
భవాని: ఎందుకు మురారి ఇలా నటించడం అలవాటు చేసుకుంటున్నావు. చెప్పాలి అంటే నటించడం కాదు మమల్ని చీట్ చేస్తున్నావ్. మమల్ని ఫూల్‌ని చేస్తున్నావ్.
కృష్ణ: అయ్యో పెద్దత్తయ్య ఏమైనా ఉంటే నన్ను అనండి. తప్పు చేశాను అని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీరు ఎన్నిఅన్నా నేను పడతాను. కానీ ఏసీపీ సార్..
భవాని: నోర్ముయ్.. నాకు చెప్పడం ఏంటి.. ఎవర్ని ఏం అనాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా..
మురారి: పెద్దమ్మ ఏం నటించాను. ఏం మోసం చేశాను. వచ్చే శుక్రవారం లోపు కేసు తేలకపోతే ముకుందను పెళ్లి చేసుకుంటా అన్నాను. నేను మాట తప్పలేదు.
భవాని: ఇప్పుడు జరుగుతున్నది చూస్తే ఎవరైనా మాట తప్పడమే అంటారు. నువ్వు నిజంగా సిన్సియర్‌గా ప్రయత్నం చేస్తే ఈ పాటికే కేసు తేలిపోయేది. కానీ నీ టైంఅంతా అవుట్ హౌస్‌లోనే ఉంటే ఇంకేం తేలుతుంది.
మురారి: కృష్ణ పట్ల మీలో ఇంత అయిష్టత ఉందని నాకు తెలీదు.
భవాని: పొరపాటు పడుతున్నావ్.. మురారి.. గతం మర్చిపోయి మాట్లాడుతున్నావు. నాకు ఎవరి మీద అయిష్టత ఇష్టత ఉండవు. వాళ్లు చేసే పనిమీద అవి ఆధారపడి ఉంటాయి. నాకే కాదు ఎవరికి అయినా అది సహజమే.
రేవతి: పోనీలే అక్క.. కృష్ణ ఆ కాఫీ తీసుకెళ్లిపో..
మురారి: ఇంత జరిగాక కూడా కాఫీ ఇవ్వడానికి తనకి పౌరుషం లేదు అనుకున్నారా..
ముకుంద: అయినా నీకు కాఫీలు పెట్టుకురమ్మని మేం చెప్పలేదు కదా కృష్ణ ఎందుకు మా పరువు తీస్తావు.
కృష్ణ: అదేంటి ముకుంద కాఫీ తీసుకొస్తే పరువు పోతుందా..
భవాని: అవన్నీ నువ్వు కేసులో గెలిచాక.. కేసు తేలక ముందు చేస్తే మమల్ని మంచి చేసుకోవడానికి చేసినట్లు ఉంది.
మురారి: కృష్ణకి అంత అవసరం లేదు.. ఈ క్షణం నుంచి అసలైన దోషుల్ని పట్టుకుంటా.. కృష్ణ రెండు రోజుల్లో నువ్వు ఈ ఇక్కడ శాశ్వతంగా ఉంటావు.
మరోవైపు నందు తన భర్త గౌతమ్‌కి కాల్ చేస్తుంది. ఎప్పుడు వస్తావ్ అని గౌతమ్ నందూని అడిగితే శుక్రవారం వరకు రాను అని చెప్పతుంది. ఇక మధు నందూ దగ్గరకు వస్తాడు. ఏం అయింది అని నందూ అడిగితే మురారి గురించి ఆలోచిస్తున్నా అంటాడు. ఇక మురారి ప్రశ్నించడం మొదలు పెట్టాడు అని.. కృష్ణని వెనకేసుకు వస్తున్నాడు అని మధు మురారిని పొగిడేస్తాడు.
ముకుంద: దేవ్ ఇక్కడ ఏం చేస్తున్నావురా.. మురారి స్పీడు చూస్తేంటే నిజం ఇవాళో రేపో బయట పడేసేలా ఉన్నాడు.
దేవ్: వాడి మొఖం ఇలాంటి వాళ్లని నేను చాలా మందినే చూశాను.
ముకుంద: ఏమోరా నాకు అయితే కృష్ణ నిన్ను గమనిస్తుంది అని డౌట్‌గా ఉంది. నా వైపు అదోలా చూస్తుంది ఈమధ్య. మురారి కూడా అలానే చేస్తే..
దేవ్: మధు వాళ్ల వైపు రావడం చూసి.. ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్ ముకుంద.. నువ్వు చాలా మొండిగా మాట్లాడుతున్నావ్. కృష్ణ చాలా మంచిది ఒక్క నిమిషం ఆలోచించు. కొంచెం జాగ్రత్తగా ఉందాం.
మధు: ఈ దేవ్‌ని ఎందుకో నమ్మబుద్ది కావడంలేదు. కొంచెం ఓవర్ చేస్తున్నట్లు ఉంది.
కృష్ణ: ఇవాళ నేను ఏసీపీ సార్‌తో వెళ్తాను.. కేసు ఫైనల్ అవుతుంది. ముకుంద పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మా బంధం స్ట్రాంగ్ అవుతుంది. మరోవైపు మురారి కృష్ణని పిలుస్తాడు. అయితే కృష్ణ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినడం వల్ల మురారి పిలుస్తున్నా కృష్ణకు వినిపించదు. ఇక కృష్ణ పరుగున వచ్చి కాలు జారి పడిపోతుంది. దీంతో కాలు నొప్పితో నడవ లేకపోతుంది. మురారి కృష్ణని ఎత్తుకొని లోపలికి తీసుకొస్తాడు. మరోవైపు ఆ సీన్ అంత మీద నుంచి దేవ్, ముకుంద చూస్తుంటారు. మురారి,కృష్ణని అలా ఎత్తుకోవడం అదే లాస్ట్ అని దేవ్ ముకుందతో చెప్తాడు. ఇక మురారి బ్రేక్ ఫాస్ట్ చేయలేదు అని అందరూ డిస్కషన్ చేసుకుంటారు. ఇంతలో మురారి, కృష్ణని ఎత్తుకొని లోపలికి వస్తాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read : భార్య వదిలేసిన మూవీకి ధనుష్ దర్శకత్వం - ‘DD3’ వెనుక అంత కథ ఉందా?